Telangana Final Voter List is out : తెలంగాణ ఓటర్ల తుది జాబితా సిద్ధమైంది.కొత్తగా నమోదైన ఓట్లను ఒకసారి చూడండి.
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది, రాజకీయ పార్టీలు అభ్యర్థులను ప్రకటించేశాయి, అభ్యర్థులు నామినేషన్ వేసే గడువు కూడా నవనార్ 10 వ తేదీ తో ముగిసింది.
అయితే ఇవన్నీ జరిగిపోయిన విషయాలు అందరికి తెలిసిన విషయాలే అంటారా ? అయితే ఈ విషయాలను ఇప్పుడు ప్రస్తావించడం ఎందుకంటే. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు.
మరి అసలు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి, అందులో పాత ఓట్లు ఎన్ని, కొత్తగా నమోదైన ఓట్లు ఎన్ని, పురుషుల ఓట్లు ఎన్ని స్త్రీల ఓట్లు ఎన్ని అనే విషయాలపై ఒక లుక్కేద్దాం రండి.
తెలంగాణ లో ఈ దఫా జరగబోయే ఎన్నికల్లో నేతలు మహిళలనే ప్రసన్నం చేసుకోవాల్సి ఉంటుందేమో, ఎందుకంటే ఈ సారి ఎన్నికల సమయానికి రాష్ట్రంలో మహిళా ఓటర్లు పురుష ఓటర్ల కన్నా ఎక్కువ ఉన్నారు కాబట్టి. తాజాగా విడుదల చేసిన ఓటరు జాబితా ప్రకారం చూస్తే రాష్ట్రంలో మెుత్తం ఓటర్ల సంఖ్య 3,26,18,205కు చేరుకుంది.
ఇందులో పురుష ఓటర్లు 1,62,98,418 మంది ఉన్నారు. మహిళా ఓటర్లు చూస్తే 1,63,01,705 మంది ఉన్నారు. అంటే పురుషుల కన్నా స్త్రీ ఓటర్లు 3,287 మంది ఎక్కువగా ఉన్నారు.
ఇదే జాబితాను మనం నియోజకవర్గాల వారీగా గమనిస్తే తెలంగాణ లో 119 నియోజకవర్గాలు ఉండగా 75 నియోజకవర్గాల్లో మురుష ఓటర్ల కన్నా స్త్రీ ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. 44 స్థానాల్లో పురుష ఓటర్లు స్త్రీ ఓటర్ల కన్నా ఎక్కువ ఉన్నారు.
ఇదే జాబితాని జిల్లాల వారీగా చూసుకుంటే 26 జిల్లాల్లో మహిళల ఓట్లే పురుషుల ఓట్ల కన్నా ఎక్కువగా ఉన్నాయి. కేవలం మేడ్చల్-మల్కాజిగిరి, హైదరాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాలలో మాత్రమే పురుష ఓట్లు అధికం.
ఇక తెలంగాణ రాష్ట్రంలో ఈ అసెంబ్లీ ఎన్నికల నాటికి కొత్తగా ఓటు హక్కు పొందిన వారి వివరాలు చూస్తే, 18-19 సంవత్సరాల వయసు వచ్చిన వారు ఈ సారి రికార్డు స్థాయిలో ఓటు హక్కు పొందినట్టు ఓటరు జాబితా ద్వారా తెలుస్తోంది. ఈ దఫా 8,11,648 ఓటర్లు 18-19 సంవత్సరాల వయసుగల వారు ఉన్నారు. ఈ జాబితా అక్టోబర్ 4 తరువాత ప్రకటించిన జాబితా. అయితే అక్టోబరు 31 తర్వాత మరో 1,88,019 ఓట్లు నమోదు కావడం చెప్పుకోదగ్గ విషయం. ఇక ట్రాన్స్ జండర్ల ఓట్లు చుస్తే 2,676 ఉన్నాయి.