
టెలికాం రంగంలో తన సత్తా చూపెట్టిన జియో, అతి తక్కువ కాలంలోనే అగ్రస్థాననానికి చేరుకుంది. ఇప్పటికే మొబైల్ ఇంటర్నెట్ లో కొత్త వొరవడి సృష్టించిన జియో రానున్న కాలంలో అంతర్జాల సేవలను దేశంలోని మారు మూల ప్రాంతాలకు కూడా విస్తరించాలని డిసైడ్ అయింది.
ఈ క్రమంలోనే jio space fiber 2023 ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఈవెంట్లో కొత్త ఇంటర్నెట్ సేవలను ప్రారంభించింది సదరు సంస్థ. జియో స్పేస్ ఫైబర్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ శాటిలైట్ ద్వారా వచ్చే గిగాబిట్ టెక్నాలజీని ఉపయోగించి ఇంటర్నెట్ సేవలను మరింత వేగవంతం చేయదలచారు.
ఇదే గనుక కార్య రూపం దాల్చితే అంతరిక్షం నుంచి ప్రతి ఇంటికీ నేరుగా ఇంటర్నెట్ సేవలను అందించగలుగుతుంది. ఇందుకోసం జియో లక్సెంబర్గ్ అనే కంపెనీతో కలిసి ప్రయాణం చేయనుంది. అయితే ఇదే రంగంలో ఉన్న ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్‌కు తో జియో పోటీ పడాల్సి ఉంటుంది.
జియో ఈ రంగంలోకి ఇప్పుడే అడుగు పెడుతుంది, కానీ మాస్క్ కి చెందిన కంపెనీ స్టార్ లింక్, ఎప్పటి నుండో సేవలు అందిస్తూ ఉంది.

ఇందుకోసం జియో space fiber లక్సెంబర్గ్‌కు చెందిన SES ఉపగ్రహాలను ఉపయోగించుకుంటుందట. SES లోని మీడియం ఎర్త్ ఆర్బిట్ ను ఉపయోగించి ఇంటర్నెట్ ఫెసిలిటీస్ అందిస్తుంది జియో. ఈ ఎర్త్ ఆర్బిట్ లు భూమి నుండి 2,000 నుంచి 12,000 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నాయి.
ఇక మాస్క్ కి చెందిన స్టార్ లింక్ ఎర్త్ ఆర్బిట్ చుస్తే, అది భూమికి కేవలం 160 నుంచి 2000 కిలోమీటర్ల ఎత్తులోనే ఉంది. స్టార్ లింక్ తక్కువ సమయంలో ఎక్కువ వేగాన్ని అందిస్తుంది. వేగం చూస్తే ఎక్కువే కానీ ఇది కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమై ఉంది.
jio space fiber వేగం కాలక్రమేణా పెరుగుతుంది అంటున్నారు. జియో స్పేస్ ఫైబర్ ను ప్రస్తుతానికి నాలుగు నగరాల్లో మాత్రమే ప్రారంభించారు. గిర్ -,గుజరాత్, కోర్బా -,రాజస్థాన్, నవరంగపూర్ -,ఒడిశా, జోర్హాట్ -,అస్సాంలో ఈ సేవలు మొదలయ్యాయి.
స్టార్ లింక్ సేవలు అమెరికా, యూరప్, న్యూజిలాండ్, కెనడా, ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికా వంటి దేశాల్లో ఉన్నాయి. ఇక 2030 నాటికి మరిన్ని దేశాలకు ఈ సేవలు విస్తరింపజేస్తామని అంటున్నారు ఆ కంపెనీ వారు.
ధర విషయానికి వస్తే స్టార్ లింక్ ప్లాన్లు 120 డాలర్ల నుంచి ప్రారంభమయ్యి 599 డాలర్ల వరకు ఉంటాయి. భారత కరెన్సీలో చుస్తే 10 వేల నుంచి 49 వేల రూపాయల వరకు ఉంటుంది.
అయితే జియో ఛైర్మన్ ఆకాష్ అంబానీ ధరల గురించి మాట్లాడుతూ, వీటి ధరలు చాలా తక్కువగా ఉంటాయని, మధ్య తరగతి కుటుంబాలకు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.