Prabhu Deva : క్రేజీ కాంబో రెడీ..బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయం

WhatsApp Image 2024 03 23 at 11.10.57 AM Prabhu Deva : క్రేజీ కాంబో రెడీ..బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయం

మల్టీ టాలెంటెడ్ కొరియోగ్రఫర్ ఇండియన్ మైఖల్ జాక్సన్ ( Indian Michael Jackson)ప్రభుదేవ (Prabhudeva) గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. డ్యాన్సర్ గా, యాక్టర్ గా , డైరెక్టర్ గా, రైటర్ గా , సింగర్ గా ఇలా తనలోని అన్ని కళలను ప్రదర్శిస్తూ సినీ ఇండస్ట్రీలో తన జర్నీని విజయవంతంగా కొనసాగిస్తున్నారు. తన లైఫ్ లో ఎన్నో విజయాలు, పరాజయాలు ఉన్నాయి. అయినా ఎప్పుడూ చెరగని చిరునవ్వుతో ఏదో కొత్తగా చేయాలని ప్రయత్నిస్తుంటారు. డ్యాన్స్ మాస్ట్ గా తన పనేంటో తాను చేసుకుంటూ వెళ్తుంటాడు.

ప్రభుదేవాలా డ్యాన్స్ చేయాలని ఎంతో మంది సెలబ్రిటీలు ట్రై చేస్తుంటారు. అంతెందుకు ఇప్పటికీ చాలా మంది స్టార్ హీరోలు ప్రభుదేవానే తమ పాటలకు కొరియోగ్రఫీ చేయాలని కోరుకుంటుంటారు. ఇక అప్ కమింగ్ కొరియోగ్రాఫర్లు ఆయన్నే ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు. అంతటి క్రేజ్ ఉంది ప్రభుదేవకు. ఆయన కొరియోగ్రఫీ చేసిన ప్రతీ పాట ఇప్పటికీ ట్రెండింగ్ లోనే ఉంటుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రభుదేవ మరోసారి ఓ వండర్ రచేసేందుకు రెడీ అవుతున్నాడు. ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రెహమాన్ (AR Rahaman)తో జోడి కట్టి దుమ్ముదులిపేందుకు సన్నద్ధమవుతున్నాడు. కొన్నేళ్ల తర్వాత వీరిద్దరి కాంబినేషన్ తెరమీద కనిపించబోతోంది. దీంతో ఫ్యాన్స్ ఓ రేంజ్ లో పండగ చేసుకుంటున్నారు.

WhatsApp Image 2024 03 23 at 11.11.15 AM Prabhu Deva : క్రేజీ కాంబో రెడీ..బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయం

మరోసారి మ్యాజిక్ చేసేందుకు రెడీ :

ప్రభు దేవా (Prabhudeva), రెహమాన్ (AR Rahaman)క్రేజీ కాంబో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీరిద్దరి జోడీలో వచ్చిన సినిమాలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. 1990లలో ఏకంగా ఐదు సినిమాలు చేశారు. అవన్నీ కూడా బాక్సాఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి. వీరిద్దరు కలిసి 1993లో జెంటిల్మేన్ (Gentleman)సినిమా చేశారు. ఆ మూవీలోని చికు బుకు చికు బుకు రైలే పాట ఏ రేంజ్ లో హిట్ అయిందో అందరికీ తెలిసిందే. రెహమాన్ మ్యూజిక్ కి ప్రభుదేవ డ్యాన్స్ ఇరగదీశాడు. అప్పట్లో ఆ పాట ట్రెండ్ సెట్ చేసింది.

ఆ తర్వాత వీరి కాంబోలో వచ్చిన ప్రేమికుడు(Premikudu)సినిమాలోనూ తమ అద్భతమైన పెర్ఫార్మెన్స్ తో ఇరగదీశారు. ఈ సినిమాలో ప్రభుదేవానే హీరో. ఇక ఈ సినిమాలోని ఊర్వశి-ఊర్వశి , ఓ చెలియా సాంగ్స్ ఇప్పటికీ ట్రెండింగ్ లోనే ఉంటాయి. సంగీత ప్రియులను ఆకట్టుకుంటాయి. ఇక లవ్ బర్డ్స్ (Love Birds), మిస్టర్ రోమియో (Mister Romeo)మెరుపు కలలు (Merupukalalu) సినిమాల్లోని అన్ని పాటలు హిట్ అయ్యాయి. మెరుపు కలలులోని వెన్నెలవే పాటలో ప్రభుదేవా స్టెప్స్ ఫ్యాన్స్ కు పిచ్చెక్కిస్తాయంటే అతిశయోక్తి కాదేమో.

25 ఏళ్ల తర్వాత కాంబినేషన్ రిపీట్ :

సరిగ్గా 25 ఏళ్ల తర్వాత మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ కానుంది. వీరిద్దరూ కలిసి ”ఏఆర్ఆర్‌పీడీ6”(ARRPD6) అనే టైటిల్ తో ఓ కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతోంది. మనోజ్ ఎంఎస్ ఈ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రంలో యోగి బాబు (Yogi babu), వర్గీస్ (vargis), అర్జున్ అశోకన్ (Arjun Ashokan), సుష్మితా నాయక్ (Sushmitha Nayak) తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్ పోస్టర్ ను మూవీ టీమ్ తాజాగా లాంచ్ చేసింది. ఇందులో ప్రభుదేవా డ్యాన్స్ చేసిన ఆల్ టైమ్ హిట్ సాంగ్ ముక్కాలా ముకాబులా సాంగ్ ఫొటోతోపాటు బ్యాక్‌గ్రౌండ్ లో రెహమాన్ పాడుతున్న పిక్చర్ ను యాడ్ చేశారు. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి.

Leave a Comment