Surya Tilak to Ayodhya Rama : అయోధ్య రామయ్యకి సూర్య తిలకం : ఇది ఒక ప్రత్యేక ఘట్టం :

website 6tvnews template 3 2 Surya Tilak to Ayodhya Rama : అయోధ్య రామయ్యకి సూర్య తిలకం : ఇది ఒక ప్రత్యేక ఘట్టం :

Surya Tilak to Ayodhya Rama : అయోధ్య లో బాలరాముడు కొలువుదీరాడు, వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అత్యంత వైభవంగా, శాస్త్రోక్తంగా జరిగింది.

ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు లక్షలాది మంది రామ భక్తులు అయోధ్యకు తరలి వచ్చారు.

రామ జన్మభూమి లో జరిగిన ఈ కార్యక్రమం తో దేశమంతటా ఆధ్యాత్మిక శోభా ఫరిఢవిల్లింది. రామ మందిర ప్రారంభోత్సవం, అలాగే ప్రాణ ప్రతిష్టతో ఒక చారిత్రాత్మక కార్యక్రమం పూర్తయింది, అయితే మరో అద్భుతమైన ఘట్టానికి అయోధ్య రామ మందిరం వేదిక అవ్వనుంది.

అదే సూర్య తిలకం. ఇది ప్రతి రోజు జరిగే తంతు కాదు. ఏడాదికి ఒక్కరోకు మాత్రమే ఇది ఆవిష్కృతం అవుతుంది.

ఇది ఒక ప్రత్యేకమైన టెక్నాలజీ : This is a different technology

WhatsApp Image 2024 01 22 at 3.00.22 PM Surya Tilak to Ayodhya Rama : అయోధ్య రామయ్యకి సూర్య తిలకం : ఇది ఒక ప్రత్యేక ఘట్టం :


అసలు సూర్య తిలకం అంటే ఏంటి, ఇది ఎలా సంభవిస్తుంది. దీనికి ప్రత్యేకమైన టెక్నాలజీ ఏమైనా ఉందా అని చాల మందిలో సందేహాలు ఉన్నాయి.

వాటి గురించి చుస్తే, ఈ ఆలయ నిర్మాణం నుండే దీనిపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఈ సూర్య తిలకం అనేది ఏరోజు పడితే ఆరోజు రాదు, ప్రతి ఏటా శ్రీరామ నవమి రోజునే వస్తుంది.

అది కూడా మధ్యాహ్నం సరిగ్గా 12 గంటల సమయానికి మొదలై ఆరు నిమిషాల పాటు ఉంటుంది. అసలు సూర్య తిలకం అంటే ఏమిటో చెప్పలేదు కదూ, సూర్య తిలకం అంటే సూర్యుడి కిరణాలు అయోధ్య లోని బాల రాముడి విగ్రహం నుదుటిపై ప్రసరించడం, సూర్య కిరణాలు సరిగ్గా తిలకం దిగినట్టు రాముడి నుదుటిపై పడతాయి కాబట్టే ఆ ప్రక్రియను సూర్య తిలకం అని అంటారు.

ఈ సూర్య తిలకం ప్రక్రియను రూపొందించేందుకు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆస్ట్రోఫిజిక్స్‌ వారి సహకారంతో, సెంట్రల్‌ బిల్డింగ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ వారు ఒక ప్రత్యేక వ్యవస్థను రూపొందించారు.

ఇక బెంగుళూరు కి చెందిన ఆప్టిక్స్ అనే సంస్థ ఆ ప్రియకు కావలసిన సామాగ్రిని తయారు చేసిందట.

సూర్య గమనానికి అనుగుణంగా ఏర్పాట్లు : Arrangements according to the movement of sun

WhatsApp Image 2024 01 22 at 3.00.20 PM Surya Tilak to Ayodhya Rama : అయోధ్య రామయ్యకి సూర్య తిలకం : ఇది ఒక ప్రత్యేక ఘట్టం :

రాంచంద్రుడి నుదుటిపై సూర్య తిలకం వచ్చేలా చేయడానికి కటకాలు, అద్దాలు, గేర్‌బాక్స్‌లు, గొట్టాలు వంటి వాటిని ఉపయోగించారు. సూర్య కిరణాలు నేరుగా మూడో అంతస్తు నుండి గర్భ గుడిలోని రాముడి విగ్రహం పై పడతాయి.

ఈ విషయంలో ఎవరికైనా కొన్ని అనుమానాలు రావచ్చు. ప్రతి ఏటా ఒకే రోజు రాదు కదా శ్రీరామా నవమి, తిధులు మారతాయి కాబట్టి తారీఖు కూడా మారుతుంది, తిధులు మారితే సూర్యుడు గమనం కూడా మారుతుంది అనే సందేహం తలెత్తొచ్చు.

అందుకే సూర్యుడి గమనంలో వచ్చే మార్పు ను దృష్టిలో పెట్టుకుని 19 గేర్‌బాక్స్‌లను రూపొందించారు. కాబట్టి చాంద్రమాన తిధికి అనుగుణంగా సూర్య కిరణాలూ ప్రతి ఏటా ఖచ్చితంగా రాముడి నుదుటిపైనే పడతాయి.

Leave a Comment