Telangana Schools Closed On November 29 & 30 | హైదరాబాద్ లో 29, 30 తేదీలలో పాఠశాలలకు, కళాశాలలకు సెలవు

election holidays

హైదరాబాద్ లో 29, 30 తేదీలలో పాఠశాలలకు, కళాశాలలకు సెలవు. అసెంబ్లీ ఎన్నికల కారణంగా ప్రభుత్వం ఇచ్చిన అధికారిక ప్రకటన.

29, 30 తేదీలలో హైదరాబాద్ లోని పాఠశాలలకు, కళాశాలకు సెలవు ప్రకటించారు. తెలంగాణాలో జరిగే అసెంబ్లీ ఎన్నికల కారణంగా రెండు రోజులు విద్యాసంస్థలు మూసివేయబడతాయి.

హైదరాబాద్ కలెక్టర్ ఈ రెండు రోజులని సెలవుదినాలుగా నవంబర్ 28 న ట్విటర్ లో ప్రకటించారు.
” తెలంగాణా లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు 2023 సందర్భంగా, నవంబర్ 29, 30వ తేదీలలో జిల్లాలో ఉన్న అన్నీ విద్యాసంస్థలు మూసివేయబడతాయి, మళ్ళీ డిసెంబర్ 1 నుంచి ఎప్పటిలాగే అన్నీ కార్యకలాపాలు జరుగుతాయి.” అని రాశాడు.

తెలంగాణలో జరిగే జరిగే ఎన్నికల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రెండు రోజుల విరామం తర్వాత పాఠశాలలు పునఃప్రారంభమై యధావిధిగా కొనసాగుతాయి.

ఇంతకు ముందు నవంబర్ 27, గురునానక్ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని కొన్ని పాఠశాలలకు సెలవుగా ప్రకటించారు, ఇప్పడు గురునానక్ జయంతిని 2023 లో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ పోర్టల్ కాలెండర్ లో జనరల్ హాలిడేస్ లిస్ట్ లో ఉంచింది.

అలాగే చాలా పాఠశాలలు ఈ సంవత్సరం అదనపు సెలవుల్ని పొందాయి. దీపావళి నవంబర్ లో ఆదివారం రోజున రావడంతో, హైదరాబాద్ లోని చాలా పాఠశాలలు, 13 నవంబర్ ని కూడా సెలవు దినంగా ప్రకటించాయి.

అయితే మరికొన్ని పాఠశాలలు నవంబర్ 13 కూడా పని దినంగా ప్రకటించి విద్యార్థులకు సెలవులు ఇవ్వలేదు. ఈ దీపావళిని కూడా సాధారణ సెలవుల జాబితాలో చేర్చాయి.

Leave a Comment