Tapsee: తాప్సీ పెళ్లైపోయిందా?

website 6tvnews template 2024 03 26T114113.081 Tapsee: తాప్సీ పెళ్లైపోయిందా?

తాప్సీ పన్ను (Taapsee Pannu) తెలుగు సినిమా ఝుమ్మందినాదం (Jhummandinadam)తో తన కెరీర్ స్టార్ట్ చేసింది. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాఘవేంద్ర రావు (Raghavendra rao) దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో తన అందాలతో కుర్రాళ్ల హృదయాలను దోచేసింది. ఆ తర్వాత వరుసగా టాలీవుడ్ ఆఫర్స్ అమ్మడి తలుపు తట్టాయి. పలు సినిమాల్లో నటించి తన నటనతో తాప్సీ పాపులర్ అయ్యింది. అందం, నటన రెండూ ఉన్నా కూడా తెలుగులో పెద్దగా ఈ బ్యూటీకి అదృష్టం కలిసిరాలేదు. స్టార్ ఇమేజ్ రావడంతో ఇక్కడ నెట్టుకురావడం కష్టం అని భావించిన తాప్సీ బాలీవుడ్ బాట పట్టింది. అక్కడ అతి కొద్ది కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది తాప్సీ.

గ్లామర్ రోల్స్ కు దూరంగా ఉంటూ మెసేజ్ ఓరియెంటెడ్, ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. స్టార్ హీరోలతో సైతం జత కడుతూ నార్త్ లో చెలరేగిపోతోంది ఈ బ్యూటీ. రీసెంట్ గా షారుక్ ఖాన్ (Sharukh Khan)హీరోగా వచ్చిన డంకీ (Dunki)లో హీరోయిన్ గా నటించి మరోసారి అమ్మడి టాలెంట్ ను చూపించింది. ఎట్టకేలకు బాలీవుడ్‎లో సెటిల్ అయిన ఈ బ్యూటీ డెన్మార్క్‌ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బో (Mathias Boe) తో ప్రేమలో పడింది. వీరిద్దరి ప్రేమాయణ సజావుగా సాగుతున్న సమయంలో మరో విషయం బయటకు వచ్చింది. తాజాగా ఈ జంట సీక్రెట్ గా పెళ్లి చేసుకుందని సోషల్ మీడియాలో రూమర్స్ వస్తున్నాయి. దీంతో మరోసారి తాప్సీ హాట్ టాపిక్ గా మారింది.

ఉదయ్‌పూర్‌లో సీక్రెట్‎గా పెళ్లి :

తాప్సీ(Taapsee Pannu), మథియాస్ బో(Mathias Boe)2013లో మొదటిసారి కలిశారు. ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్‌లో మ్యాచ్ ఆడేందుకు భారతదేశానికి వచ్చిన మథియాస్ కు తాప్సీ తో పరిచయం ఏర్పడింది. అప్పుడే బాలీవుడ్ లో కెరీర్ స్టార్ట్ చేసింది తాప్సీ. వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఆ పరిచయం చివరికి ప్రేమగా మారింది. గత పదేళ్లుగా వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారు. అయితే తాజాగా వీరిద్దరూ సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారని తెలుస్తోంది.

341f023b f1a7 46a7 ba67 0422a92c64b9 Tapsee: తాప్సీ పెళ్లైపోయిందా?

మార్చి 23న రాజస్థాన్‌ (Rajasthan)లోని ఉదయ్‌పూర్‌ (Udaipur)లో వీరి పెళ్లి జరిగిందని టాక్ వినిపిస్తోంది. గతంలో తాప్సీ ఓ ఇంటర్వ్యూలో లవ్, మ్యారేజ్ విషయంలో తనకంటూ కొన్ని నిర్థిష్టమైన అభిప్రాయాలు ఉన్నాయని చెప్పింది. అంతేకాదు తన లవ్ మ్యాటర్ ను ఎప్పుడూ పబ్లిక్ చేయలేదు. అందుకే తాప్సీ తన పెళ్లిని ప్రైవేట్ గా జరగాలని ప్లాన్ చేసిందట. అందుకే ఆమె సెలబ్రిటీలను ఎవరినీ వివాహానికి ఆహ్వానించలేదని సమాచారం.

సిక్కు, క్రిస్టియన్ సంప్రదాయాల వివాహం :

బాలీవుడ్ సెలబ్రిటీ అయినా తాప్సీ తన వివాహాన్ని చాలా సింపుల్ గా తన సన్నిహితులు, బంధువులు సమక్షంలో మాత్రమే తన ప్రియుడిని పెళ్లాడిందని సమాచారం. అంతేకాదు పెళ్లికి వచ్చిన వారికి కొన్ని కండీషన్లు పెట్టిందట. పెళ్లి ఫొటోలను,వీడియోలను ఎక్కడ కూడా పోస్ట్ చేయకూడదని షరతు విధించినట్లు సమాచారం. అందుకేనేమో తాప్సీ పెళ్లి జరిగి మూడు రోజులు కావస్తున్నా ఒక్క ఫోటో కూడా నెట్టింట్లో ప్రత్యక్షమవ్వలేదు. అందుకే తాప్సీ పెళ్లి మ్యాటర్ బయటకు రావడానికి ఇంత టైం పట్టింది. ఎట్టకేలకు తన సీక్రెట్ పెళ్లి విషయం రివీలైంది. ఇక తాప్సీ తన వివాహాన్ని సిక్కు, క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం చేసుకున్నట్లు తెలుస్తోంది. మరి తన పెళ్లి విషయాన్ని అఫీషియల్ గా ఎప్పుడు అనౌన్స్ చేస్తుందోనని నెటిజన్స్ వెయిట్ చేస్తున్నారు.

Leave a Comment