టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక ఆయన సినిమాలు రిలీజైతే థియేటర్లు బద్దలవ్వాల్సిందే. పవర్ ఫుల్ మాస్ డైలాగులు, అదిరిపోయే యాక్షన్ సీన్స్ .. ఆకట్టుకునే ఫ్యామిలీ ఎమోషన్స్, హుషారు తెప్పించే పాటలు, మతిపోగొట్టే బాలయ్య డ్యాన్స్ మూమెంట్స్.. ఇలా చెప్పుకుంటూ పోతే మాటలు దొరకవు.
ఎన్నో హిట్ చిత్రాలను చేసి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు బాలయ్య. ఆయన నటించిన బ్లాక్ బస్టర్ మూవీస్లో ఒకటి లెజెండ్ (Legend). ఈ సినిమా అప్పట్లో సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఏకంగా 400 రోజులు థియేటర్లలో ఆడి బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) డైరెక్షన్ లో బాలయ్య చేసిన ఈ మూవీ వచ్చి కరెక్టుగా 10 ఏళ్లు అవుతోంది. దీంతో మూవీ టీమ్ గ్రాండ్ గా హైదరాబాద్ లో వేడుకలను నిర్వహించింది. ఈ సెలబ్రేషన్స్ లో బాలయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. రికార్డులను
రికార్డులను తిరగరాసేది నేనే :
లెజెండ్ 10 ఇయర్స్ గ్రాండ్ సెలబ్రేషన్స్ లో బాలకృష్ణ (Nandamuri Balakrishna)తనదైన డైలాగులతో ఉర్రూతలూగించారు. తన సినిమాల గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. మంచి ఉద్దేశంతో తీసే చిత్రాలను ఎప్పటికీ ప్రజలు ఆదరిస్తారని ఆయన చెప్పారు. ఈవెంట్ లో బాలకృష్ణ మాట్లాడుతూ…”మంచి ఉద్దేశంతో తీసే సినిమాలు ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారు. ఇలాంటి సినిమాలు మరిన్ని కావాలని అడుగుతారు.
తెలుగు చిత్రాల ఎఫెక్ట్ ఇప్పుడు భారతదేశం మొత్తం పాకింది. సినిమాలతో రికార్డులు నాకు కొత్తేమి కాదు. రికార్డులు సృష్టించాలన్నా నేనే. వాటిని తిరగరాయలన్నా నేనే. నా డైరెక్టర్లు, స్టోరీ సెలక్షన్, కో ఆర్టిస్టులు, టెక్నికల్ టీమ్ మీద నాకు మంచి నమ్మకం ఉంది”అని బాలయ్యా పవర్ ఫుల్ పంచులతో ఈమెంట్ లో హైలెట్ గా నిలిచారు.
మీ అభిమానం ఎప్పటికీ ఉండాలి : బాలయ్య
” సినిమా అంటే కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు. అది బాధ్యత. నేను నటించే ప్రతి సినిమా సందేశాత్మకంగా ఉండాలని ,సమాజంలో చైతన్యం తీసుకురావాలని బావిస్తాను. ఆ ఉద్దేశంతోనే నేను స్టోరీలను ఎంచుకుంటాను. ‘లెజెండ్’(Legend)మూవీతో మహిళలకు మంచి మెసేజ్ ఇచ్చాము. ఈ మధ్యనే విడుదలైన ‘భగవంత్ కేసరి’(Bagavath Kesaru)లోనూ మంచి మెసేజ్ ఉంది. ఈ సినిమా కోసం చిత్రబృందం ఎంతో కష్టపడింది. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ (Devisri Prasa) పాటలు, సోనాల్ చౌహాన్(Sonal Chauhan) బ్యూటీ , యాక్టింగ్ , రాధిక ఆప్టే (Radhika Apt) నటన, జగపతి బాబు (Jagapathi Babu) విలనిజం అద్భుతం.
అంతే కాదు ఈ సినిమాను రీరిలీజ్ చేయడం ఎంతో సంతోషంగా ఉంది. తెలుగు ఇండస్ట్రీలో ఇన్ని సినిమాలు చేసే అవకాశం కల్పించిన కళామ తల్లికి నా ధన్యవాదాలు. నన్ను ఆదరిస్తున్న అభిమానులకు, ప్రేక్షకులకు కృతజ్ఞలు. మీ అభిమానం ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నను.” అని బాలయ్య అదిరిపోయే స్పీచ్ ఇచ్చారు. ఇదిలా ఉంటే మార్చి 30న లెజెండ్ మూవీ రీ రిలీజ్ కానుంది.