ఎలెక్షన్స్ షెడ్యుల్ ప్రకటించ గానే దేశవ్యప్తంగా ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చిన వార్త అందరికి తెలిసిన విషయమే కదా ! మొట్ట మొదట ఎలక్షన్ కోడ్ ను అతిక్రమించి నందుకు ఏపి కి చెందిన ఒక ప్రభుత్వ ఉద్యోగి మీద సస్పెన్షన్ చేసారు ఆ జిల్లా కలెక్టర్. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా లో కొత్తూరు మండలానికి చెందిన దిమ్మిలి VRO ను సస్పెండ్ చేసు కలెక్టర్ ఆదేశాలు జారీ చేసారు. ఎలక్షన్ కోడ్ ప్రకరారం ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు పార్టీ నేతలతో ఎన్నికల ప్రచారం లో పాల్గోకోడదు.
దీనికి వ్యతిరేకంగా ఆయన ప్రవర్తించడం వల్ల సస్పెండ్ చేసామని అధికారులు చెప్పారు.ఈ విషయం పలు వార్తా పత్రికలలో ప్రముఖం గా ప్రచురించడం తో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై జిల్లా కలెక్టర్ విచారణ జరిపించారు. ఈ వార్త పై విచారణ జరిపిన అనంతరం ఆయన మీద సస్పెండ్ వేటు పడింది. అంతే కాకుండా ఆయన మీద డిసిప్లనరి యాక్షన్ తీసుకోవాల్సిందిగా అధికారులను కలెక్టర్ ఆదేశాలు జారీ చేసారు.