భారత్ లో టెస్లా కార్ ఎంట్రి కి లైన్ క్లియర్

WhatsApp Image 2024 03 15 at 5.40.26 PM భారత్ లో టెస్లా కార్ ఎంట్రి కి లైన్ క్లియర్

భరత్ లో EV ల తయారీ కి కేంద్రం అన్ని రకాలుగా సహకరిస్తుందని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. దీనివల్ల సాద్యమైనంత త్వరగా తమ గమ్యానికి చేరుకోవచ్చు అని తెలిపింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన E – వెహికిల్ పాలసీ వల్ల ఇంటర్ నేషనల్ EV తయారీ సంస్దలు మన దేశం లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. మన దేశం లో తన కార్లు యూనిట్ తీసుకురావాలని అనుకున్న ఎలాన్ మస్క్ కల అయిన టెస్లా కార్స్ కి రూట్ క్లియర్ అయ్యింది.

ఈ కొత్త EV పాలసీ వల్ల ఏ కంపెనీ అయిన కనీసం 4,150 కోట్లు దేశం లో పెట్టుబడిగా పెట్టినట్లయితే, తదనంతరం పలు రకాల రాయతీలు అందుతాయి. దీని వల్ల కొత్త సంకేతికత అందుబాటు లోకి రావడం జరుగుతుంది. దీనివల్ల పర్యావరణం కు మేలు కలుగుతుంది. ఈ టెస్లా సంస్ధను 3 సంవత్సరాలలో తయారి సంస్ద ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.

దీనికి అవసరమైన కొన్ని విదిబాగాలు స్దానికం గా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నియమ నిబందనలు పాటించి ఏ కంపెనీ అయిన 35 వేల డాలర్లు అంతే కంటే ఎక్కువ కల్గిన కార్లను 15% టాక్స్ తో సంవత్సరానికి 8 వేల EV కార్లను దిగుమతి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తాజా నిర్ణయం వల్ల టెస్లా కార్ల ఎంట్రీ కి లైన్ క్లియర్ అయ్యింది.

Leave a Comment