Bigg Boss7 : తేజా ఎలిమినేషన్ తప్పలేదు.. మూకుమ్మడిగా రెడ్ కార్డు ఇచ్చింది ఎవరికీ.. ఆ కాంటెస్ట్ కోసం సోషల్ మీడియా షేక్

0511Tasty Teaj1 F Bigg Boss7 : తేజా ఎలిమినేషన్ తప్పలేదు.. మూకుమ్మడిగా రెడ్ కార్డు ఇచ్చింది ఎవరికీ.. ఆ కాంటెస్ట్ కోసం సోషల్ మీడియా షేక్

Bigg Boss7 : తేజా ఎలిమినేషన్ తప్పలేదు.. మూకుమ్మడిగా రెడ్ కార్డు ఇచ్చింది ఎవరికీ.. ఆ కాంటెస్ట్ కోసం సోషల్ మీడియా షేక్

అందరూ ఊహించినట్టుగానే బిగ్ బాస్ హౌస్ నుండి తేజా ఎలిమినేటి అయిపోయాడు. ఓటింగ్ శాతం బాగా తక్కువ ఉండటంతో తేజా ను ఎలిమినేటి చేయక తప్పలేదు.

రూల్స్ కి లోబడి తేజాను ఎలిమినేటి చేశారు కానీ, తేజా హౌస్ లో ఉన్నప్పుడు తనదైన శైలిలో హాస్యాన్ని పండిస్తూ ఉండేవాడు. ఛలోక్తులు విసురుతూ హౌస్ మేట్స్ ను నవ్విస్తూ ఉండేవాడు. ఎంత మంచి వారా అన్నది బిగ్ బాస్ కి అనవసరం, బాగా ఆడారా లేదా అన్నది ఇక్కడ ఇంపార్టెంట్.

అందుకే ఎలిమినేషన్ అనేది అనివార్యంగా మారుతుంది. అలా ఎలిమినేషన్ అనేది గనుక లేకపోతె హౌస్ లోకి వచ్చిన వారిని ఎవ్వరిని బయటకు పంపాల్సిన అవసరం ఉండదు.

ఎందుకంటే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో ప్రకాష్ రాజ్ అన్నట్టు మనుషులంటేనే మంచివాళ్ళు రా అని, మంచివాళ్ళు అయినా.. గేమ్, గేమ్ లానే ఆడాలి.

కనుక ఎలిమినేషన్ ఉంటుంది. అన్నట్టు ఎలిమినేషన్ అంటే గుర్తొచ్చింది. హౌస్ లో ఆడే సమయంలో ప్రతి ఒక్కరు కూడా తాము ఎలిమినేటి అవ్వకూడదు అని అనుకుంటారు, కానీ పక్కవాళ్ళు ఎలిమినేటి అవుతున్న సమయంలో మాత్రం కన్నీళ్లు పెట్టుకుని సాగనంపుతూ ఉంటారు.

ఇటువంటి సీన్స్ చూసినప్పుడు మాత్రం కొందరు ఏమంటున్నారు అంటే, ఇదంతా రెట్రో స్టైల్ మేలో డ్రామా లా ఉందని చెబుతున్నారు. ఎందుకంటే హౌస్ లో సాటి కంటెస్టెంట్లపై రెచ్చిపోయి నిప్పులు కురిపించే శోభా, తేజ వెళ్ళిపోతే కన్నీళ్లు పెట్టుకుంది.

ఇలాంటివి చూసే వారు అలా మాట్లాడుతున్నారేమో అనిపిస్తోంది. అయినా ఎవరి దృక్పధం వాళ్ళది కాబట్టి దానిని కాస్త పక్కన పెట్టి అసలు విషయం లోకి వెళ్ళిపోదాం.

మన వాళ్ళు కేవలం తెలుగు బిగ్ బాస్ మాత్రమే ఫాలో అవుతున్నారు అనుకుంటే పొరపాటే తమిళ బిగ్ బాస్ ను కూడా తెగ ఫాలో అయిపోతున్నారు.

ఓటిటి వచ్చాక భాషా పరమైన బౌండరీలు చెరిపేసిందని, ఎవరికీ నచ్చిన సినిమా వారు చూస్తున్నారని మనం విన్నాం, అయితే అది క్రమంగా రియాలిటీ షోలకు కూడా పాకేసింది. అందులో భాగంగానే తమిళ బిగ్ బాస్ కి కూడా తెలుగు నాట పెద్ద సంఖ్యలో ఫాన్స్ ఉన్నారు.

