ప్లాంట్ నిర్మాణం కోసం టెస్లా కార్ల కంపెనీ ప్రతినిధులు భరత్ పర్యటన !

website 6tvnews template 2024 04 04T145710.161 ప్లాంట్ నిర్మాణం కోసం టెస్లా కార్ల కంపెనీ ప్రతినిధులు భరత్ పర్యటన !

Tesla car company representatives visit India for plant construction! : ఇటీవల కుదురిన భారత్ – టెస్లా కార్ల కంపెనీ ఒప్పందం ప్రకారం టెస్లా కార్ల కంపెనీ ప్రతినిదులు త్వరలో భారత్ పర్యటనకు వస్తున్నట్లు సంస్ద ఒక ప్రకటన విడుదల చేసింది. టెస్లా కార్ల ప్లాంట్ కోసం అనువైన సైట్‌లను అధ్యయనం చేయడం కోసం ఈ సంవత్సరం ఏప్రిల్ చివరి నాటికి US నుండి ఒక ప్రత్యక బృందాన్ని పంపుతున్నట్లు సంస్ద తెలిపింది.

అయితే ఈ సంస్ద ప్రతినిధులు మహారాష్ట్ర, గుజరాత్ లతో పాటు దక్షిణాన తమిళనాడుతో సహా ఇతర రాష్ట్రాలలో ఉన్న ప్రస్తుత ఆటోమోటివ్ హబ్‌లు ఉన్న రాష్ట్రాలను కుడా సందర్శిస్తుందని విలేఖరుల సమావేశం లో టెస్లా ప్రతినిధులు చెప్పడం జరిగింది. EV డిమాండ్ ఉన్న సమయంలో కంపెనీ భారతదేశంలోకి అడుగుపెట్టాలని యోచిస్తున్నట్లు వారు తెలిపారు.

ఎవరైతే EV తయారీదారులు తో పాటు ఆటోమ్లు ఉన్న ప్రతీ రాష్ట్రాలపై దృష్టి సారిస్తామని కంపెనీ ప్రకటన విడుదల చేసింది. భారతదేశం గత నెలలో వాహన తయారీదారులు ఉత్పత్తి చేస్తున్న కొన్ని EVలపై దిగుమతి సుంకాలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఇక అప్పటి నుండి టెస్లా కార్ల కంపెనీ ఎలాగైనా భారత్‌లోకి అడుగుపెట్టాలని కొన్నేళ్లుగా ప్రయత్నం చేస్తూనే ఉంది.

కాని భారత దేశం లో EV మార్కెట్ చిన్నది అని కాని అది భవిష్యత్ లో బాగా పెరుగుతుందని టెస్లా కంపెనీ ఆలోచింది భారత్ లోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నట్లు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ అప్పట్లో తన అభిప్రాయం తెలిపాడు. కానీ భారత దేశం లో తనకు లోకల్ దేశీయ కార్ల తయారీ సంస్థ అయిన టాటా కార్ల కంపెనీ నుండి గట్టి పోటీ ఉంటుందని ఎలాన్ మస్క్ చెప్పడం విశేషం.

భారత మార్కెట్లోకి టెస్లా ప్రవేశించిన తర్వాత మరింత EV పెట్టుబడులను మరియు ప్రయోజనాలను భారత్ కు రాగలవని భారత ఆర్ధిక నిపుణులు అంచనా వేస్తున్నారు. టెస్లా కంపెనీ అధికారులు గత ఏడాది కాలంగా భారత ప్రభుత్వ అధికారులతోను వివిధ శాఖల మంత్రులు తోను చర్చలు జరుపుతునే ఉన్నారు. చివరకి టెస్లా కార్ల కంపెనీ గత ఏడాది జూలైలో భరత్ లో తన ప్లాంట్ పెట్టాలని అందుకు ఆసక్తిగా ఉన్నామని తెలిపింది.

దీని ద్వారా టెస్లా $2 బిలియన్ డాలర్ల నుండి $3 బిలియన్ డాలర్ల వరకు EV ప్లాంట్ నిర్మాణం కోసం వెచ్చిస్తున్నామని టెస్లా కంపనీ ప్రతినిధులు ఒక ప్రకటన విడుదల చేసారు. ఇప్పుడు అనువైన ప్రాతం కోసం తమ సంస్ద ప్రతినిధులు త్వరలో భారత్ సందర్శన కు వస్తారని తెలిపింది.

Leave a Comment