తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గత కొద్ది సేపటి క్రితం దర్శకుడు మంచి రచయిత అయిన సూర్యకిరణ్ మృతి చెందారు. ఇటీవల కొన్ని అనారోగ్య సమస్యలతో చెన్నై లోని ఒక ప్రైవేట్హా స్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అకస్మాత్తు గా ఆయన శరీరం ట్రీట్మెంట్ కి సహకరించక పోవడం వల్ల మృతి చెందినట్లు డాక్టర్స్ చెప్పారు.
ఒకే ఒక్క సినిమా సత్యం తో సూపర్ డూపర్ హిట్ కొట్టి తెలుగు ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేక స్దానాన్ని ఏర్పరచుకున్నారు. ఆ తర్వాత ధన 51,రాజుభాయ్, చాప్టర్ 6, తమిల్ లో నీలిమై చిత్రాలకు దర్శకత్వం వహించి వాటిని కూడా హిట్ చేసారు. అయితే కొన్ని మూవీ లలో కారెక్టర్ ఆర్టిస్ట్ గాను కొనసాగారు. సినీ నటి కల్యాణి ని పెళ్లి చేసుకున్నారు. కొంత కాలం తర్వాత విడిపోవడం జరిగింది. అదే ఆయనని కుంగ తీసింది అని స్నేహితులు ద్వార తెలుస్తోంది. ఈయన ప్రముక నటి సుజిత కు సోదరుడు అవుతాడు.