తమిళ బిగ్ బాస్ గురించి చెప్పాలంటే, ఇప్పడు అక్కడ పెద్ద రచ్చే జరిగిపోతోంది. ఎందుకంటే అక్కడ రెడ్ కార్డు తో ఒక కంటెస్టెంట్ ను ఎలిమినేషన్ చేసేసారు. అది కూడా బాగా ఆడని కంటెస్టెంట్ ను ఎలిమినేటి చేస్తే ఏమోలే అనుకోవచ్చు.

కానీ ఈ కంటెస్టెంట్ తప్పకుండ టైటిల్ కొడతాడు అనుకున్న కంటెస్టెంట్ ను ఎలిమినేటి చేయడంతో అందరు ఆశ్చర్యపోతున్నారు. ఇక ఆడియన్స్ దీనిపై పెద్ద ఎత్తున రెస్పాండ్ అవుతున్నారు. సోషల్ మీడియాలో దీనిని విపరీతంగా ట్రేండింగ్ చేస్తున్నారు.

ఈ తమిళ బిగ్ బాస్ షో మొదటి నుండి విచిత్రంగానే నడుస్తోంది. కేవలం ఐదు వరాల వ్యవధిలో ఏడుగురు ఎలిమినేటి అయిపోయారు. అక్కడ కూడా మన గంగవ్వ మాదిరిగానే కొంచం వయసున్న వ్యక్తి వచ్చారు. కానీ అతను తనకు తానుగా విబయటకు వెళ్లిపోయారు.

తాను ఈ హౌస్ వాతావరణంలో ఇమడలేను అని చెప్పి వెళ్లిపోవడాన్ని చూడొచ్చు. ఇక మిగిలిన వారిని మాత్రం బిగ్ బాస్ టపా టపా ఎలిమినేటి చేసి పడేశారు. ఇలా ఎలిమినేటి చేసే క్రమంలోనే రెండు డబుల్ ఎలిమినేషన్స్ కూడా చేశారు.

కొసమెరుపు ఏమిటంటే ఇక్కడ ఎలిమినేషన్స్ మాత్రమే కాదు, వైల్డ్ కార్డు ఎంట్రీలు కూచోటుచేసుకున్నాయి. కానీ అన్నిటికి మించి రచ్చ లేపింది మాత్రం రెడ్ కార్డు ఎలిమినేషన్ మాత్రమే.

మన తెలుగులో ఉల్టా ఫుల్ట మాదిరిగా తమిళ్ బిగ్ బాస్ లో కూడా ఉల్టా పుల్ట ఉన్నట్టు ఉంది. అందుకే ఐదుగురు కంటెస్టెంట్లు వైల్డ్ కార్డు ఎంట్రీతో హౌస్ లోకి వచ్చారు. ఇక రెడ్ కార్డు తో ఎలిమినేటి అయిన వ్యక్తి పేరు ప్రదీప్ ఆంటోని.

ఇతను ఒక అప్ కమింగ్ యాక్టర్. తన నటనతో మంచి పేరు తెచ్చుకున్న ప్రదీప్ బిగ్ బాస్ లోకి ఎంటర్ అయ్యాడే కానీ రెడ్ కార్డు ఎలిమినేషన్ ఎదుర్కోవలసి వచ్చింది.

ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే తాను హౌస్ లో ఉన్నది కొద్దీ రోజులే అయినా ఓటింగ్ శాతం విపరీతంగా వచ్చింది ప్రదీప్ కి. ప్రేక్షకులు తనకు 40 శాతం ఓటింగ్ ఇచ్చారు.

అంతటి ఓటింగ్ రావడానికి కారణాలు ఏంటి అన్నది పక్కన పెడితే, అతనేమీ పెద్ద నటుడు కాదు, మన తెలుగులో కంటెస్టెంట్ శివాజీ మాదిరిగా 97 సినిమాలు చెయ్యలేదు, రాజకీయాలలో అడుగుపెట్టి ఒక పార్టీని సపోర్ట్ చేస్తూ మాట్లాడింది లేదు.

అయినా అతనికి విపరీతమైన వోటింగ్ లభిస్తోంది. కారణం ఏమిటంటే ప్రదీప్ ఎవరికీ లొంగే రకం కాదు. అందుకే హౌస్ లో ప్రతి ఒక్కరికి టార్గెట్ అయ్యాడు.

హీరో బాలయ్య చెప్పినట్టు పేస్ మాస్కులు లేవు, మాటలకు ఫిల్టర్లు లేవు అన్న విధంగా మాట్లాడతాడు. అందుకే బిగ్ బాస్ వీక్షకులు అతనికి బాగా కనెక్ట్ ఆయ్యారు.

