Constitution of Jammu & Kashmir: జమ్ముకశ్మీర్ రాజ్యాంగానికి ఎలాంటి విలువ ఉండదు.
భారతదేశంలో విలీనం కాకముందు జమ్ముకశ్మీర్ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. అఖండ భారతదేశ భూభాగం నుంచి విడిపోయి మరో దేశం గా ఏర్పడిన పాకిస్తాన్… కాశ్మీర్ లోని కొంత భూభాగాన్ని ఆక్రమించుకుంది.
ఈ నేపథ్యంలో అప్పటి కాశ్మీర్ ను పాలిస్తున్న రాజు.. భారత్ తో కలిసుంటామని,కాశ్మీర్ ను విలీనం చేసుకోమని అభ్యర్థిస్తే, అతని ఆకాంక్ష మేరకు జమ్ముకశ్మీర్‌ను భరత్ లో విలీనం చేసుకోవడం జరిగింది.
ఈ నేపథ్యంలోనే జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పిస్తూ, భారత రాజ్యాంగంలోని ‘ఆర్టికల్ 370’ని రూపొందించడం జరిగింది.
ఇటీవల కాలంలో ఈ 370 ఆర్టికల్ ను కేంద్ర ప్రభుత్వం ఒక చట్టాన్ని రూపొందించి రద్దు చేయడం జరిగింది. దానిని సవాలు చేస్తూ కాశ్మీర్ కి చెందిన కొంతమంది ఈ ఆర్టికల్ ను రద్దు చేయడం సమంజసం కాదంటూ సుప్రీంకోర్టులో వేశారు. కేసులను పరిశీలించిన
సుప్రీంకోర్టు 370 ఆర్టికల్ ను రద్దు చేస్తూ కేంద్రం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైందేనంటూ తీర్పును ఇచ్చింది. దీనిని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా స్వాగతించారు.
ఇప్పటికీ ఆర్టికల్ 370 శాశ్వతమైనదని ఎవరైనా అంటే వారు భారత రాజ్యాంగాన్ని, పార్లమెంట్‌ను అవమానించినట్లేనన్నారు.
ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం కోర్టు ఇచ్చిన తాజా తీర్పు తర్వాత జమ్ముకశ్మీర్ రాజ్యాంగానికి ఇకపై ఎలాంటి విలువ ఉండబోదని చెప్పారు. సరైన సమయంలో జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామన్న హామీకి కట్టుబడి ఉన్నట్లు అమిత్ షా తెలిపారు.
జమ్ముకశ్మీర్ రిజర్వేషన్ సవరణ బిల్లు, జమ్ముకశ్మీర్ పునర్విభజన సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా అమిత్ షా సుదీర్ఘ ప్రసంగం చేశారు. చర్చ అనంతరం రాజ్యసభ మూజవాణి ఓటుతో ఆమోదముద్ర వేసింది.
జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 వేర్పాటువాదానికి దారితీసిందని, అది తీవ్రవాదాన్ని ప్రోత్సహించందని ఆర్టికల్ 370 రద్దుపై తాజాగా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రతిపక్షాలకు చెంపపెట్టు లాంటిదని తెలిపారు.
కశ్మీరీలకు న్యాయం చేసేందుకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత్‌లో భాగం. దానిని ఎవరూ ఆక్రమించలేరు.
ఎవరైనా ప్రయత్నిస్తే గట్టిగా బుద్ధి చెబుతామని తెలిపారు. భారతదేశ అంగుళం భూభాగాన్ని కూడా కోల్పోయే ప్రసక్తే లేదు. అందుకు బీజేపీ ఎప్పటికీ సిద్ధంగా ఉండదు.
ఆర్టికల్ 370 ముసుగులో మూడు కుటుంబాలు అధికారాన్ని అనుభవించాయి. గత 75 ఏళ్లుగా స్థానిక ఎస్టీ ప్రజలు అన్ని హక్కుల్నీ కోల్పోయారని స్పష్టం చేశారు