వర్క్ ఫ్రమ్ హోమ్ చాలు, ఆఫీస్ కి రండి – IT కంపెనీలు హెచ్చరిక

website 6tvnews template 92 వర్క్ ఫ్రమ్ హోమ్ చాలు, ఆఫీస్ కి రండి - IT కంపెనీలు హెచ్చరిక

Stop Work from home, come to office immediately – IT companies warning
: ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలు మార్చ్ నెలాఖరుకల్లా ఆఫీస్ వచ్చి పని చెయ్యాల్సిందే అని అందరికి మెయిల్స్ పంపింది. లేదు అంటే మేము తీసుకునే చర్యలు చాల తీవ్రం గా ఉంటాయని హెచ్చరించింది. ఉద్యోగులకు మేము ఇచ్చే ఇదే ఆఖరి అవకాశం అని ఒక ప్రకటన జారి చేసాయి. ఇంకో పక్క లే ఆఫ్ ల భయం పట్టుకుంది ఉద్యోగులకు.

ప్రముఖ దిగ్గజ కంపెనీ TCS ఉద్యోగుకులకు కొన్ని రాయతీలు ప్రకటించింది అది ఏంటంటే మా కార్యాలయం లో పని చేసే ఉద్యోగులు వారం లో కనీసం 3 రోజులు వచ్చి పని చేసి మిగిలిన రోజులు వర్క్ ఫ్రమ్ చెయ్యచ్చు అని చెప్పింది. కాని ఫ్రేషర్స్ వారం లో 5 రోజులు ఖచ్చింతంగా ఆఫీస్ కి రావాల్సిందే అని చెప్పింది.

ప్రెషర్స్ రాని పక్షాన వారిమీద సివియర్ యాక్షన్ తీసుకుంటామని హేచ్చిరించింది. ఇంకొక ప్రముఖ IT కంపెనీ అయిన HCL కూడా తమ కంపెనీ ఉద్యోగులు అందరు ఆఫీస్ కి రావాల్సిందే అని ఆర్డర్ పాస్ చేసింది. కోవిడ్ సమయం లో వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల తమ బిజినెస్ కాని ప్రొడక్షన్ కి కాని ఎటువంటి నష్టం రాలేదని చెప్పిన కంపెనీ లే ఇప్పుడు ఆఫీస్ వచ్చి బృదాలు గా ఏర్పడి తమ ప్రొడక్టవీటి, క్రియేటివిటి రిజల్ట్స్ పెరుగుతాయని చెప్తున్నాయి.

Capgemini వర్క్ ఫ్రమ్ హోమ్ చాలు, ఆఫీస్ కి రండి - IT కంపెనీలు హెచ్చరిక

విదేశాలలో ఉన్న కంపెనీలలో భారీ సంఖ్య లో లే ఆఫ్ జరుగుతున్న ఈ సమయంలో ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు కంపెనీ ఇచ్చిన ఆదేశాల ప్రకారం నడుచుకుంటున్నారు అని ఆయా కంపెనీలు చెప్తున్నాయి. వీటి తో పాటు దిగ్గజ IT సంస్దలు అయిన infosys,wipro,oracle వంటి కంపెనీలు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ కి స్వస్తి పలకాలని కోరుతున్నాయి.

అసలే నియామకాలు కూడా తగ్గిపోయాయని ఉన్న వారితో చేయించడానికి సరియైన వనరులు సరిపోవడం లేదని అందుకని ఉద్యోగులను ఆఫీస్ కి రమ్మని చెప్తున్నామని ఆయా IT సంస్దలు ఒక ప్రకటన వుడుదల చేసాయి.ఇక్కడ ఉన్న ఆయా IT సంస్దలకి అమెరిక,ఐరోపా కు చెందిన పెద్ద కంపెనీలు మనకి క్లైంట్స్ గా ఉన్నారు. దానివల్ల ఆయా IT సంస్దలకి సంబందించిన ప్రాజెక్ట్ లకు అంతరాయం ఏర్పదకుడదని ఆచి తూచి అడుగులు వేస్తున్నారు.

అధిక వేతనాలపై ఉద్యోగులను నియమించుకున్న ఈ సంస్దలు కి ఇప్పుడు ఈ ఉద్యోగులు భారం గా కనపడుతున్నారు. దీనికి కారణం విదేశాల లో భారిగా లే ఆఫ్ లు తో పాటు ప్రాజెక్టులు తగ్గుముఖం పట్టడం ఒక కారణం. కోవిడ్ పూర్తిగా తగ్గిపోవడం వల్ల ఉద్యోగులను తిరిగి ఆఫీస్ కి రమ్మని ఒత్తిడి చేస్తున్నాయి. అసలే లే ఆఫ్ లు ప్రమాదం పొంచి ఉన్నందు వల్ల ఉద్యోగులు తిరిగి ఆఫీసులకు రావడం తప్ప వేరే దారి కనిపించడం లేదు వారికీ. ఈ తరుణం లో A I రావడం వల్ల ఆయా IT సంస్దలు ఉద్యోగుల సంఖ్యను భారిగా తగ్గిస్తున్నాయి. A I రావడం వల్ల ఆశించిన మేరకు ప్రాజెక్ట్ లురావడం లేదని నాస్ కామ్ ఒక ప్రకటన జారీచేసింది.

ఉద్యోగులు చెప్తున్న కారణాలు :

కొన్ని కంపెనీలు వారి ఉద్యోగులను అందరిని రప్పించు కోగాల్గుతున్నాయి. కొన్ని పెద్ద కంపెనీలు ఇంకా కొంత వెసులు బాటు కల్పించాయి. ఆయా IT సంస్దలు పనిచేసే ఉదోగులు 25 నుండి 34 సంవత్సరాలు ఉన్న వారు కంపెనీలకు వచ్చి పనిచేయడానికి ఇష్టపడటం లేదని చెప్పాయి.

దీనికి వారు చెప్పే కారణం మహా నగరాలలో అంటే బెంగలూరు,హైదరాబాద్,నోయిడా , చెన్నై వంటి నగరాలలో ట్రాఫిక్ సమస్య చాల ఉందని ఆఫీస్ వచ్చేందుకు కనీసం 2 నుండి 3 గంటల పాటు రోడ్లపై ఉండిపోతున్నామని దీనివల్ల చిరాకు అసహనం వస్తున్నాయని దీనివల్ల సరిగ్గా పని చేయలేక పోతున్నామని వారు చెప్తున్నారు.

అదే ఇంటి నుండి వర్క్ చెయ్యడం అంటే ట్రాఫిక్ సమస్య ఉండదు తిరగాల్సిన అవసరం ఉండదు కనుక ప్రశాంతం గా పనిచేయ్యగలమని వారు చెప్తున్నారు. కోవిడ్ టైం లో ఇంటి నుండి కదలకున్న తమ బృందాలతో నిరంతరం మాట్లాడుతూ అద్భుతమైన ఫలితాలు ఇచ్చామని వారు గుర్తు చేస్తున్నారు.

Leave a Comment