Chinese garlic: అమెరికాలో చైనా వెల్లుల్లి పై రగడ..అపరిశుభ్ర పెంపకాన్నీ అవలంబిస్తున్నారని ఆరోపణ.

t is alleged that Chinese garlic is being used in America..unclean cultivation.

Chinese garlic: అమెరికాలో చైనా వెల్లుల్లి పై రగడ..అపరిశుభ్ర పెంపకాన్నీ అవలంబిస్తున్నారని ఆరోపణ..

చైనా వెల్లులి దిగుమతులపై దర్యాప్తు జరగాలని కోరుతూ సంచలన ప్రకటన చేశారు రిపబ్లికన్ పార్టీకి చెందిన అమెరికా సెనెటర్ రిక్ స్కాట్. ఈ వెల్లుల్లితో అమెరికా జాతీయ భద్రతకు ముప్పు పొంచి ఉందని చెప్పుకొచ్చిన ఆయన ప్రజల ఆరోగ్యానికి ఇది హానికరమని ఆరోపణలు కూడా చేశారు.

వెల్లుల్లిని పెంచి ఉత్పత్తి చేసే క్రమం లో చైనా దేశీయులు అపరిశుభ్రమైన విధానాలను అవలంబిస్తున్నారని పేర్కొన్నారు. చైనా దేశంలో పండించే వెల్లుల్లి పంటకు మురుగునీటిని ఎరువుగా వాడుతున్నారని అన్నారు.

ఈ విషయం ఇలా ఉంటె వెల్లుల్లితోపాటు, చిల్డ్ గార్లిక్ ను ఉతపత్తి చేసే దేశాల్లో చైనానే మొదటి స్థానంలో ఉన్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి.

ఇక అమెరికా చుస్తే వీటిని దిగుమతి చేసుకునే దేశాల్లో ప్రధమ స్థానంలో ఉంది. ఇది ఇలా ఉంటె అమెరికా చైనా విషయంలో వెల్లుల్లి గొడవలు పెట్టిందా, లేక వెల్లుల్లిని అడ్డం పెట్టుకుని ఈ రెండు దేశాలు కీచులాడుకుంటున్నాయా అన్నది అర్ధం కానీ పరిస్థితి నెలకొంది.

చైనా అతి తక్కువ ధరలకు వెల్లుల్లిని తీసుకొచ్చి ఇక్కడ కుమ్మరిస్తోందంటూ అమెరికా వాదిస్తోంది, పైగా ఈ దిగుమతులకు అడ్డుకట్ట వేసేందుకు చైనా దిగుమతులపై వివిధ రకాల చార్జీలు వడ్డించింది.

ఇక వెల్లుల్లి విషయానికే వస్తే భారత దేశంలోని వెల్లుల్లిని మనం గమనిస్తే ఇక్కడి వెల్లుల్లి కాస్త చిన్నగానే ఉంటుంది, కాస్త అటుఇటుగా అదే పరిమాణంలో ఉంటుంది మిగిలిన దేశాల్లో వెల్లుల్లి కూడా, కానీ చైనా వెల్లుల్లి మాత్రం సైజులో కాస్త పెద్ద గా ఉంటుంది.

పైగా తెల్లగాఉంటుంది. చైనా దేశస్థులు పెంచే ఈ వెల్లుల్లి పెంపకంపై చాలా కాలం నుండే ఆందోళన వ్యక్తమవుతొంది. ప్రమాకరమైన లోహాలతోపాటు, విషతుల్యమైన కలుషిత మురుగునీటిని వాడి ఈ వెల్లుల్లిని పెంచుతున్నారని ఆరోపణలను చైనా ఎదుర్కొంటోంది.

అయితే నిపుణులు చెప్పే మాటలను చుస్తే చెట్లకు మొక్కలకు మురుగునీరు వాడటం వల్ల వచ్చే నష్టం ఏమి లేదని అంటున్నారు.

కానీ కలుషితమైన విషతుల్యమై లోహాలు ఉన్న నీటిని వాడటం మాత్రం సమర్ధించిన దాఖలాలు లేవు. మరి ఈ వెల్లుల్లి వివాదం ఎక్కడికి తీసుకువెళుతుందో చూడాలి.

Leave a Comment