Thalapathy vijay enter into Tamilnadu politics: నా టార్గెట్ అదే..రాజకీయాల్లోకి దళపతి విజయ్

02 Thalapathy vijay enter into Tamilnadu politics: నా టార్గెట్ అదే..రాజకీయాల్లోకి దళపతి విజయ్

Thalapathy vijay enter into Tamilnadu politics: తమిళనాడు(TamilNadu)లో ఉన్నన్ని పార్టీలు దేశంలో మరెక్కడా కనిపించవు. ఆ రాష్ట్రంలో ఇప్పటికే వందకు పైగా పొలిటికల్ పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా రాష్ట్రంలో మరో కొత్త పొలిటికల్ పార్టీ ఆవిర్భవించింది.

తమిళనాటలో ఫుల్ లెన్త్ మాస్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ దళపతి విజయ్ (Vijay) రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. పార్టీ పేరును ‘తమిళగ వెట్రి కళగం’(Tamilaga Vetri Kalagam)గా విజయ్ అనౌన్స్ చేశారు. సోషల్‌ మీడియాలో అఫీషియల్‎గా విజయ్ తన రాజకీయ ఎంట్రీ గురించి అనౌన్స్ చేశారు.

Target 2026 elections : 2026 ఎన్నికలే టార్గెట్

ట్విటర్ వేదికగా విజయ్ (Vijay) ఓ లెటర్ విడుదల చేశారు. ” త‌మిళ‌నాడు (TamilNadu) ప్ర‌జ‌లు మార్పును కోరుకుంటున్నారు. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయింది. అవినీతికి వ్యతిరేకంగా పోరాడేందుకే నేను రాజ‌కీయాల్లోకి వచ్చాను. అవినీతి నిర్మూల‌నే మా లక్ష్యం. అయితే రానున్న ఎలక్షన్లలో మా పార్టీ పోటీ చేయదు. అంతే కాదు ఏ పార్టీకి సపోర్ట్ ఇవ్వదు.

2026 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో (2026 elections)బరిలోకి దిగుతాం. త్వ‌ర‌లోనే ‘తమిళగ వెట్రి కళగం’ (Tamilaga Vetri Kalagam)పార్టీ జెండాతో పాటు అజెండాను అధికారికంగా ప్ర‌క‌టిస్తాం”అని విజయ్‌ తెలిపారు. ఇదిలా ఉంటే విజయ్‌ పార్టీకీ బీజేపీ (BJP) మధ్య సీక్రెట్ పొత్తు ఉందని, వచ్చే ఎన్నికల్లో(Elections) కొన్ని స్థానాల్లో బీజేపీ గెలుపు కోసం విజయ్‌ పార్టీ పనిచేసేలా ఒప్పందం కుదుర్చుకుందని మరోవైపు వార్త‌లు వ‌స్తున్నాయి.

Vijay active in service activities : సేవా కార్యక్రమాల్లో చురుగ్గా విజయ్

తమిళనాడు (TamilNadu)లో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ (Rajinikanth) తర్వాత అంతటి క్రేజ్, స్టార్‌డమ్‌ విజయ్‌ (Vijay) కి ఉంది. అందుకే ఆయన ఫ్యాన్స్ అభిమానంగా‘దళపతి’(Thalapathy) అని పిలుస్తారు. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే విజయ్ గతకొంతకాలంగా సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రతిభ చూపిన టెన్త్ క్లాస్, ఇంటర్ స్టూడెంట్స్ కు ప్రోత్సకాహాలు అందిస్తున్నారు. అయితే తమిళనాడులో ముందుగా రజనీకాంత్‌ రాజకీయాల్లోకి వస్తారని అందరూ భావించారు.

అయితే ఆయన పొలిటికల్ ఎంట్రీ ఉండదన్న క్లారిటీ వచ్చిన తర్వాత విజయ్‌ తన రాజకీయ ఎంట్రీలో స్పీడ్ పెంచారు. అందులో భాగంగానే విజయ్‌ ఆయన అభిమానుల సంఘాలతో పలుమార్లు సమావేశమయ్యారు. పొలిటికల్ పార్టీపై సుదీర్ఘమైన చర్చలు నిర్వహించారు. ఇక విజయ్ స్థాపించబోయే పార్టీ పేరు ‘తమిళగ మున్నేట్ర కళగం’ అని ప్రచారం జరిగింది. అయితే దీనికి స్వల్ప మార్పులు చేసి ‘తమిళగ వెట్రి కళగం’(Tamilaga Vetri Kalagam)అనే పేరును తన పార్టీకి ఖరారు చేశారు విజయ్ .

Leave a Comment