Jr NTR : తారక్ బాలీవుడ్ ఎంట్రీ..హీరోయిన్ ఎవరంటే..పాన్ ఇండియా సినిమా కోసం తారక్ జాగ్రత్తలు..
యంగ్ టైగర్ అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే jr ఎన్టీఆర్, ట్రిపుల్ ఆర్ సినిమా తరువాత తన తదుపరి సినిమా ఖచ్చితంగా హిట్టు కొట్టి తీరాలని పట్టుదలతో ఉన్నాడు.
ఎందుకంటే రాజమౌళి తో సినిమా తరువాత ఖచ్చితంగా ఫ్లాప్ పడుతోంది అనే వదంతి చెరిపేయాలని భావిస్తున్నాడట. అది ఉత్త మాటైతే కాదు, ఒకప్పుడు స్టూడెంట్ నెంబర్ 1 సినిమా తరువాత వచ్చిన సుబ్బు ఆశించిన స్థాయిలో ఆడలేదు.
మరో సారి సింహాద్రి చేశాక కూడా ఆంధ్ర వాలాతో ఘోర పరాజయం ఎదురైంది, యమదొంగ తరువాత కూడా కంత్రి సినిమా సోసో గానే వెళ్ళింది. కాబట్టి ట్రిపుల్ ఆర్ తరువాత వస్తున్న దేవర సినిమాను చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నాడట తారక్.
అయితే దేవర ను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో jr ఎన్టీఆర్ సరసన jr శ్రీదేవి నటిస్తోంది. జాన్వీ కపూర్ ఇప్పటికే షూటింగ్ లో పాల్గొంటోంది.
అయితే ఇక మీదట తారక్ చేయబోయే ప్రతి సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయాలనీ ప్లాన్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ట్రిపుల్ ఆర్ తో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన తారక్ అక్కడ ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. కాబట్టి తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ఉండేలా చూస్తున్నాడు.
ఈ క్రమంలోనే వార్ 2 సినిమాను ప్లాన్ చేశాడు. వార్ 2 సినిమాలో హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవాలి తారక్.
మరి హృతిక్ రేంజ్ కి మీట్ అవ్వాలంటే తారక్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్తున్నాడు. ఆ సినిమాలో తారక్ గెటప్ ఎలా ఉండబోతోంది అనే విషయాలపై అభిమానుల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో తారక్ సరసన శార్వరి అనే అమ్మడు హీరోయిన్ గా చేసే ఛాన్స్ కొట్టేసింది.
ఇంతకీ ఎవరు ఈ శార్వరి అని అనుకుంటున్నారా ? ఈ అమ్మడు ఇంతకుముందు మోడలింగ్ తోపాటు పలు బాలీవుడ్ సినిమాలకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో కూడా పనిచేసింది.
బంటి ఔర్ బబ్లీ 2 సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది రీసెంట్ గా ఓ వెబ్ సిరీస్ లో కూడా నటించింది. ప్రస్తుతం ఈవిడ చేతిలో మరో రెండు బాలీవుడ్ ప్రాజెక్టులు కూడా రెడీ గా ఉన్నాయట. మొత్తం మీద తారక్ బాలీవుడ్ లో బిజీ ఆర్టిస్ట్ తోనే జోడీ కట్టబోతున్నాడు.