తెలంగాణా కేబినేట్ మీటింగ్ – లేడీస్ కి వడ్డీ లేని ఋణం,రేషన్ కార్డు, ఆర్ధిక సాయం – CM రేవెంత్

image 177 తెలంగాణా కేబినేట్ మీటింగ్ - లేడీస్ కి వడ్డీ లేని ఋణం,రేషన్ కార్డు, ఆర్ధిక సాయం - CM రేవెంత్

ఈరోజు జరగబోయే కాబినెట్ మీటింగ్ లో లోక్ సభ ఎన్నికలు దృష్టి లో పెట్టుకుని ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందని సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఈ రోజు జరిగే మీటింగ్ లో ఏ ఏ వర్గాలకు ఎలాంటి మేలు జరుగుతుందనే చర్చ ఇప్పుడు. ముందు ముందు ఎన్నికలు జరగనున్న దృష్ట్యా కచ్చితం గా తాయిలాలు ప్రకటించ వచ్చని అందరు అనుకుంటున్నారు. కాంగ్రెస్ చెప్పిన 6 వాగ్దానాలు అమలుకు 100 రొజులు గడువు పూర్తి అయ్యింది.

ఆయితే కాంగ్రేస్ మహిళలకు నెలకు 2,500 రూపాయలు చొప్పున ఆర్ధిక సహాయం హామీ అనే విషయం మీద ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అలాగే తెల్ల రేషన్ కార్డు లు కోసం అంచనాకు మించి దరఖాస్తు రావడం తో ఇవికూడా పరిశీలించాలని కేబినేట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

గత 2008 DSC కి అర్హత సాదించిన అభ్యర్దుల ఉద్యోగాల సంబందించి వారం రోజుల్లోగా గుడ్ న్యూస్ చెప్తామని ప్రకటించిన ఈ సమయంలో ఈ విషయం మీద కుడా చర్చలు జరుపుతామని కేబినేట్ మంత్రుల కమిటి సబ్యులు చెప్పడం జరిగింది. ఇంకా 11 కొత్త BC కార్పోరేషన్లు అందుబాటు లోకి తీసుకురావడానికి కూడా ఎం చెయ్యాలనే దానిమీద కూడా చర్చిస్తామని చెప్పారు.

Leave a Comment