Telangana showcase on R-Day parade Kartavya path : కర్తవ్య పథ్‌ లో తెలంగాణ శకటం.

Telangana showcase on Aug 15 Kartavya path

Telangana showcase on R-Day parade Kartavya path : రిపబ్లిక్ డే(Republic Day) వేడుకలను ఢిల్లో లో ఘనంగా నిర్వహిస్తారు. ఈ వేడుకలను కర్తవ్య పథ్‌ లో నిర్వహిస్తారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

అయితే ఈ వేడుకలకు వివిధ రాష్ట్రాల నుండి వచ్చే శకటాలు మనకు కర్తవ్య పథ్‌ లో దర్శనమిస్తాయి. అయితే ఈ దఫా తెలంగాణ రాష్ట్రం(Telangana State) నుండి కూడా శకటం రానుంది.

తెలంగాణ రాష్ట్ర శకటం రావడంపై ఇంత ప్రత్యేకంగా ఎందుకు చెబుతున్నారా అని అనుమానం రావచ్చు. ఎందుకంటే నాలుగేళ్ల తరువాత ఈ ఏడాదే తెలంగాణ రాష్ట్రం నుండి శకటం వస్తోంది.

తెలంగాణ రాష్ట్ర శకటం మదర్ ఆఫ్ డెమోక్రసీ(Mother Of Democracy) పేరుతో కనిపించబోతోంది. చాకలి ఐలమ్మ, కొమరం భీం, రాంజీ గోండు వంటి పోరాట యోధుల ప్రతిమాలతో ఈ శకటాన్ని ఏర్పాటుచేసినట్టు తెలుస్తోంది. ఇక తెలంగాణ రాష్ట్రం ప్రతిపాదించిన ఈ థీమ్ కు కేంద్ర రక్షణ శాఖ(Central Defense Department) నుండి ఆమోదం కూడా లభించింది.

అయితే ఈ శకటం కర్తవ్య పథ్‌ లో నడుస్తునా సమయంలో శకటానికి ఇరువైపులా తెలంగాణ రాష్ట్రంలోని నృత్యాలు కూడా కనిపించే అవకాశం కూడా ఉందని అంటున్నారు. వాటికి గనుక అనుమతి లభిస్తే..కొమ్ముకోయ, గుస్సాడి, డప్పుల నృత్యాలను దేశం మొత్తం వీక్షించే వీలుంటుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రెండే రెండు సార్లు రాష్ట్ర శకటాలు కర్తవ్య పథ్‌ పై దర్శనమిచ్చాయి. ఒకటి 2015 మరొకటి 2020.

రెండు తెలుగు రాష్ట్రాలు ఒకేసారి : Two telugu states at a time

Telangana showcase on Aug 15 Kartavya path
Telangana showcase on R-Day parade Kartavya path

కానీ ఈ సంవత్సరం తెలంగాణ రాష్ట్రం నుండి కూడా శకటం కనిపించడానికి కారణం రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి(Cm Revanth Reddy) కేంద్రానికి సమర్పించిన లేఖే.

కర్తవ్య పథ్‌ లో కనిపించే శకటాల ఎంపిక డిసెంబర్ నెలలోనే పూర్తయిందట, కానీ తాను దేశ ప్రధాని నరేంద్ర మోదీని(Narendra Modi) కలిసినప్పుడు తెలంగాణ రాష్ట్ర శకటం కూడా కనిపించే అవకాశం ఇవ్వాలని కోరగా అందుకు అయన అంగీకరించి, ఒక లేఖ ఇవ్వమని సూచించారట.

అందుకే ఈ ఏడాది రాష్ట్ర శకటం కూడా దర్శనమివ్వబోతోందని అన్నారు. ఇక తెలంగాణ తో పటు మరో తెలుగు రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ శకటం కూడా ఎంపికైంది. డిజిటల్ క్లాస్ రూమ్ థీమ్‌తో ఏపీ శకటం కనిపించనుంది. 62 వేల డిజిటల్‌ క్లాస్‌ రూమ్‌ల ద్వారా ఏపీలో విద్యాబోధన చేస్తున్నారని జగన్ సర్కారు(CM Jagan) చెబుతోంది.

Leave a Comment