అలాంటి అంకుల్ వరుడుతో అమ్మకు రెండో పెళ్లి చేస్తా – సుప్రీత కీలక వ్యాఖ్యలు

website 6tvnews template 2024 04 01T131506.396 1 అలాంటి అంకుల్ వరుడుతో అమ్మకు రెండో పెళ్లి చేస్తా - సుప్రీత కీలక వ్యాఖ్యలు

మన టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖ వాణి గురించి అందరికి తెలిసిన విషయమే.ఈమె ఎన్నో సినిమాలలో ఎన్నో రకాల పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించారని చెప్పవచ్చు. ఇలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో మంచి సక్సెస్ తో దూసుకుపోతున్న నటి సురేఖ వాణి ఇటీవల కాలంలో సినిమాలను కొద్దిగా తగ్గించారనే చెప్పచ్చు. ఇక ఈమె తన కుమార్తె సుప్రీత తో కలిసి సోషల్ మీడియాలో వారు ఇద్దరు కల్సి పలు రకాల వీడియోలు పోస్ట్ చేస్తూ ఎంతో యాక్టివ్ గా ఉంటున్నారు. అలాగే వారికీ సంబందించిన అన్ని విషయాలను అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటున్నారు.

ఇక సురేఖ వాణి కూతురు సుప్రీత కూడా హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన విషయం మనకు తెలిసిందే. ఇక సురేఖ వాణి వ్యక్తిగత విషయానికి వస్తే ఈమె భర్త సురేష్ తేజ 2019వ సంవత్సరంలో పలు రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించారు. ఇక ఆ రోజు నుండి తన కుమార్తెతో కలిసి ఈమె ఒంటరిగా గడుపుతున్నారు. అయితే సురేఖ వాణి రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ అప్పట్లో ఎన్నో పుకారులు రావడం ఆ తర్వాత ఆమె ఖండించడం జరుగుతూనే ఉంది.

సురేఖ వాణి కుమార్తె సుప్రీత ఒక మాగజైన్ ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన తల్లి రెండో పెళ్లి గురించి మాట్లాడుతూ తనకి కచ్చితంగా అమ్మకు రెండో పెళ్లి చేయాలనే ఉద్దేశ్యం ఉన్నట్లు చెప్పారు. అయితే అమ్మను పెళ్లి చేసుకోవడానికి అబ్బాయిలు కాకుండా అంకుల్స్ కావాలని సుప్రీత చెప్పారు. తనని ఇలాంటి ఇబ్బందులకు గురి చేయకుండా మా అమ్మని మంచిగా చూసుకొని అంకుల్ వరుడు దొరికితే తప్పకుండా తన తల్లికి రెండో పెళ్లి చేస్తాను అంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.

Leave a Comment