దేశం లో మొట్ట మొదటి అండర్ గ్రౌండ్ మెట్రో – మోడీ

baeb96d8 b780 45a5 807c 5b0674c6cc1d దేశం లో మొట్ట మొదటి అండర్ గ్రౌండ్ మెట్రో - మోడీ

భారత దేశం లో మొదటి సారిగా నీళ్ళ అడుగున మెట్రో పరుగులు తీసింది. వెస్ట్ బెంగాల్ లో రాజధాని కోల్ కత లో ఈ అండర్ వాటర్ మెట్రో మార్గాన్ని భారత ప్రధాని మోడీ ప్రారంభింది జాతికి అంకితం చేసారు. అనంతరం కొంత మంది విద్యార్దులతో కల్సి కొంత దూరం ప్రయాణించారు. ప్రధాని వెంట ఆ రాష్ట్ర BJP అధ్యక్షుడు తో పాటు పలువు అధికారులు కుడా ఉన్నారు.

నదీ లో ఏ విధం గా ఈ ప్రాజెక్ట్ చెప్పట్టిందనే విశేషాలు అన్ని అధికారులు ప్రాదానికి వివరించారు. అనంతరం రాష్ట్రం లో పలు మెట్రో ప్రాజెక్ట్ లకు ప్రధాని మోడీ శ్రీకారం చుట్టారు. దేశం లో మొదట మెట్రో రైల్ 1984 లోనే కోల్ కాత లో ప్రారంభించారు. అయితే ఇప్పడు నీటి అడుగున మెట్రో నిర్మాణం తో భారత్ సరికొత్త రికార్డు ను తన ఖాతా లో వేసుకుందనే చెప్పాలి.

website 6tvnews template 2024 03 06T161422.688 దేశం లో మొట్ట మొదటి అండర్ గ్రౌండ్ మెట్రో - మోడీ

ఈ నిర్మాణం కోసం దాదాపు 120 కోట్ల వరకు ఖర్చు అయ్యిందని అధికారులు చెప్పారు. ఈ మెట్రో మార్గం పొడవు 16.6 కిలోమీటర్లు అని దీనిలో 10.8 కిలోమీటర్లు నదీ గర్భం లో నిర్మించామని అధికారులు చెప్పారు. దీనికి పునాది 2009 లోనే పడింది అని పాలకుల నిర్లక్ష్యం వల్ల పనులు ఆగిపోయాయని చెప్పారు. మోడీ ప్రభుత్వం వచ్చాక మరల 2017 లో దీనికి మరల రీ డిజైన్ చేసి ఎలాంటి ప్రకృతి విపత్తులు వచ్చిన తట్టుకునే విధంగా దీనిని నిర్మించామని చెప్పారు.

ఈ కారిడార్ కు బ్రిటన్ కు చెందినా కొన్ని ప్రఖ్యాత కంపెనీలు సహకారం అందించారని చెప్పారు. త్వరలో మరిన్ని వివరాలు అండ జేస్తామని అధికారులు చెప్పారు.

Leave a Comment