The Greatest of All Time Movie Poster: ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌ పోస్టర్ రిలీజ్.

The greatest of all time poster release.

The Greatest of All Time Movie Poster: లియో (Leo) సినిమాతో బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టిన దళపతి విజయ్ (Thalapathy Vijay) ఇప్పుడు లేటెస్టుగా మరో అదిరిపోయే మూవీతో ఫ్యాన్స్ ను అలరించేందుకు రెడీ అయ్యారు.

దర్శకుడు వెంకట్ ప్రభుతో (Venkat Prabhu)కలిసి చేస్తున్న మూవీ అప్ డేట్ ను అందించి అభిమానులను కొత్తం సంవత్సరం వేళ ఖుషీ చేశారు.

దళపతి కొత్త సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి బిగ్ స్క్రీన్ పైకి ఎప్పుడు వస్తుందా అంటూ ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

ఈ క్రమంలో మేకర్స్ తాజాగా మూవీ టైటిల్ ను ఖరారు చేసి కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. విజయ్ నటిస్తున్న ఈ కొత్త మూవీకి ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్‌ ‘(the greatest of all time) అనే టైటిల్ ను ఖరారు చేశారు మేకర్స్.

ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సైతం విడుదల చేసి ఫ్యాన్స్ కు న్యూ ఇయర్ కానుకను అందించారు. విజయ్‌ సినీ కెరీర్‌లో ఇది 68వ చిత్రం. ఈ మూవీని ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ (AGS Entertainment )సమంస్థ నిర్మిస్తుండగా వెంకట్‌ ప్రభు డైరెక్ట్ చేస్తున్నారు.

Vijay New Year Gift : విజయ్ కొత్త సంవత్సరం కానుక

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ (Thalapathy Vijay)కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన పెర్ఫార్మెన్స్ తో తమిళనాడు(Tamilnadu)లోనే కాదు తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.

52995811085 0d8c2b1e13 b The Greatest of All Time Movie Poster: ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌ పోస్టర్ రిలీజ్.

కొన్నేళ్లుగా చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోగా కొనసాగుతూ వైవిధ్యమైన కథలతో తెరముందు కనిపిస్తూ ఎంటర్టైన్ చేస్తున్నారు విజయ్. రీసెంట్ గా విడుదలైన లియో (Leo)మూవీ కూడా సెన్సేషనల్ హిట్ సాధించింది.

ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో మంచి కలెక్షన్లను రాబట్టింది. 2023లో అత్యధిక వసూళ్లను రాబట్టిన ఐదవ భారతీయ సినిమాగా లియో చరిత్ర సృష్టించింది.

ఏకంగా రూ.612 కోట్లకు పైగా కలెక్షన్లను వసూలు చేసింది. ఇప్పుడు మరోసారి రికార్డ్స్ క్రియేట్ చేసేందుకు ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్'(the greatest of all time)

అనే సినిమాతో రెడీ అయ్యాడు దళపతి. ఈ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ ఫ్యాన్స్ కు పిచ్చెక్కిస్తోంది. విజయ్ నయా అవతార్ ని చూసి అభిమానులు మురిసిపోతున్నారు.

Vijay in two different looks : రెండు భిన్నమైన లుక్స్‎లో విజయ్

‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ‘(the greatest of all time) పోస్టర్‌లో విజయ్‌ రెండు ఢిఫరెంట్ లుక్స్ లో కనిపించారు. ఒకటి వయసుపైబడిన క్యారెక్టర్ కాగా..

మరొకటి యంగ్‌ లుక్‌లోని విజయ్. అయితే వీరిద్దరూ ఫైటర్‌ జెట్‌ దుస్తుల్లో నడుస్తూ కనిపించారు. ఇక వీరిద్దరి బ్యాగ్రౌండ్‌లో భూమిపై పడిన పారాచూట్‌ ఉంది.

పోస్టర్‌పై ‘వెలుగు చీకటిని కబళించగలదు కానీ, చీకటి వెలుగును ఆక్రమించలేదు’ అంటూ రాసిన క్యాప్షన్ అందరిలో ఆసక్తిని పెంచుతోంది.

ఈ పోస్టర్ ను బట్టి ఇందులో విజయ్‌ డ్యుయల్ రోల్ పోషిస్తున్నారా? లేదా ఒక వ్యక్తి లైఫ్ లోని వివిధ స్టేజులను ఇలా చూపిస్తున్నారా? అన్నది సినిమా విడుదలైన తర్వాతే తెలియాల్సి ఉంది.

ఇక విజయ్ ఈ ప్రెస్టీజియస్ మూవీలో మీనాక్షి చౌదరి (Meenakshi Choudary) హీరోయిన్ గా కనిపించనుంది. అంతే కాదు సీనియర్ నటలు, ఒకప్పటి స్టార్ హీరోయిన్లు స్నేహ (Sneha), లైలాలు (Laila) కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

వీరితో పాటే ప్రశాంత్‌ (Prashanth), ప్రభుదేవా (Prabhudeva), జయరాం, యోగిబాబులు (Yogibaba)కీ రోల్స్ పోషిస్తున్నారు. ఈ సంవత్సరం దీపావళి పండుగ నాటికి సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు కోలీవుడ్ టాక్. ఇక ఈ మూవీకి యువన్‌ శంకర్‌ రాజా మ్యూజిక్ అందిస్తున్నారు.

Thalapathy vijay’s 68th film : దళపతి విజయ్ 68వ సినిమా

‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ‘ చిత్రం ఫుల్ లెన్త్ యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. రచన, దర్శకత్వం వెంకట్ ప్రభుది కాగా, అర్చన కల్పాతి ఈ మూవీని ప్రొడ్యూజ్ చేస్తున్నారు.

లియో సూపర్ డూపర్ హిట్ తర్వాత వెంటక్ చేయబోయే సినిమా ఇదే. ఈ సినిమాలోనూ డైరెక్టర్ విజయ్ నే హీరోగా సెలెక్ట్ చేసుకున్నాడు. ఇది దళపతి విజయ్ నటిస్తున్న 68వ చిత్రం.

భారీ తారాగణంతో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్‌ పూర్తైంది. చాలా కీలకమైన సీన్స్ ను మేకర్స్ ఇటీవలె బ్యాంకాక్‌లో షూట్ చేశారు.

ఈ క్రమంలో నిర్మాత అర్చన కల్పాతి మూవీ ఫస్ట్ లుక్‌ను ట్విట్టర్‌లో షేర్ చేసి ‘మా దళపతి ఆల్ టైమ్‌లో గొప్పవాడు’ అనే క్యాప్షన్ జోడించింది.

అయితే దళపతి 68వ సినిమాకు మొదటి నుంచి భిన్నమైన టైటిల్స్ వినిపించాయి, బాస్ లేదా పజిల్ అని ఉంటుందని న్యూస్ వచ్చింది. కానీ ఎట్టకేలకు ఈ మూవీకి అదిరిపోయే టైటిల్ అనౌన్స్ చేశారు మేకర్స్. ఫ్యాన్స్ లో ఆనందాన్ని నింపారు.

Leave a Comment