Judgment on Article 370: ఆర్టికల్ 370 విషయంలో సుప్రీం తుది తీర్పు..భద్రతను కట్టుదిట్టం చేసిన సర్కారు.

Supreme's final verdict on Article 370..Government has tightened security.

Judgment on Article 370: ఆర్టికల్ 370 విషయంలో సుప్రీం తుది తీర్పు..భద్రతను కట్టుదిట్టం చేసిన సర్కారు.

2019 సంవత్సరం లో కేంద్రంలోని బీజేపీ సర్కారు ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను ఉపసంహరిస్తూ ఆర్టికల్‌ 370 ని తెరపైకి తీసుకొచ్చింది.

అయితే ఈ ఆర్టికల్ 370 ని రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు లో కొన్నివ్యాజ్యాలు దాఖలైన విషయం కూడా విదితమే. ఈ కేసు విషయంలో సుప్రీం కోర్టు తుది తీర్పు వెలువరించనుంది.

ఈ వ్యవహారంలో వేరు వేరు పిటిషన్లు దాఖలవగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సిజెఐ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం సుదీర్ఘ విచారణను చేపట్టింది.

ఈ విచారణను ఇదే సంవత్సరం ఆగస్టు నెల నుండి సెప్టెంబర్ వరకు కొనసాగిచారు, అయితే తీర్పును మాత్రం వెలువరించకుండా రిజర్వు చేసి ఉంచారు. అయితే ఈ కేసులో ఫైనల్ జడ్జిమెంట్ ను చెప్పనున్నట్టు సుప్రీం కోర్టు వెబ్‌సైట్‌ ద్వారా తెలిపింది.

2019 సంవత్సరం ఆగస్టు 5వ తేదీన భారతీయ జనతా పార్టీ సర్కారు ఆర్టికల్ 370 రద్దు చేసింది. అంతే కాకుండా జమ్మూ కాశ్మీర్ ను రెండు కేంద్ర పాలిత ప్రతాలుగా విభజించి పాలన కొనసాగిస్తోంది.

సుప్రీం కోర్టు తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో కేంద్రం జమ్మూ కాశ్మీర్ లో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేసింది.

స్థానికంగా ఉన్న కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన కొందరు పొలిటిషియన్లను కొందరికి హౌస్ అరెస్ట్ చేయగా, అవసరం ఉన్న మేర కొందరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు, అదే విధంగా కాశ్మీర్ లోయలోని సుమారు 10 జిల్లాలలో బ్రాద్రత ఏర్పాట్లను గడిచిన రెండువారాలుగా పోలీసు అధికారులు సమీక్షిస్తున్నారు.

తీర్పు వెలువడిన అనంతరం స్థానిక ప్రజలను రెచ్చగొడితే కఠిన చర్యలు ఎదుర్కొనక తప్పదని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

ఇదే విషయమై నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఒమర్‌ అబ్దుల్లా స్పందించారు. ఆర్టికల్ 370 రద్దుకు అనుకూలంగా తీర్పు వచ్చినప్పటికీ తహమా పార్టీ సమన్వయాన్ని కోల్పోడని అన్నారు.

శాటి భద్రతలకు తమ పార్టీ ఎప్పుడు విఘాతం కలిగించదని పేర్కొన్నారు. అయితే 370 అధికరణం రద్దుకు వ్యతిరేకంగా పోరాటం సాగించేందుకు జమ్మూకశ్మీర్‌కు చెందిన కొన్ని పార్టీలు గుప్కార్‌ అలయెన్స్‌గా ఏర్పడినట్టు తెలుస్తోంది.

భారతీయ జనతా పార్టీ కూడా ఈ విషయం పై స్పందించింది, 370 రద్దు కి సంబంధించి తీర్పు విషయంలో ఎవ్వరు కూడా సామ్యావనాన్ని కోల్పోకూడదని చెప్పింది.

ఆ తీర్పును ఎవ్వరూ రాజకీయం చేయరాదని విజ్ఞాపన చేసింది. సుప్రీం కోర్ట్ ఇచ్చే తీర్పును ప్రతి ఒక్కరు గౌరవించాలని సూచించింది.

Leave a Comment