పోయిన స్మార్ట్ ఫోన్ ఆఫ్ లో ఉన్న ఇంటర్నెట్ లేకున్నా గుర్తించ వచ్చు !

mobile 3784238 1920 1635311367096 1635317382740 పోయిన స్మార్ట్ ఫోన్ ఆఫ్ లో ఉన్న ఇంటర్నెట్ లేకున్నా గుర్తించ వచ్చు !

ఇటీవల గూగుల్ సంస్ద డెవలపర్ కాన్పరెన్స్ కోసం గూగుల్ i /o 2024 సంవత్సర ఈవెంట్ విశేషాలు వెల్లడించింది. మే 14 న జరగబోయే కార్యక్రంమం లో వెర్షన్ అన్ద్రాయిడ్ 15 ను విడుదల చేయడానికి సిద్దం అవుతోంది.అంతే కాకుండా స్మార్ట్ ఫోన్ భద్రత విషయం లో బాగంగా పోయిన స్మార్ట్ ఫోన్ ఈజీ గా గుర్తించగల్గె ఒక ఫీచర్ గురించి కొన్ని కీలక విషయాలు వెలువడే అవకాశం ఉంది. దీని వల్ల ఉపయోగం ఏంటంటే ఒకవేళ మన స్మార్ట్ ఫోన్ ఆఫ్ లో ఉన్న కుడా ఈ ఫీచర్ పనిచేస్తుందని వార్తలు అందుతున్నాయి.క్రిందటి సంవత్సరం నుండే ఈ ఫీచర్ గురించి ఎన్నో వార్తలు వచ్చాయి. గూగుల్ ఆన్ద్రయిడ్ తాజాగా ఈ ఆఫ్ లైన్ ఫీచర్ అన్ద్రయిడ్ 15 లో వస్తుందని అనేక వార్తలు వస్తున్నాయి. ఈ ఫీచర్ ఆపిల్ లో find my network లాగా పనిచేయవచ్చని అంటున్నారు.

మనం పోగొట్టు కున్న స్మార్ట్ ఫోన్ లో ఇంటర్నెట్ లేకపోయినా పనిచేసే విధం గా మార్పులు తీసుకొచ్చారని నిపుణులు చెప్తున్నారు.మన ఫోన్ లో beacon సిగ్నలింగ్ ద్వారా ఇది పనిచేస్తుందని చెప్తున్నారు. అప్పుడు మన ఫోన్ స్విచ్ అఫ్ లో కుడా మన స్మార్ట్ ఫోన్ ఎక్కడ ఉన్న లొకేషన్ గుర్తించవచ్చు. ఈ ఫీచర్ గూగుల్ క్రింద ఏడాది లాంచ్ చెయ్యాలని అనుకుందని అయితే కొన్ని కారణాల వల్ల వెనకడుగు వేసారని గూగుల్ నిపుణులు చెప్తున్నారు.

తాజా గా అందుతున్న సమాచారం ప్రకారం దీనికి సంబందించి అడుగులు పడుతున్నట్లు చెప్తున్నారు. ఈ ఫీచర్ కనక అందుబాటులోకి వస్తే డివైస్ కి భద్రత తో పాటు అందులో ఉండే వ్యక్తి గత భద్రతను సెక్యూర్ గా ఉంచుతుంది.

ఒక వళ ధర్డ్ పార్ట్ యాప్ ద్వారా ఆ ఫోన్ లొకేషన్ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే వెంటనే మనల్ని అప్రమత్తం చేస్తుంది. ఈ ఫీచర్‌ ని ఉపయోగించడానికి అవకాసం పెరుగు తుంది. యూజర్లకు తమ మొబైల్‌లో అప్పుడప్పుడు ఇంటర్నెట్‌ సౌకర్యం అందుబాటులో లేకపోతే లోకేషన్‌ ఈ ఫీచర్‌ ద్వారా వారి ఫోన్ లోకేషన్‌ను తెలుసుకోవడానికి వీలు అవుతుంది.

అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ ఫీచర్‌ అన్ని స్మార్ట్‌ఫోన్లకు అందుబాటులోకి వచ్చే అవకాశం లేదని నిపుణుల ద్వార తెలుస్తోంది.త్వరలో లాంచ్ కానున్న గూగుల్ పిక్సల్ 9 స్మార్ట్ ఫోన్ లో ఈ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువారడానికి గూగుల్ ప్రయత్నిస్తోంది. అదేవిధం గా గూగుల్ పిక్సల్ 8 లో ఈ ఫీచర్ ని తీసుకువస్తుందని చెప్తున్నారు.ఈ ఫీచర్ తీసుకురావడానికి హార్డ్ వేర్ లో మార్పులు చేర్పులు చెయ్యాల్సి వస్తోందని దాని ఫలితంగానే ఆలస్యం అవుతోందని తెలుస్తోంది.

Leave a Comment