TATA Death blow to China: సరిహద్దులో చైనాకి టాటా చావుదెబ్బ..ఎన్ని వేల కోట్లు పెట్టుబడి పెట్టిందటే.
టాటా కంపెనీ, ఈ కంపెనీ గుండు సూది నుండి బుల్డోజర్ వరకు అనేక రకాల వస్తువులు తయారు చేసింది, అయితే ఈ సారి టాటా కంపెనీ తయారు చేయబోయే వస్తువు, ఈ సారి ఉప్పత్తి చేయబోతున్న వస్తువు మన శత్రు దేశం చైనా ను గట్టిగానే దెబ్బతీయబోతోంది.
ఆ దెబ్బ అలంటి ఇలాంటి దెబ్బ కాదు, చైనా కి ఈ దెబ్బతో దిమ్మ తిరిగి బొమ్మ కనపడిపోద్ది. అంత కాన్ఫిడెంట్ గా ఎలా చేబుతున్నారు అని డౌట్ రావచ్చు.
మరి లాంటి అనుమానాలకు సమాధానం మీకు ఇక్కడ దొరుకుతుంది. చైనా దేశం ఆర్ధికంగా బలంగా ఉండటానికి కారణం మిగిలిన దేశాలు వెళ్లి ఆ దేశంలో పెట్టుబడులు పెట్టడం, పైగా ఆ దేశంలో ఎక్కువ వస్తువులు ఉత్పత్తి అవ్వడం.
కేవలం మన భారత దేశంలో మాత్రమే కాదు, ప్రపంచం లోని ఎన్నిక దేశాల్లోని ప్రజలు వాడుతున్న వస్తువుల మీద చుస్తే మెడ్ ఇన్ చైనా అని ఉంటుంది. అసలు సెల్ ఫోన్ లు చైనా లోనే ఎందుకు తయారవుతున్నాయి.
అదే విధంగా చాల వరకు సెల్ ఫోన్ లు కూడా చైనా కంపెనీవే అయి ఉండటం మనం చూస్తున్నాం. ఇక ఎలాన్ మాస్క్ కి సంబంధించిన టెస్లా కారు కూడా చైనా లోనే ఉత్పత్తి అవుతోంది అంటే కారణం ఏమిటి. ఇలాంటి డౌట్స్ చాల మందికి రావచ్చు.
చైనా లో ఎలా అయితే అపార కుబేరులు, సంపన్నులు ఉన్నారో మిగిలిన దేశాల్లో కూడా అలానే ఉన్నారు. కానీ వారంతా వారి దేశంలో వస్తువులను ఎందుకు ఉత్పత్తి చేసుకోలేకపోతున్నారు.
చైనా మాదిరిగా సెల్ ఫోన్ లు ఎందుకు తయారు చేసుకోలేకపోతున్నారు. చైనా మాదిరిగా ఎందుకు ఇతరదేశాల పెట్టుబడులు ఆకర్షించడం లో మిగిలిన దేశాలు వెనుకబడుతున్నాయి.
మిగిలిన అన్ని దేశాల సంగతి పక్కన పెడితే, భారత్ ఎందుకు పక్కనే ఉన్న చైనా ను ఢీ కొనలేకపోతోంది. చైనా ను వెనక్కి నెట్టి ఆర్ధికంగా ఎందుకు ముందుకు వెళ్లలేకపోతోంది. చైనా అవసరం లేకుండా సొంతగా ఎందుకు సెల్ ఫోన్లు తయారు చేసుకోలేకపోతోంది.
ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉండగా ఎలాన్ మస్క్ చైనాలోనే టెస్లా కంపెనీ స్థాపించి కార్లను ఉత్పత్తి చేస్తున్నాడు. దానికి కారణం లిథియం, టెస్లా కార్లు నడిచేది బ్యాటరీ తో ఆ బ్యాటరీలో ఉపయోగించే లిథియం చైనా లో పుష్కలంగా దొరుకుతుంది కాబట్టి మస్క్ తన కంపెనీని చైనా లో స్థాపించాడు,
స్థాపించక తప్పలేదు. అయితే అదే లిథియం మన భారత దేశంలో దొరకదా అంటే, నిస్సందేహంగా పుష్కలంగా లభ్యమవుతుంది.
మరి ఆ లిథియం ను వెలికితీసి బ్యాటరీలు తయారు చేస్తే భారత్ చైనాను దెబ్బ కొట్టినట్టే కదా, వారి ఆదాయానికి గండి ఎక్కడ పడుతుందో తెలుసా ?
సరిగ్గా వారి సరిహద్దుల్లోనే, అరుణాచల్ ప్రదేశ్ లో ఈ గ్రీన్ ఫీల్డ్ ను ఏర్పాటు చేయబోతున్నారు. ఆ పని చేయబోయేది మరెవరో కాదు దిగ్గజ వ్యాపార సంస్థ టాటా.
