Srivalli first look release from pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), స్టార్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar)కాంబోలో వస్తున్న మూవీ పుష్ప 2 (Pushpa2).‘పుష్ప ది రూల్’ పేరుతో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ఇంకా జరుగుతూనే ఉంది.
ఈ మధ్యనే మూవీ రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా మేకర్స్ అనౌన్స్ చేశారు. ఎట్టిపరిస్థితుల్లో ఆగస్టు 15న పుష్ప2ను రిలీజ్ చేస్తామంటూ మేకర్స్ చెప్పేశారు. అయితే త్వరలో బన్నీ బర్త్ డే ఉంది. ఈ క్రమంలో ఫ్యాన్స్ కోసం ఓ స్పెషల్ వీడియోని రిలీజ్ చేయనున్నారు.
బన్నీ పుట్టినరోజు నాడు పుష్ప2 టీజర్ (Pushpa 2 Teaser)రిలీజ్ చేస్తున్నామని ముహూర్తం ఫిక్స్ చేశారు మేకర్స్. ఈలోపే నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna)పుట్టినరోజు ఇవాళ కావడంతో ఈ సినిమా నుంచి మరో అప్డేట్ అందించారు మేకర్స్. శ్రీవల్లి ఫస్ట్ లుక్ పోస్టర్ ను నెట్టింట్లో విడుదల చేశారు. దీంతో ప్రస్తుతం శ్రీవల్లి పిక్ ఓ రేంజ్ లో వైరల్ అవుతోంది. ఫ్యాన్స్ ఆమె లుక్ కి ఫిదా అవుతున్నారు.
ఆకుపచ్చని చీరలో అదిరింది :
ప్రస్తుతం టాలీవుడ్ ,బాలీవుడ్ ఇండస్ట్రీలో రష్మిక మందన్న(Rashmika Mandanna) హవా కొనసాగుతోంది. బాక్సాఫీస్ ను హిట్ సినిమాలతో ఓ ఊపు ఊపేస్తోంది. ఈ మధ్యనే సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga)డైరెక్షన్ లో వచ్చిన బాలీవుడ్ మూవీ‘యానిమల్’(Animal)తో అమ్మడు దేశ వ్యాప్తంగా డ్రీమ్ గర్ల్ గా మారిపోయింది.
తన అందం నటనతో ఫ్యాన్స్ ను ఫిదా చేసింది నేషనల్ క్రష్. పుష్ప సినిమాతోనే రష్మిక కు మంచి పేరు వచ్చింది. యానిమల్ సినిమాతో తన నట విశ్వరూపాన్ని చూపించింది. ఇకపోతే ఇవాళ ఈ బ్యూటీ పుట్టినరోజు. బర్త్ డే సెలబ్రేషన్స్ ను చాలా గ్రాండ్ గా జరుపుకుంటుంది. ఈ క్రమంలో పుష్ప2 (Pushpa2)మేకర్స్ అమ్మడికి మంచి గిఫ్ట్ ఇచ్చారు.
మూవీ నుంచి అమ్మడి ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ప్రొడ్యూజర్లు అఫీషియల్ సైట్ లో శ్రీవల్లి పోస్టర్ ను ఒదిలారు. ఆకుపచ్చని చీరని కట్టుకొని, ఒంటినిండా భారీగా బంగారు ఆభరణాలను అలంకరించుకుని రష్మిక అందరినీ మెస్మరైజ్ చేస్తోంది. అంతే కాదు నుదుటన కుంకుమ బొట్టుతో చాలా పద్ధతిగా కనిపిస్తోంది. పుష్ప గాడి పెళ్లాం అంటే ఆమాత్రం ఉంటుందని ఫ్యాన్స ఈ పిక్ కి కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.
‘ది గర్ల్ ఫ్రెండ్’లుక్ కూడా రిలీజ్ :
రష్మిక మందన్న(Rashmika Mandanna)చేతిలో ప్రస్తుతం పుష్ప 2 (Pushpa2), ది గర్ల్ ఫ్రెండ్, కుబేర సినిమాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి షూటింగ్ జరుపుకుంటున్నాయి. దీంతో రష్మిక వరుస షూటింగ్లతో బిజీ బిజీగా గడిపేస్తోంది. ఇక ఇవాళ ఈ అమ్మడి బర్త్ డే కావడంతో పుష్ప2 మేకర్సే కాదు ‘ది గర్ల్ ఫ్రెండ్’(The Girl Friend) మూవీ టీం కూడా రష్మిక ఫస్ట్ లుక్ ను రివీల్ చేశారు. మూవీలో రష్మిక క్యారెక్టర్ కు సంబంధించి రెండు చిత్రాలను మూవీ టీమ్ షేర్ చేసింది. ఈ పిక్స్ లో రష్మిక ఎంతో క్యూట్ గా కనపిస్తోంది. కాలేజ్ స్టూడెంట్ గా నటిస్తుందని తెలుస్తోంది.
Srivalli first look release from pushpa 2