డివైడర్ దూకి స్టాలిన్ కోసం స్వీట్స్ కొన్న రాహుల్

లోక్ సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం రాహుల్ గాంధీ చెన్నైలో పర్యటిస్తున్నారు. అయితే రాహుల్ చెన్నై లో పర్యటిస్తుండగా ఒక ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. రాహుల్ గాంధీ స్వయంగా ఒక మిఠాయి దుకాణానికి వెళ్లి స్వీట్స్ కొనుగోలు చేశారు. ఆయన ఆ స్వీట్స్ ను తమిళనాడు ముఖ్య మంత్రి స్టాలిన్ కు బహుకరించేందుకు కొనుగోలు చేశారు.

rahul డివైడర్ దూకి స్టాలిన్ కోసం స్వీట్స్ కొన్న రాహుల్

అందులో చిత్రమేముంది అనుకోవచ్చు, రాగుల గాంధీ స్వీట్ షాప్ ముందు కారు దిగి లోనికి వెళ్లి ఉంటె వింతేమీ ఉండదు, కానీ అయన రోడ్డు ఇవతల ఉంది అవతలవైపుకి డివైడర్ ను దాటుకుని మరీ వెళ్లారు. అందుకే అంత స్పెషల్ గా చెప్పుకోవాల్సి వచ్చింది. పైగా ఆ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. ఇక ఈ వీడియోను ఎక్స్ వేదికగా షేర్ చేసింది మరెవరో కాదు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ వీడియోను షేర్ చేసిన అనంతరం రేవంత్ రెడ్డి మరో విషయాన్నీ గుర్తుచేసుకున్నారు. ఒక నాడు ఇదే తమిళనాడు గడ్డమీద రాహుల్ తన తండ్రిని కోల్పోయారని చెప్పారు. అయితే ప్రేమ అనే దానితో ఈ ప్రపంచాన్ని జయించవచ్చని అన్నారు. ప్రేమ ప్రపంచాన్ని ఐక్యంగా ఉంచుతుందని ఈ విషయాలను రాహుల్ చాలా బలంగా నమ్ముతారని చెప్పుకొచ్చారు.

Leave a Comment