తెలంగాణా గవర్నర్ తమిళ సై రాజీనామా – అందుకేనా !

website 6tvnews template 2024 03 18T175346.897 తెలంగాణా గవర్నర్ తమిళ సై రాజీనామా - అందుకేనా !


తెలంగాణా గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ అకస్మాత్తుగా తన పదవికి రాజీనామా చేసారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కి పంపించడం కూడా జరిగింది అని అధికారులు చెప్పారు. అంతే కాదు పుదుచ్చేరి గవర్నర్ పదివికి కుడా రాజీనామా చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. అందరు కొంత ఆశ్చర్యానికి కి గురి అయిన తర్వాత ఆమె నిర్ణయం తెలుసుకుని కాస్త తెరుకున్నట్లు తెలిసింది.

తాను పార్లమెంట్ ఎలక్షన్స్ లో టికెట్ ఆశిస్తున్నట్లు అందుకు ఈ గవర్నర్ పదవి నుండి తపుకున్నట్లు ఆమె చెప్పారు. అంతే కాదు ఈమె తమిళనాడు నుండి ఎంపి గా పోటీ చేసే ఆలోచన ఉన్నట్లు చెప్పారు. తాను చెన్నై సెంట్రల్ నుండి BJP ఎంపి గ పోటీ చెయ్యాలని అనుకుంటున్నట్లు చెప్పారు. ఈమె రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేస్తారని ఎప్పటినించో అనుకుంటున్నారని కూడా తెలుస్తోంది. ఈమె తమ సొంత రాష్ట్రం నుండే ఎన్నికల బరి లో దిగుతారని ఆమె కూడా అక్కడ నుండే పోటీ చేయాలనీ ఆసక్తి ఉన్నట్లు చెప్పారు.

గత పార్లమెంట్ ఎన్నికలలో ఆమె DMK అభ్యర్ది కనిమోళి పై పోటీ చేసిన ఆమె పరాజయం పొందారు. ఈమ వృతి రీత్యా డాక్టర్ అయిన BJP సిద్దాంతాలు పట్ల ఆకర్షితురాలై ఆ పార్టీ లో చేరినట్లు ఆమె చెప్పారు. ఈ సారి చూడాలి మరి ఆమె ఎక్కడ నుండి పోటీ చేస్తారు, ఆమె కి పోటీ గా ఏ పార్టీ అభ్యర్ది ఉంటారో చూడాలి.

Leave a Comment