కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush)కు ఆల్ ఇండియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ధనుష్ మూవీ రిలీజవుతోందంటే చాలు ఫ్యాన్స్ లో పూనకాలు మొదలవుతాయి. ఆయన యాక్టింగ్ కు ఫిదా కానివారంటూ ఎవరూ ఉండరేమో. తమిళ హీరో అయినా నార్త టు సౌత్ తన టాలెంట్ తో విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్నాడు. కేవలం హీరోయిజం సినిమాలే కాకుండా, వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తుంటాడు. ప్రస్తుతం తెలుగు, హిందీ భాషల్లోనూ ప్రాజెక్టులు చేస్తూ ధనుష్ ఫుల్ బిజీగా ఉంటున్నాడు.
ఇటీవలే కెప్టెన్ మిల్లర్ (Captain Miller)తో వెండితెరపై సందడి చేశాడు ధనుష్. సినిమా డిమాండ్ చేసిందంటే పర్ఫెక్షన్ కోసం ఎంతటి రిస్క్ అయినా చేసేందుకు ధనుష్ ఎప్పుడూ రెడీగా ఉంటాడు. ప్రస్తుతం క్రేజీ స్టార్ మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా (Ilayaraja) బయోపిక్ లో నటిస్తున్నాడు. ఈ చిత్రంతో పాటు పాండి (Paandi)డైరెక్షన్ లో ఓ ప్రాజెక్ట్ చేశాడు. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ధనుష్ సినిమాలకు ఓ కొత్త చిక్కొచ్చి పడింది. ధనుష్ జోడిగా నటించాలంటే స్టార్ హీరోయిన్లు తెగ ఆలోచిస్తున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. దీనికి ఓ కారణం ఉందని సోషల్ మీడియాలో ఓ వార్త చెక్కర్లు కొడుతోంది.
ఆలోచిస్తున్న హీరోయిన్లు :
ధనుష్ (Dhanush) సినిమాలో ఎంతటి క్రేజ్ ఉన్న హీరోయిన్ నటించినా ఆమెకు అంత గుర్తింపు లభించడం లేదు. ఎందుకంటే ప్రేక్షకులు కేవలం ధనుష్ ను చూసేందుకే సినిమాకు వస్తుంటారని ఇండస్ట్రీ టాక్. అంతగా ధనుష్ ప్రేక్షకులకు తన యాక్టింగ్ తో కనెక్ట్ అవుతాడు. ఆ పాత్ర ఎలాంటిదైనా వంద శాతం న్యాయం చేశాడు. ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకుంటాడు. అంతే కాదు రాను రాను ధనుష్ యాక్టింగ్ స్కిల్స్ విపరీతంగా మెరుగవుతోంది. సినిమా చూస్తున్నంత సేపు ధనుష్ గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. ఇక ఆ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు.
అలా ధనుష్ మూవీలో హీరోయిన్స్ అందరూ ఎదుర్కొంటున్న సమస్య. యాక్టింగ్, డాన్స్, యాక్షన్ అన్నింటిలోనూ ధనుష్ కు మించినవారు లేరు. హిందీలోనూ ధనుష్ ఆత్రంగి రే (Atrangirey)సినిమా చేశాడు. ఈ సినిమాలో స్టార్ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar), సారా అలీ ఖాన్ (Sara Ali Khan) నటించారు. అయినా క్రెడిట్ మొత్తం ధనుష్ కొట్టేశాడు. అంతగా సినిమాపై ప్రభావం చూపిస్తుంది ధనుష్ యాక్టింగ్. అందుకే ధనుష్ తో నటించాలంటే స్టార్ హీరోయిన్స్ ఆలోచనలో పడిపోతున్నారు. అయితే ఇళయరాజా బయోపిక్ లో హీరోయిన్ ఎవరు అన్నదానిపై క్లారిటీ రాలేదు. మరికొన్ని రోజుల్లో ఆ విషయం తెలిసే అవకాశం ఉంది.
వెండితెరపై ఇళయారాజా బయోపిక్ :
త్వరలో వెండితెరపైన ఇళయరాజా బయోపిక్ రాబోతోంది. ఈ సినిమాలో ఇళయరాజాగా ధనుష్(Dhanush) కనిపించబోతున్నాడు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. రెట్రో లుక్ లో ఉన్న పోస్టర్ ఆడియన్స్ లో మంచి పాజిటీవ్ వైబ్స్ క్రియేట్ చేస్తుంది.
ఎట్టకేలకు ధనుష్ డ్రీమ్ ప్రాజెక్ట్ మ్యూజిక్ మేస్ట్రో బయోపిక్ వెండితెరమీదకు రాబోతోంది. సిల్వర్ స్క్రీన్ మీద ఇళయరాజా (Ilayaraja) క్యారెక్టర్ ను కోలీవుడ్ హీరో ధనుష్ (Dhanush)చేస్తున్నాడు. ఇన్నాళ్లు ఈ ప్రాజెక్ట్ గురించి అనేక రూమర్స్ నెట్టింట్లో వైరల్ అయ్యాయి. మొత్తానికి ఇళయారాజా బయోపిక్ ఉంటుందని అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఈ చిత్రానికి ఇళయారాజా అని టైటిల్ ను ఫైనల్ చేశారు. ఈ టైటిల్ కు ట్యాగ్ లైన్ గా ది కింగ్ ఆఫ్ మ్యూజిక్ అనే ట్యాగ్ లైన్ ఇచ్చారు. రీసెంట్ గా యాక్షన్ మూవీ కెప్టెన్ మిల్లర్ (Captain Miller) తో మంచి హిట్ సాధించిన డైరెక్టర్ అరుణ్ మాథేశ్వరన్ (Arun Matheswaran)ఇళయరాజా మూవీని డైరెక్ట్ చేస్తున్నారు.
ధనుష్ డ్రీమ్ ప్రాజెక్ట్
ఈ సినిమాలో ధనుష్ (Danush) హీరో కాగా కమల్ హాసన్ (Kamal Haasan),రజనీకాంత్ (Rajanikanth), శింబు (Shimbu)లు ప్రత్యేక పాత్రలో కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఎట్టకేలకు నా కోరిక నెరవేరింది, ఇళయరాజా బయోపిక్‌లో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని ధనుష్ కూడా మూవీ పోస్టర్ లాంచింగ్ ఈవెంట్ లో చెప్పాడు. వాస్తవానకి ధనుష్ ఇళయరాజాకు వీర భక్తుడు. ఇళయరాజాకు కూడా ధనుష్ అంటే వల్లమాలిన ప్రేమ. ఈ కారణం వల్లేనే గురువు సినిమాలో నటించే అవకాశం కలిగింది. అంతే కాదు తన బయోపిక్ సినిమాకు కూడా ఇళయారాజానే మ్యూజిక్ అందించనున్నట్లు సమాచారం.