LPG Cylinder: సిలెండర్ ధర రూ.500లే..లబ్ధిదారులకే ఈ పథకమంటున్న ప్రభుత్వం.
తెలంగాణలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఎన్నికలలో ఇచ్చిన వాగ్ధానాలలో భాగంగా సబ్సిడీ తో కూడిన సిలెండర్ ధర రూ.500గా నిర్ణయించింది.దీనికి లబ్ధిదారులు ప్రత్యేకంగా ధరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.
నమోదు ప్రక్రియ :
గ్యాస్ సిలిండర్ కోసం నమోదు చేసుకునేందుకు రాష్ట్ర LPG గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి, లేదా సహయం కోసం కస్టమర్ కేర్ సెంటర్ ను సంప్రదించాలి.
కావలసినవి :
ఆధార్ కార్డ్ / గుర్తింపు కార్డ్
చిరునామా రుజువు
బ్యాంక్ ఖాతా
రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసేందుకు పై వివరాలతో కూడిన నిర్ధిష్ట పత్రాలు అందించాలి.
పూర్తి అయిన తరువాత గ్యాస్ సిలెండర్ ని ఆన్లైన్ లో లేదా డిస్ట్రీబ్యూటర్ మొబైల్ యాప్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు.
ఈ క్రమలో రాష్ట్ర పాలక వర్గం లబ్ది దారులని జాగ్రతగా పరిశీలించి మరీ ఎంపిక చేసుకుంటుంది.
అతి తక్కువ ధరలో LPG సిలెండర్ లను అందించడం చాలా గొప్ప విషయం. కానీ దీనిలోనూ చిక్కులు లేకపోలేదు.
ఈ పథకం ద్వారా రాష్ట ఖజానా నుండి ఏటా రూ. 3,000 కోట్ల నుంచి రూ. 4,000 కోట్ల వరకు నిధులు ఖర్చు అవుతాయి.ఈ ఆర్థిక నిబద్దత పౌరుల శ్రేయస్సు కోసమే అని స్పష్టంగా తెలుస్తుంది.