Telangana Govt Announces Sankranti holidays: సంక్రాతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం.

Telangana Govt announced Sankranti holidays.

Telangana Govt announces Sankranti holidays: కొత్త సంవత్సరం రోజున కొత్త కాలెండర్ రానే వచ్చేసింది. మరి కొత్త కాలెండర్ వచ్చిందంటే కొంతమంది విద్యార్థిని విద్యార్థులు ప్రత్యేకంగా అందులో వెదికేది సెలవు దినాల జాబితాను.

సెలవు మాట వచ్చింది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం(Telangana State Government) జనవరి నెలకి సంబంధించి కొన్ని సెలవుల కి సంబంధించిన వివరాలను వెల్లడించింది.

జనవరి ఒకటవ తేదీన నూతన సంవత్సరం(New Year) సందర్భాన్ని పుసరస్కరించుకుని రేవంత్ రెడ్డి సర్కారు తెలంగాణ స్కూళ్ళకి సెలవు ఇచ్చేసింది.

ఇక తెలుగు వారి పండుగలలో ఎటి పెద్ద పండుగ అయినా సంక్రాంతికి సంబంధించి కూడా సెలవుల డీటైల్స్ ముందుగానే చెప్పేసింది.

Telangana 10th Class Exams Shedule :తెలంగాణ పదవతరగతి షెడ్యూల్

ఈ ఏడాది జనవరి 14వ తేదీన భోగి(Bhogi), 15వ తేదీన సంక్రాంతి(Sankranti), 16వ తేదీన కనుమ వచ్చాయి. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో పాఠశాలాలకి జనవరి 14 న భోగి సందర్భంగా,

15వ తేదీన సంక్రాంతి సందర్భంగా సెలవులు ఇచ్చేసింది. అయితే 16వ తేదీన వచ్చే కనుమ పండుగను మాత్రం ఆప్షానల్ గా వదిలేసింది. అంటే ప్రయివేటు పాఠశాలలు 16వ తేదీన కంపల్సరీ సెలవు ఇవ్వాల్సిందే అని నిబంధన ఏమి లేదని భావించవచ్చేమో.

ఇక జనవరి నెలలో వచ్చే మరో పర్వదినం గణతంత్ర దినోత్సవం. కాబట్టి జనవరి 26వ తేదీన పాఠశాలల్లో జండా వందనం, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం విద్యార్థులకి సేవవు ఇస్తారు.

సెలవుల మాట అటుంచితే తెలంగాణ విద్యా శాఖా రాష్ట్రం లోని పదవతరగతి పరీక్షల షెడ్యూల్ ను కూడా ఇప్పటికే విడుదల చేసింది.

మార్చి 18వ తేదీ నుండి 10th క్లాస్ పరీక్షలు(10th Class Exams) మొదలవుతాయి కాబట్టి పాఠశాలలు విద్యార్థులను పరీక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ చదివించడం మొదలు పెట్టాయి.

Leave a Comment