అయోధ్య లో రామ మందిర నిర్మాణం పూర్తవడమే కాక బాలరాముడు కూడా అందులో కొలువుదీరాడు. మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) చేతుల మీదుగా ఈ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని పూర్తి చేయగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు దీనిని వీక్షించారు.
ఇక ఈ కార్యక్రమానికి రాజకీయ, సినీ, క్రీడా, వ్యాపార రంగాలతో పాటు వివిధ ఇతర రంగాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానించారు. మొత్తం 7 వేల మంది వీఐపీలకు రామ తీర్ధ క్షేత్ర ట్రస్ట్ ఆహ్వానాన్ని అందించినట్టు తెలుస్తోంది.
అయితే ఈ మహత్తర కార్యక్రమం లో పాల్గొన్న వీవీఐపీలు, వీఐపీలకు స్వామి వారి ప్రసాదాన్ని ప్రత్యేకంగా అందించినట్టు తెలుస్తోంది.
రామ తీర్ధ క్షేత్ర ట్రస్ట్(Rama Teerdha kshetra) వారు అందిస్తున్న ఈ ప్రసాదం ఒక కాషాయ రంగు స్వీట్ బాక్స్ లో ఉంటుంది. అందులో ఏడు రకాల ప్రసాదాలు ఉంటాయి. పూర్తిగా నేటితో చేసిన లడ్డులు రెండు, రామ దాన చిక్కి ఒకటి, బెల్లం తో తయారు చేయబడిన రేవ్ డీ, తులసి దళం, యాలకలు, స్వామీ వారి అక్షింతలు, కుంకుమ, దీపపు ప్రమిద ఉంటాయి.
అయితే ఈ ప్రసాదాల తయారీలో వాడినది మొత్తం స్వచ్ఛమైన నెయ్యి అని తెలుస్తోంది. అంతే కాదు ఈ కార్యక్రమం లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి వడ్డించిన ఆహారం లో కూడా స్వచ్ఛమైన నేతిని వాడారట. గుజరాత్(Gujarat) కి చెందిన గుజరాత్ సంత్ సేవా సదన్, భారతి గర్వి ఆధ్వర్యంలో మొత్తం 200 మంది పాకశాస్త్ర ప్రవీణుల నేతృత్వంలో తయారు చేయబడ్డాయి.