టాలీవుడ్ కి కొత్త ఏడాది సరిగా కలిసి రాలేదేమో!!?. పేరుకు తగ్గట్టుగానే క్రోధి నామ సంవత్సరం ప్రేక్షకుల కోవపాని గురి అవుతున్నట్లే వుంది.ఇప్పటి వరకు సుమారు 25 పైగా సినిమాలు విడుదల కాగా అందులో ఒక్కటి కూడా బాక్స్ఆఫీసు దగ్గర నిలవలేదు. మార్చిలో వొచ్చిన టిల్లు స్క్వేర్ తప్ప ఇప్పటికీ ఒక్కటి ఒక్కటంటే హిట్ లేదు. మంజుమ్మల్ బాయ్స్ లాంటి ఏవో కొన్ని మలయాళం సినిమాలు కాస్త సందడి చేసాయే తప్ప తెలుగు సినిమాలు మాత్రం పూర్తిగా చప్పపడి పోయాయి. దీంతో టాలీవుడ్ లో తాత్కాలికంగా కలెక్షన్ స్లంప్ వున్నట్లే అని టాలీవుడ్ లో విశ్లేషణలు వినిపిస్తున్నాయి. రొటీన్ థ్రిల్లర్లు, యాక్షన్లు, ఆకట్టుకోని కథనాలు, ఒక్క లైన్ కూడా లేని కథలు.. ప్రేక్షకులకు బోర్ కొట్టించాయి అని అంటున్నారు. పైగా పెద్ద సినిమాలు ఏవీ రాకపోవటం..పుష్ప 2 , రామ్ చరణ్, చిరు మూవీల అప్ డేట్ లు కొన్ని వైరల్ అవ్వటం మినహా ఏమీ హిట్ రాలేదు. టాలీవుడ్ బాక్స్ఆఫీసులో కళకళలు మొదలవ్వాలంటే ఆగస్టు రావలేమో. సుకుమార్-అల్లు అర్జున్
క్రేజీ కాంబినేషన్లో పుష్ప 2 పై మొదటి నుండీ భారీ అంచనాలు వున్నాయి. నెగెటివ్ షేడ్ వున్న పాత్రను తన మానారిజం, స్టైల్తో ఓ లెవెల్ కి తీసుకు వెళ్ళిన బన్నీ.. మళ్ళీ ఏం మ్యాజిక్ చేస్తాడో చూడాలి. అయితే ఈ మధ్య రిలీజు అయిన పాటలు, glims వైరల్ అయినా ఏ మేరకు హిట్ అవుతుందో అని టీం కి ఎక్కడో కొడుతోందట. దేవి ప్రసాద్ మ్యూజిక్ పెద్దగా మ్యాజిక్ చేసినట్లు లేదని గుసగుసలట. కొత్త ఏడాదిలో కలెక్షన్ స్లంప్లో వున్న టాలీవుడ్ కి పుష్ప ఏ మేరకు ప్లస్ అవుతుందో చూడాలి.