Mahesh Babu: మంచు కొండల్లో మహేష్ ..ఫ్యామిలీతో వెకేషన్

website 6tvnews template 2024 03 30T134708.597 Mahesh Babu: మంచు కొండల్లో మహేష్ ..ఫ్యామిలీతో వెకేషన్

తెలుగు రాష్ట్రాల్లో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. పగటి పూటి ఇంటి నుంచి బయటకు రావాలంటేనే జనం భయపడిపోతున్నారు. ఓవైపు ఎండలు మండుతుంటే సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu)ఆయన ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం వర్షంలో తడుస్తున్నారు . అది కూడా మంచు వర్షం కావడంతో ఫ్యాన్స్ అంతా షాకవుతున్నారు. ఇంత ఎండల్లో మంచు ఎక్కడిది అనే కదా మీ డౌట్. ఈ ప్లేస్ అయితే హైదరాబాద్ లో కాదు . ప్రస్తుతం మహేశ్ బాబు సమ్మర్ వెకేషన్ (Summer Vacation)లో ఉన్నారు. ఇన్నాళ్లు షూటింగ్ లతో బిజీ బిజీగా గడిపిన ఈ స్టార్ హీరో ఇప్పుడు ఫ్యామిలీతో చిల్ అవుతున్నారు. మహేశ్ ఫ్యామిలీ ట్రిప్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు (Mahesh Babu)ఫ్రీ టైం దొరికినప్పుడల్లా ఫ్యామిలీతో చిల్ అవ్వడానికి ఫారెన్ కంట్రీస్‎కు చెక్కేస్తుంటారు. సంవత్సరంలో సుమారు 7 నుంచి 8 సార్లు వెకేషన్ విదేశాల్లో ఫ్యామిలీతో గడిపి వస్తుంటారు. ఇక సమ్మర్ వచ్చిందంటే ఆగుతారా చెప్పండి ఎప్పటిలాగే మహేశ్ ఫ్యామిలీ సమ్మర్ వెకేషన్ చెక్కేసింది. మహేశ్ బాబు, భార్య నమ్రత శిరోద్కర్(Namrata Shirodkar), కొడుకు గౌతమ్ (Gowtham), కూతురు సితార(Sitara)లు ప్రస్తుతం స్విట్జర్లాండ్ (Switzerland)లోఉన్నారు. అక్కడ మంచు కొండల్లో గడ్డ కట్టే చలిలో మహేశ్ తన ఫ్యామిలీతో కలిసి సెల్ఫీలకు ఫోజులు ఇచ్చాడు. . ఈ ఫొటోలను నమ్రత తన ఇన్‎స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసింది. హాట్ సమ్మర్ లో వెరీ కూల్ అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

ఈ ఏడాది విడుదలైన గుంటూరు కారం (Guntur Kaaram) సినిమా మహేశ్ కు భారీ విజయాన్ని అందించింది. త్రివిక్రమ్ (Trivikram)తెరకెక్కించిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు మహేశ్ దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli)డైరెక్షన్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్న మూవీలో మహేశ్ నటించనున్నాడు చేస్తున్నాడు. ఇప్పటికే ఈ అడ్వెంచరస్ మూవీ స్క్రిప్ట్ వర్క్ పూర్తైంది. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అమేజాన్ అడవుల నేపథ్యంలో రూపొందుతున్న అత్యంత భారీ బడ్జెట్ మూవీ ఇది. ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి.

ఈ మూవీలో మహేష్ జోడిగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ (Aliya Bhatt)నటిస్తుందని సమాచారం. అయితే ఈ విషయమై అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. ఈ కొత్త ప్రాజెక్టుకు కీరవాణి (Keeravani)సంగీతం అందించనున్నారు. మహేష్ గతంలో ఎన్నడూ చేయని విధంగా ఛాలెంజింగ్ రోల్స్ చేయబోతున్నాడట. దాదాపు ఎనిమిది సరికొత్త గెటప్స్‏లో ప్రిన్స్ కనిపించనుననాడని టాక్. మహేశ్ మేకోవర్ లుక్స్ కూడా హాలీవుడ్ హీరో రేంజ్‏లో ఉన్నాయని తెలుస్తోంది. ఈ సమ్మర్ నుంచే ఎస్ఎస్ఎంబీ 29 ( SSMB 29)ప్రాజెక్ట్ షూటింగ్ ప్రారంభం కానుంది.

Leave a Comment