Shriya Reddy: OG గురించి ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టిన శ్రియ రెడ్డి.
శ్రియ రెడ్డి.. సలార్ తరువాత సోషల్ మీడియాలో మారుమోగిపోతున్న పేరు.సలార్ లో రాధ రామ అనే కీలకమైన పాత్రలో నటించి, మరో శివగామిగా నెట్టింట ప్రశంసలు అందుకుంటోంది.
చాలా ఏళ్లు ఇండస్ట్రికి దూరమైన శ్రియ రెడ్డి, సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతుంది.
ఒకపక్క సలార్ విజయాన్ని ఆస్వాదిస్తూనే, వరుస ఆఫర్లతో బిజీగా ఉంది.
ప్రస్తుతం POWER STAR PAVAN KALYAN నటిస్తున్న భారీ ప్రాజెక్టు OG లో ఒక ముఖ్యమైన పాత్రలో శ్రియ రెడ్డి నటిస్తుంది.
OG ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ – శ్రియ రెడ్డి
ఇటీవల శ్రీయ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తాను ప్రస్తుతం నటిస్తున్న భారీ ప్రాజెక్టు OG గురించి ప్రస్తావించింది.
ఇది అందరూ యాక్షన్ సినిమా అనుకుంటున్నారు కానీ కాదు, దీనిలో యాబై శాతం మాత్రమే యాక్షన్ సన్నివేశాలు ఉంటాయి, మిగతా యాబైశాతం ఎమోషన్స్ ఉంటాయి.
OG సినిమా ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్ లాంటిది అని చెప్పింది.తరువాత పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ, ఆయన చాలా మృదు స్వభావి అని, ఆయన ఉన్న దగ్గర చాలా సెక్యూర్ గా ఉంటుందని అన్నారు.
OG సినిమా, సుజీత్ దర్శకత్వంలో ప్రస్తుతం షూటింగ్ లో ఉంది.ఈ సినిమాలో ప్రియాంక మోహన్ కథానాయికగా నటిస్తుంది.అభిమన్యు సింగ్ మరియు హరీష్ ఉత్తమం కీలకపాత్రలలో నటిస్తున్నారు.