Telangana Assembly elections: తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికల హోరు మొదలైంది
ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. చాలా మంది సినీతారలు ఇప్పటికే ఓటు వేశారు.
రాజకీయ నాయకులు, ప్రముఖులు పోలింగ్ కేంద్రాలలో ఓట్లు వేస్తున్నారు. అయితే ఒక వృద్దురాలు 95 ఏళ్ల వయసులో కూడా తన బాధ్యతని విస్మరించకుండా వీల్ చైర్లో పోలింగ్ కేంద్రానికి వచ్చింది.
మెదక్ జిల్లాలోని నిజాంపేట మండలంలోని కల్వకుంట గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కల్వకుంట గ్రామానికి చెందిన 95 ఏళ్ల వృద్దురాలు 223 బూత్ లో ఓటు వచ్చింది.