హైదరాబాద్ కాంగ్రెస్ అభ్యర్ధి గా టెన్నీస్ తార సానియా మీర్జా ?

website 6tvnews template 2024 03 28T152234.851 హైదరాబాద్ కాంగ్రెస్ అభ్యర్ధి గా టెన్నీస్ తార సానియా మీర్జా ?

రాబోయే పార్లమెంట్ ఎన్నికల జరుగుతున్నవేళ ఒక్కక్క అభ్యర్ధి ఖరారు చేస్తు సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది కాంగ్రెస్ పార్టీ. అయితే ఎన్నికలను 7 విడతలు గా నిర్వహిస్తామని ఇప్పటికే ఎలక్షన్ కమీషన్ ప్రకటించింది. ఇక అప్పటి నుండి అభ్యర్ధుల వేట మొదలు అయ్యింది. అయితే పాత బస్తి లో మాత్రం AIMIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ కి కంచుకోట అని చెప్పాలి.

ఈ నేపద్యం లో పాతబస్తీ మీద గురి పెట్టాయి ఆయా పార్టీలు. ఇప్పటికే BJP అభ్యర్ధి గా మాధవీ లతను అధిష్టానం నిర్ణయించగా, AIMIM పార్టీ అభ్యర్ధి గా ఒవైసీ పోటీలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కాని ఆ ప్రాంతం లో కాంగ్రెస్ పట్టు కోసం ఎప్పటి నుండో ప్రయత్నాలు చేస్తూనే ఉంది కాని ఇంతవరకు AIMIM పార్టీ అభ్యర్ది అక్కడ విజయం సాధించడం పరిపాటి అయిపోయంది. కాని ఈ సారి మాత్రం బలమైన అభ్యర్ధి నిలబెట్టి గట్టి పోటీ ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.

అయితే పాతబస్తీ ప్రాతం ముస్లిం ల జనాభా ఎక్కువ ఉంటుంది, అక్కడ ఉన్నది AIMIM అభ్యర్ధి ఒవైసీ కూడా బలమైన అభ్యర్ధి కాబట్టి తమ అభ్యర్ధి కుడా చాలా బలమైన వారై ఉండాలనే ఉద్దేశ్యం తో అక్కడ టెన్నీస్ తార సానియా మీర్జా ని హైదరాబాద్ పార్లమెంట్ స్దానానికి ఎంపిక చేసి అక్కడ నిలబెట్టి నట్లయితే సునాయాసం గా గెలవచ్చని కాంగ్రెస్ పార్టి ఆలోచిస్తోంది. మరి వేచి చూడాలి ఆమె రాజకేయాలలోకి వస్తారో రారో కాలమే నిర్ణయించాలి. గతం లో ఒకసారి సానియా మీర్జా తెలంగాణా రాష్ట్ర అంబాసిడర్ గా కుడా ఉన్నారు.

Leave a Comment