Telangana celebrities came to vote: ఓటింగ్ కి వచ్చిన సెలబ్రిటీస్ వీళ్ళే.

Add a heading 2023 11 30T125114.279 3 Telangana celebrities came to vote: ఓటింగ్ కి వచ్చిన సెలబ్రిటీస్ వీళ్ళే.

Telangana celebrities came to vote: ఓటింగ్ కి వచ్చిన సెలబ్రేటిస్ వీళ్ళే .


తెలంగాణాలో ఈ రోజు జరుగుతున్న ఎన్నికల సందర్భంగా ఓటు వేయడానికి ఉదయం నుంచే చాలా మంది సినీప్రముఖులు పోలింగ్ కేంద్రాలకి వచ్చారు. అందరితో పాటు లైన్ లో నిలబడి వెళ్ళి ఓటు వేశారు.

మెగా స్టార్ చిరంజీవి కుటుంబసమేతంగా పోలింగ్ కేంద్రానికి వచ్చి చాలాసేపు క్యూలో నిలబడి ఓటు వేశారు. ఓటర్స్ కి ఏం చెప్తారు అని ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు నవ్వుతూనే ” వాళ్ళకి వాళ్ళ రెస్పాన్సిబులిటీ ఎంతో తెలుసు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ” అన్నారు.

మెగా హీరో రామ్ చరణ్ ఏకంగా సినిమా షూటింగ్ కి ఈ రోజు అంటే ఎలెక్షన్ కారణంగా సెలవు పెట్టి మరి ఓటు వేయడానికి వచ్చాడు . ఓబుల్ రెడ్డి స్కూల్ వద్ద ఎన్టీఆర్, వాళ్ళ కుటుంబం మొత్తం ఓటు వేశారు.

జూబ్లీహీల్స్ పబ్లిక్ స్కూల్లో హీరో శ్రీకాంత్ కుటుంబంతో కలిసి ఓటు వేయడానికి వచ్చారు.
జూబ్లీ హీల్స్ క్లబ్ లో హీరో నితిన్ తన ఓటు వేశారు.

BSNL సెంటర్ పోలింగ్ కేంద్రంలో 153 లో అల్లు అర్జున్ తన ఓటుని వేశారు.
జూబ్లీ పబ్లిక్ స్కూల్ లో కీరవాణి కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు.

అలాగే దర్శకుడు రాఘవేంద్రరావ్ , హీరో రానా, నటి ఝాన్సీ తదితరులు తమ ఓటు వేశారు.
అక్కినేని నాగార్జున, అమల, నాగచైతన్య కుటుంబమంతా ఓటు వేయడానికి వచ్చారు.

వీరితో పాటు ప్రముఖ రాజకీయ నాయకులు కూడా తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. పోలింగ్ మొదలైన కొద్ది గంటల్లోనే ఓటింగ్ భారీగా సాగుతోంది.

ఎన్నికల సంఘం ఇచ్చిన నివేదిక ప్రకారం ఉదయం 09:00 గంటల వరకే ఓటింగ్ శాతం 08.52 ఉందని సమాచారం. సమాయానుసారంగా ఈ నివేదికలో పెరుగుదల ఉంటూనే ఉంటుంది.

Leave a Comment