కథ కొత్తగా ఉంది కానీ.. అదే మైనస్ : Sundaram Master movie review.

website 6tvnews template 87 కథ కొత్తగా ఉంది కానీ.. అదే మైనస్ : Sundaram Master movie review.

సుందరం మాస్టర్‌ ఎలా ఉందంటే ?

Viva Harsha Sundaram Master movie review : షార్ట్ ఫిలిమ్స్ తో, ఫన్నీ వీడియోస్ తో ఫేమసైన యూట్యూబ్‌ స్టార్ వైవా హర్ష (Viva Harsha) తొలిసారిగా హీరోగా తెర ముందు కనిపించాడు. ఇప్పటివరకు చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పని చేసిన హర్ష వైవిధ్యమైన కథతో సుందరం మాస్టర్‌ ( Sundaram Master ) గా ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యాడు.

ఇవాళ థియేటర్లలో విడుదలైన ఈ మూవీని టాలీవుడ్ హీరో మాస్ మహారాజా రవితేజ (Raviteja) నిర్మించాడు. కళ్యాణ్ సంతోష్ (Kalyan Santosh ) డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాలో మరో ప్రధాన పాత్రలో దివ్వ శ్రీపాద ( Divya Sripada) నటించింది. టీజర్, ట్రైలర్‌తోనే సుందరం మాస్టర్‌ పైన హైప్ క్రియేట్ చేశారు మేకర్స్. మరి హర్ష సుందరం మాస్టర్‌ క్యారెక్టర్ తో మెప్పించాడా? లేదా? ఇప్పుడు చూద్దాం.

Sundaram master story : సుందరం మాస్టర్ కథ ఇదే :

సుందర్రావు విశాఖపట్నం (Vishakapatnam) లోని పాడేరుb(Paderu ) లో ఓ గవర్నమెంట్ టీచర్ గా పని చేస్తుంటాడు. అతనికి పెళ్లి కాలేదు. ప్రభుత్వ ఉద్యోగి కావడంతో కట్నం బాగా వస్తుందనే ఆశతో వచ్చిన సంబంధాలన్నీ స్వయంగా చెడగొట్టుకుంటాడు.

ఈ క్రమంలో అక్కడి ఎమ్మెల్యే సుందర్రావుకు ఒక పని అప్పగిస్తాడు. ఫారెస్ట్ లో ఒక గూడానికి వెళ్లి అక్కడి ప్రజలకు చదువు చెప్పాలని, ఆ తర్వాత వారిని పాడేరులో ఓటర్లుగా చేర్చేందుకు ప్రయత్నించాలని ఎమ్మెల్యే చెబుతాడు. అంతేకాదు మరో సీక్రెట్ పని కూడా అప్పగిస్తాడు.

దీంతో సుందరం మాస్టర్ ఆ గూడెం కు వెళ్తాడు. ఆ గూడెం పెద్ద, మైనా, గూడెంలోని మరికొంతమంది ప్రజలు సుందరంని అనుమానించి చెట్టుకు కట్టేస్తారు. అసలు సుందరం మాస్టరును గూడెం ప్రజలు చెట్టుకు ఎందుకు కట్టేస్తారు? ఎమ్మెల్యే చెప్పిన పని సుందరం మాస్టర్ పూర్తి చేశాడా? ఇంతకీ ఎమ్మెల్యే చెప్పిన రహస్య పని ఏంటి? చివరికి ఏం జరుగుతుంది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Sundaram Master Review కథ కొత్తగా ఉంది కానీ.. అదే మైనస్ : Sundaram Master movie review.

కథ బాగుంది..కానీ అదే మైనస్ :

డీఈవో పోస్ట్ కోసం అత్యాశకు పోయి ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు అడవిలో ఒక గూడానికి వెళ్తాడు.
ఇంగ్లీష్ పెద్దగా రాని సోషల్ టీచర్ నల్లగా ఉన్నాడనే ఒకే ఒక కారణంతో ఎంఎల్ఏ సుందరం మాస్టర్ ను అడవిలోకి పంపిస్తాడు. గూడానికి వెళ్లిన మొదటి రోజే టీచర్ కు చేదు అనుభవం ఎదురవుతుంది. అతను టీచర్ కాదనే అనుమానం గూడెం ప్రజలకు వస్తుంది. దీనితో అతడిని బంధిస్తారు. గూడెంలోని ఓ వ్యక్తి సాయంతో అక్కడి ప్రజలు పెట్టిన పరీక్ష పాసైన సుందరం మాస్టర్ చేసే పనులన్నీ చాలా ఫన్నీగా సాగుతాయి. అయితే డైరెక్టర్ సంతోష్ కథ మొత్తాన్ని ఫస్ట్ హాఫ్ లోనే చూపించేసాడు.

దీంతో సెకండ్ హాఫ్ పైన ఆసక్తి పెరుగుతుంది. మొదటి భాగం కామెడీగా సాగినా ఇంటర్వెల్ తర్వాత నుంచి కథ సీరియస్‌గా మారుతుంది. అక్కడి ప్రజల పరిస్థితిని చూసి సుందరం మాస్టర్ వారిపై తన అభిప్రాయాన్ని మార్చుకుంటాడు. కథ బాగుంది. కానీ డైరెక్టర్ ఆ కథను ప్రేక్షకులకు చెప్పడంలో ఫెయిల్ అయ్యాడు . సినిమా మొదట్లో ఉన్న ఫీల్ తర్వాత ఉండదు. గూడెం ప్రజలు ఇంగ్లీషులో మాట్లాడటంతో సుందరం షాక్ కావడం, ఆ తర్వాత కొన్ని సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. గ్రామ దేవత విగ్రహం కోసం వెతికే సీన్ కూడా ఉత్కంఠగా ఉంది.

ఎవరెలా చేశారంటే?

సుందరం మాస్టర్ క్యారెక్టర్ లో హర్ష (Harsha ) జీవించేశాడు. కామెడీని కూడా అద్భుతంగా పండించాడు. బాలకృష్ణ ( Balakrishna), దివ్యశ్రీ పాద ( Divya Sripada ) , హర్షవర్ధన్( Harshavardhan) భద్రం(Bhadram) వారి వారి పాత్రల మేరకు నటించారు. గూడెం ప్రజలుగా ఉన్న వారంతా చాలా సహజ సిద్ధంగానే అడవి బిడ్డలలానే కనిపించారు. టెక్నికల్ గా డైరెక్టర్ స్టోరీ లైన్ బాగుంది. కానీ దాన్ని సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయాడని అనిపిస్తుంది. సినిమాటోగ్రాఫర్ అడవిలోని అందాలను న్యాచురల్ గా చాలా చక్కగా చూపించాడు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఎడిటింగ్ కూడా బాగుంది. క్లైమాక్స్ సినిమాకు మైనస్ గా నిలుస్తుంది.

Leave a Comment