టికెట్ ఇవ్వలేదని మనస్తాపంతో తమిళనాడు MP ఆత్మహత్యా ప్రయత్నం

website 6tvnews template 2024 03 28T124728.511 టికెట్ ఇవ్వలేదని మనస్తాపంతో తమిళనాడు MP ఆత్మహత్యా ప్రయత్నం

ఎన్నికలలో అభ్యర్ధి పోటీ చెయ్యడానికి ఏ పార్టీ అయిన ఆయనకి టికెట్ కేటాయించాలి. ఇది ఎక్కడైనా జరిగేదే. ఒకవేళ ఆ అభ్యర్ధికి టికెట్ ఇవ్వడానికి పార్టీ నిరాకరిస్తే మాత్రం ఆ అభ్యర్ధి పార్టీ మారడం లేదా తానే స్వతంత్రం గా నిలబడి పోటీ చెయ్యడం అనేది సర్వసాధారణం. కాని ఒక అభ్యర్ధి మాత్రం తన పార్టీ తనకు టికెట్ కేటాయించడం లేదని తెలిసి ఒక MP ఆత్మ హత్యకు ప్రయత్నించడం బహుశా దేశం లో ఇదే మొదటి సారి అయి ఉంటుంది.

ఇక వివరాలలోకి వెళ్తే తమిళనాడు రాష్ట్రం ఈరోడ్ పార్లమెంట్ నియోజకవర్గానికి చెందినా గణేశ మూర్తి వయసు 74, ఈయన DMK పార్టీ నుండి MP అభ్యర్ధి గా ఉన్నారు. కాని ఈసారి అనూహ్యం గా ఈయనకు పార్టీ టికెట్ ఇవ్వడానికి నిరాకరించింది అని తెలిసింది. MDMK పార్టీ ఇప్పుడు అధికారం లో ఉన్న DMK పార్టీ తో పొట్టు పెట్టుకోవడం జరిగింది. అయితే పొత్తులో బాగం గా ఈ నియోజకవర్గ సీటు ను DMK కి వెళ్ళిపోయింది.

ఈ సారి పార్లమెంట్ ఎన్నికలో ఈరోడ్ నియోజకవర్గ అభ్యర్ధి గా DMK పార్టీ అభ్యర్ధిగా ప్రకాష్ ను ప్రకటించడం జరిగింది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కు అత్యంత సన్నిహితుడు గ పేరు సంపాదించుకున్న ప్రకాష్ కి ఈరోడ్ టికెట్ ఇవ్వాలని నిశ్చయించడం తో ఇదే స్దానానికి టికెట్ ఆశించిన గణేశ్ మూర్తి కి పరాభావించినట్లయింది అనుకుని ఆయన బయటకి చెప్పుకోలేక అలాగే పార్టీ నిర్ణయం ను సమర్ధించలేక ఆయన లోనే ఆయనే భాదపడి ఆదివారం రాత్రి సమయం లో ఆయన పురుగులు మందు తాగి ఆత్మహత్య కు పాల్పడినట్లు కుటుంబ సబ్యులు తెలిపారు. ఆయితే అందుతున్న సమాచారం మీరకు ఆయన ICU లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నట్లు ఆయన కుటుంబ సబ్యులు చెప్పారు.

Leave a Comment