కంగువ టీజర్ రిలీజ్. సూర్య విశ్వరూపం.

WhatsApp Image 2024 03 19 at 7.52.17 PM కంగువ టీజర్ రిలీజ్. సూర్య విశ్వరూపం.

suriya kanguva movie teaser Released : కోలీవుడ్ స్టార్ సూర్య (Surya) బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి చాలా రోజులైంది. కానీ ఆయన నటించిన సినిమాలు మాత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. కొత్త స్టోరీలతో , సామాజిక అంశాలతో కూడిన సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు సూర్య. సొసైటీకి దీటుగా, దురాచారాలను ఎత్తిచూపే ‘సురారై పోట్రు’(Surarai Potru), ‘జై భీమ్‌’(Jai Bheem) లాంటి సినిమాలు ప్రజల్లో ఎంతో ఇంపాక్ట్ చూపించాయి.

ఆ సినిమాల తర్వాత లోకేష్ కానగరాజ్ (Lokesh kanakaraj) డైరెక్షన్ లో వచ్చిన విక్రమ్ (Vikram) మూవీ క్లైమాక్స్ లో రోలెక్స్ లా కనిపించి అందరిని మెప్పించాడు. ఇక ఇప్పుడు తాజాగా పాన్‌ ఇండియా మూవీ ‘కంగువ’ (Kanguva)లో నటిస్తున్నాడు. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి సూర్య ఫ్యాన్స్ అప్డేట్స్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన సూర్య పోస్టర్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించింది . ఇక ఇదే క్రమంలో మేకర్స్ మూవీ నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ సినిమాపై అంచనాలను ఓ రేంజ్ లో పెంచేసింది. సూర్య లుక్స్ గూస్ బంమ్స్ తెప్పిస్తున్నాడు. ఈ మూవీతో హిట్ పక్కా అని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు.

టీజర్ ఎలా ఉందంటే :

మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన పోస్టర్ లో కండలు తిరిగిన శరీరం తో సూర్య సరికొత్తగా కనిపించాడు. టీజర్ లోని భీకర పోరాట సన్నివేశాలు మైండ్ బ్లోయింగ్ గా ఉన్నాయి. పీరియాడికల్ స్టోరీ కావడం అందులోనూ సూర్య హీరో కావడంతో ఈ మూవీ టీజర్ ప్రేక్షకుల్లో అంచనాలను భారీగా పెంచేస్తోంది. సూర్య అయితే తన విశ్వరూపాన్ని చూపించాడు.

బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓ రేంజ్ లో ఉంది.పవర్ ఫుల్ మ్యూజిక్ తో మ్యాజిక్ చేశాడు దేవి శ్రీ ప్రసాద్. ఒక్కో సీన్ వేరే లెవల్‌లో ఉంది. సూర్య ఫ్యాన్స్‌కు ఈ మూవీ సూపర్ కిక్ ఇవ్వడం ఖాయం. డైలాగ్ ఒక్క డైలాగ్ లేకుండా టీజర్ విడుదల చేసిన సూర్య బాబీ జియో లుక్స్ మాత్రం పిచ్చెక్కించేసాయి. ఎటు చూసినా శవాల గుట్టలు బీకరమైన యుద్ధ సన్నివేశాలతో కంగువ టీజర్ వేరే లెవెల్ లో ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ టీజర్ ట్రెండింగ్ లో ఉంది.

పీరియాడికల్ కథతో వస్తున్న సూర్య :

పీరియాడికల్ కథతో సూర్య (Surya) తెరమీద సందడి చేసేందుకు రెడీ అయ్యాడు. కోలీవుడ్ డైరెక్టర్ సిరుత్తై శివ (Siruttai Shiva)కంగువ (kanguva) సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ (UV Creations), స్టూడియో గ్రీన్‌ (Studio Green)సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ హీరోయిన్ గా నటిస్తోంది. జగపతిబాబు (Jagapathi Babu), బాబీ డియోల్‌ (Bobby Deol), యోగిబాబు (Yogibabu), కోవై సరళ (Kovai Sarala)కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మూవీకి టాలీవుడ్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ (DeviSri Prasad)మ్యూజిక్ అందిస్తున్నారు.

త్రీడీ ఫార్మాట్‌లో కంగువ :

‘కంగువ’ (kanguva)షూటింగ్‌ ఇప్పటికే పూర్తి అయింది. ప్రస్తుతం మేకర్స్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు . త్రీడీ ఫార్మాట్‌లో ఈ మూవీని తెరకెక్కించబోతున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో ఈ చిత్రాన్ని ఏకంగా 10 భాషల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సుమారు రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో కంగువను నిర్మిస్తున్నారు మేకర్స్.

ఈ పీరియాడికల్‌ ఫిల్మ్‌లో కొన్ని సన్నివేశాల్లో కంగ అనే యోధుడి క్యారెక్టర్ లో కనిపిస్తారు. 17వ శతాబ్దానికి చెందిన ఓ వీరుడతో కనెక్ట్‌ అయ్యే ఓ పాయింట్‌తో ‘కంగువా’ను తెరెకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కాబోతోంది. మొదటి భాగం 2024లోనే విడుదల చేయనున్నారు.

Leave a Comment