అసలే చైనాకి భారత్ కు సరిపడదు, అలాంటిది పోయి పోయి చైనా సరి హద్దు ప్రాంతమైన అరుణాచల్ ప్రదేశ్ కి సరిహద్దు గల అస్సాంలో లిథియం ప్లాంట్ పెట్టడం అంటే డ్రాగన్ ను రెచ్చగొట్టడమే అవుతుంది అని సందేశం రావచ్చు.
కానీ టాటా కంపెనీ వారు ఆశా మాషీగా అస్సాం ను ఎంచుకోలేదు, టాటా కంపెనీకి కేంద్ర ప్రభుత్వం అండదండలు మెండుగా ఉన్నట్టు తెలుస్తోంది. కేంద్రం సలహా మేరకే వారు అస్సాం లో గ్రీన్ ఫీల్డ్ స్టార్ట్ చేయడానికి రెడీ అయ్యారు.
పైగా టాటా వంటి సంస్థ వచ్చి ఆడటం ఆ సంస్థ వెనుక కేంద్రం ఉండటం తో అస్సాం ముఖ్య మంత్రి అనుమతులు, భూమి వగైరాలు అందించడంలో ఆలస్యం చేస్తారా.
ఆ పనులు పర్మిషన్లు అన్ని కూడా చక చకా జరిగిపోయాయి. చైనా ఏదైనా దుందుడుకు చర్యలకు దిగినా కేంద్ర రక్షణ శాఖ ఉండనే ఉంది కాబట్టి ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేకపోయింది.
టాటా కంపెనీ ఏకంగా 40 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతున్నారు అని బహిరంగంగా అనౌన్స్ చేశారు అస్సాం సీఎం హిమంతా బిశ్వాస్ శర్మ.
అత్యధిక జనాభా కలిసాగిన చైనా దేశం యొక్క మరో బలం ఏమిటంటే ప్రపంచంలో మారె దేశము ఉత్పత్తి చేయని సెమి కండక్టర్లను ఈ దేశం ఉత్పత్తి చేస్తోంది.
అయితే ఇప్పుడు ఈ సెమికండక్టర్లను కూడా భారత్ లో ఉత్పత్తి చేయాలనీ అందులోను ఆ కేంద్రాన్ని కూడా అస్సాం లోనే నెలకొల్పాలని భావిస్తున్నారట. ఈ సెమి కండక్టర్లను భారత్ లో ఉత్పత్తి చేయడం అనేది ప్రధానాంశం కాదు, మేక్ ఇన్ ఇండియా మెడ్ ఇన్ ఇండియా అనేదే కాకుండా మెడ్ బై ఇండియన్ అనేది కూడా చాలా అవసరం.
అందుకే వీటిని టాటా కంపెనీ ఉత్పత్తి చేయదానికి ముందుకు వచ్చింది. ఇలా చేయడం వల్ల ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెటివ్ అనేది బయటి దేశం వారికి పోకుండా ఉంటుంది, మన దేశం లోనే వస్తువు ఉత్పత్తి అవుతుంది, అలాగే ఆ ఉత్పత్తి అయినా వస్తువు ఇతరదేశాల ఎగుమతి అయ్యి మనకు ఆదాయాన్ని, పేరును గడిస్తుంది.
ఇక టాటా కంపెనీ అస్సాం దేశంలో 40 వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఇంతటి స్థాయిలో పరిశ్రమలు నెలకొల్పడం అనేది కేవలం వారి స్వలాభం కోసం,
అలాగే దేశం యొక్క పేరు ప్రతిష్టలు కోసం మాత్రమే కాదు, ఇందులో సామాజిక కోణం కూడా దాగి ఉంది. అస్సాం లోని మహిళలు నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తారు.
ఈ పరిశ్రమలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే అనేక మందిని ఎంపిక చేసిన యువతకు శిక్షణ తరగతులు కూడా ఇస్తున్నారు. శత్రువును దెబ్బ కొట్టాలంటే కేవలం శరీరకంగానే కాదు, వారి ఆర్ధిక మూలాల మీద దెబ్బ కొట్టినా మనం విజయం సాధించినట్టే.
ఇప్పటికే చైనా లోని బ్యాంకింగ్ రంగం, అలాగే రియల్ ఎస్టేట్ రంగం మునిగిపోతున్న పడవ మాదిరిగా అయ్యాయి. దానికి తోడు ఆదేశానికి ఇంతటి ఆదాయాన్ని తెచ్చిపెట్టే ఈ రంగంలో భారతదేశం ప్రధాన పోటీదారు అయ్యిందంటే వారికి అది కంటగింపుగా మారుతుంది.