ఇంటర్ అడ్మిషన్ కోసం విద్యార్ధులు దరఖాస్తు చేయవద్దు – తెలంగాణ బోర్డు

website 6tvnews template 2024 04 04T151837.205 ఇంటర్ అడ్మిషన్ కోసం విద్యార్ధులు దరఖాస్తు చేయవద్దు - తెలంగాణ బోర్డు

తెలంగాణా ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక ప్రకటన రాక ముందే విద్యార్థులు మరియు తల్లిదండ్రులు జూనియర్ కాలేజీలలో అడ్మిషన్లు తీసుకోవద్దని ఇంటర్ బోర్డు ఒక ప్రకటన విడుదల చేసింది. 2024-’25 విద్యా సంవత్సరానికి గాను అడ్మిషన్ షెడ్యూల్‌ను ఇంకా విడుదల చేయలేదని, దానికి కొంత సమయం పడుతుందని బోర్డు పేర్కొంది.

అయితే అనధికారికంగా అడ్మిషన్ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారని దీనికి సంబందించి ఎన్నో ఫిర్యాదులు రావడం తో ప్రతిస్పందనగా బోర్డు ఇలాంటి ప్రకటన చేయవలసి వచ్చింది అని బోర్డు అధికారులు తెలిపారు. షెడ్యూల్ జారీ చెయ్యకుండా జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్ తీసుకోవద్దని ఇంటర్ బోర్డు విద్యార్థులను కోరింది.

కాని కొన్ని ప్రైవేట్ జూనియర్ కాలేజీలు ఇప్పటికే ముందస్తు అడ్మిషన్లు కోసం తెర లేపాయని బోర్డు అధికారులు చెప్తున్నారు. అలాగే కొందరిని తప్పుదోవ పట్టించి అడ్మిషన్ లు అంటకడుతున్నారని ఇది రూల్స్ కి విరుద్ధమని బోర్డు అధికారులు చెప్పారు. అలాగే విద్యార్ధులను తప్పుదోవ పట్టించే విధం గా పరీక్షా విధానాలకు విరుద్ధం గా బోర్డుకు ఫిర్యాదులు అందాయని అధికారులు చెప్తున్నారు.

2024-25 విద్యా సంవత్సరానికి గాను ఇప్పటికే తాత్కాలిక అనుబంధ ప్రక్రియను బోర్డు మొదలు పెట్టిందని, అనంతరం తాత్కాలికంగా అనుబంధించబడిన కొన్ని జూనియర్ కాలేజీల జాబితా tsbie.cgg.gov.in లో కాని లేదా acadtsbie.cgg.gov.in కు సంబందించి అధికారిక వెబ్‌సైట్‌లలో అన్ని వివరాలు పెట్టడం జరుగుతుంది అని దీనిని అనుసరించి విద్యార్థులు ఇంటర్ బోర్డు అనుబంధ కాలేజీల లోనే అడ్మిషన్లు తీసుకోవాలని తల్లిదండ్రులకు సూచించింది.

Leave a Comment