Telangana police caught 731 kilo ganja : బెజవాడలో తెలంగాణ పోలీసుల రైడ్.భారీగా పట్టుబడ్డ గంజాయి.
అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యాడో ఏమో కానీ ఓ ట్రక్ డ్రైవర్ చాలా చాకచక్యంగా గంజాయి చేయడానికి ప్రయత్నం చేశాడు. కానీ అది బెడిసి కొట్టడంతో పోలీసుల చేతికి చిక్కాడు.
అయితే ఈ ఆపరేషన్ మాత్రం భిన్నంగా సాగింది అని చెప్పొచ్చు. ఎందుకంటే హైదరాబాద్ విభాగాయానికి చెందిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం విజయవాడ నగరానికి సమీపంలో తనిఖీలు చేపట్టి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పక్కా ప్రణాళికతో లారీని అడ్డగించింది డీఆర్‌ఐ బృందం.
సెర్చింగ్ మొదలు పెట్టిన అధికారులు ట్రక్కు ట్రైలర్ బెడ్ బేస్‌లో అధికారులు ఓ రహస్య కుహరాన్ని కనుగొన్నారు. తనిఖీల నుండి తేలికగా తప్పించుకుని అక్రమ రవాణాను ఆశువుగా చేసేందుకు రహస్య కుహరం ఒకటి ఏర్పాటు చేసుకున్నాడు ట్రక్ డ్రైవర్. ఆ రహస్య స్థావరం లోనే 731 కిలోల గంజాయిని ప్యాకెట్లుగా పెట్టి భద్రపరిచారు.
ఈ గంజాయి విలువ 2.19 కోట్ల రూపాయల విలువ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ గంజాయిని ఏపీలోని పలు ఏజన్సీ ప్రాంతాల్లో పండించి అనేక రాష్ట్రాలకు ఎగుమతి చేస్తూ సొమ్ముచేసుకుంటున్నారు.
ఇక ఎన్‌డీపీఎస్ చట్టంలోని నిబంధనల ప్రకారం ట్రక్ డ్రైవర్ చేతికి బేడీలు వేసిన పోలీసులు రవాణా కోసం ఉపయోగించిన వాహనాన్ని సీజ్ చేశారు.