Taiwan’s massive earthquake kills 9 people, earthquake intensity – 7.4 : బుధవారం ఉదయం తైవాన్ తూర్పు తీరంలో 7.4 తీవ్రతతో కూడిన భూకంపం సంభవించింది. భవనాలు బాగా దెబ్బ తిన్నట్లు అగ్ని మాపక అధికారులు తెలిపారు.అక్కడక్కడ కొండచరియలు విరిగిపడినట్లు సాక్షులు చెప్పారు.
ఇంత పెద్ద భూకంపం 25 సంవత్సరాలలో తైవాన్‌ను తాకిన అతిపెద్దది ఇదే అని అధికారులు చెప్పారు. పక్కనే ఉన్న చైనాలోని కొన్ని ప్రాంతాలలో కూడా భూకంపం సంభవించిందని చైనా అధికారులు కూడా వెల్లడించారు.
ఈరోజు సంభవించిన శక్తి వంతమైన భూకంపం వల్ల 9 మంది మరణించారు. దాదాపు 730 మంది గాయపడ్డారు అని అధికార్లు చెప్పారు. అంతే కాకుండా డజన్ల కొద్దీ భవనాలను ధ్వంసం చేసిందని వారు చెప్పారు.
అలాగే జపాన్ లోను ఫిలిప్పీన్స్‌లకు సునామీ హెచ్చరికలను జారీ చేసింది. దశాబ్దాల కాలంలో ద్వీపాన్ని వణికించిన ఇంత పెద్ద భూకంపం అత్యంత బలమైనదని, రానున్న రోజుల్లో మరిన్ని ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.