బిగ్ బాస్ హౌస్ లో, హోస్ట్ కమల్ హాసన్ ఈ వారంలో ఒకరికి రెడ్ కార్డు ఎలిమినేషన్ ఇవ్వాలని, అందుకు కన్ఫెషన్ రూమ్ లో రెడ్ కార్డు ఎలిమినేషన్ కి కారణం చెప్పొచ్చని చెబుతాడు.

దానికి హౌస్ లో కంటెస్టెంట్లు ప్రదీప్ కు రెడ్ కార్డు ఇస్తూ వారు చెప్పిన కారణాలు చుస్తే నవ్వొస్తుంది. పూర్ణిమ అనే కంటెస్టెంట్ అయితే దారుణమైన ఎలిగేషన్ చేసింది.

అదేమిటంటే రాత్రి సమయంలో ప్రశాంతగా నిద్ర పోవాలంటే భయమేస్తుంది, ప్రదీప్ ఉన్నాడంటే సేఫ్ గా లేదనిపిస్తోందని చెబుతోంది. ఆమె చెప్పిన కారణాలు విన్న వారు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.

హౌస్ లో అన్ని సీసీ కెమెరాలు ఉండగా ఆమె అటువంటి వ్యాఖ్యలు చేయడాన్ని విడ్డురంగా చూస్తున్నారు. ఇక మరో కంటెస్టెంట్ చూస్తే ప్రదీప్ తన వస్తువులు విరగ్గొస్తున్నాడని అందుకే రెడ్ కార్డు తనకే ఇస్తున్నానని చెప్పింది.

అయితే ప్రదీప్ విరగ్గొట్టింది ఆమె చేతి వ్రిస్ట్ బ్యాండ్ మాత్రమే, అది కూడా కావాలని ప్రదీప్ బ్రేక్ చేయలేదు, పొరపాటుగా జరిగిపోయింది.

దానిని కూడా రెడ్ కార్డు ఎలిమినేషన్ కోసం చుపెట్టడం దారుణం అంటున్నారు. ఇలాంటి ఎలిగేషన్ల వల్లనే ప్రదీప్ పెద్ద ఫేమ్ ఉన్న నటుడు కాకపోయినా తమిళ నాట అతని పేరు ఇప్పుడు మారుమ్రోగిపోతోంది.

ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే కమల్ హాసన్ ప్రేదీప్ ను కన్ఫెషన్ రూమ్ లోకి పిలిపించి మాట్లాడతాడు. నీపై ఇలా కంప్లైంట్స్ వచ్చాయి, రెడ్ కార్డు ఎలిమినేషన్ ఉంటుంది అని చెప్పగానే, అతడు ఏమాత్రం ఆలోచించకుండా ఒకే సర్ వెళ్ళిపోతాను సర్ అని చెప్తాడు.

అసలు ఎందుకు రెడ్ కార్డు అని గాని తన తప్పు ఏమిటని గాని అస్సలు ఆడలేదు ప్రదీప్. ఇది వీక్షకులను ఎక్కువ షాక్ కి గురిచేసింది.

ఇలాంటి సమయంలో ప్రదీప్ కి ఆడియన్స్ నుండే కాదు, పాత కాంటెస్టుల నుండి కూడా సపోర్ట్ అందుతోంది. పైగా సోషల్ మీడియాలో బ్రింగ్ బ్యాక్ ప్రదీప్ అంటూ స్లొగన్స్ ట్రెండ్ అవుతున్నాయి.

అయితే అతడిని హౌస్ లోకి తిరిగి తెచ్చుకోలేక , వదిలేయలేక తెగ గింజుకుంటున్నారట. ఎందుకంటే ప్రదీప్ ఉంటేనే కంటెంట్ దొరుకుతుంది అన్నట్టు మారింది పరిస్థితి.

మిగిలిన వారు అందరు తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అన్నట్టు వాళ్ళ పని వాళ్ళు చేసుకునేవారు కానీ, హౌస్ లో సరైన పద్దతిలో ఆడేవారే కనిపించడం లేదంట.

మరి తమిళ బిగ్ బాస్ ఇదే పంధా కొనసాగిస్తూ ముందుకి వెళతారో, లేదంటే ఆడియన్స్,, బిగ్ బాస్ రెగ్యులర్ ఫాలోవర్స్ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని మరలా అతడిని వైల్డ్ కార్డు తో హౌస్ లోకి తీసుకొస్తారో చూడాలి.

Leave a Comment