
The Marvels : ది మార్వెల్స్ లో సమంత సందడి.. వారే నా సూపర్ హీరోస్ అంటున్న సామ్
సూపర్ హీరోస్ అంటే తనకు చాలా ఇష్టం అని చెబుతోంది టాలీవుడ్ హీరోయిన్, చెన్నై చిన్నది సమంత. అందుకే మార్వెల్స్ సినిమా కోసం తాను ఎంతో ఆశక్తిగా ఎదురుచూస్తున్నట్టు చెప్పింది.
దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకి రానున్న సినిమా ది మార్వెల్స్. ఈ సినిమా తన ప్రమోషన్స్ కార్యక్రమాలను అనేక ప్రాంతాల్లో ఎంతో గ్రాండ్ గా నిర్వహిస్తోంది.
ఇందులో భాగంగానే సమంతను చిత్ర బృందం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ప్రచార కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఆహ్వానించింది. కార్యక్రమంలో భాగంగా సామ్ సినిమాకు సంబంధించి ఒక స్పెషల్ వీడియోను రిలీజ్ చేసి సినీ ప్రియులను మరింత ఉత్సాహపరిచింది.
అనంతరం సమంత మాట్లాడుతూ, ఇటువంటి సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని చెప్పింది. ఇప్పుడొస్తున్న ది మార్వెల్స్ సినిమాలో ఏకంగా ముగ్గురు సూపర్ హీరోలు ఉంటారని, ఇది నిజంగా త్రిల్లింగ్ కలిగించే అంశం అని తెలిపింది.
ఈ దీపావళి నాడు, ది మార్వెల్స్ సినిమాను థియేటర్లలో చూసి మరింత ఎంజాయ్ చేయాలనీ అంటోంది సమంత.

తానె గనుక అవెంజర్ అయితే సినీ రంగంలోని తన సహా నటులు ప్రియాంక చోప్రా, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, ఆలియా భట్ తో కలిసి ఈ ప్రపంచాన్ని కాపాడతానని అంటోంది.
అదే అవకాశం మరోలా వినియోగించుకోవాలంటే, తన అభిమానులతో కలిసి ఈ ప్రపంచాన్ని చెడు నుండి రక్షిస్తాను అని చెబుతోంది. ఇక నిజ జీవితంలో తన సూపర్ హీరోస్ అంటే మొదటగా అమ్మ పేరు చెప్పింది. ఆతరువాత స్థానం స్నేహితులకు ఇవ్వగా మూడవ స్థానం తన పెంపుడు జంతువులకి ఇచింది సామ్.
వీరంతా తన సూపర్ హీరోస్ అంటోంది. ఈ దీపావళికి చాలా మంచి సినిమాలు విడుదల అవుతున్నాయని, అవి అన్ని కూడా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నట్టు వెల్లడించింది. 2019లో విడుదలై సూపర్ హిట్ అయిన ‘కెప్టెన్ మార్వెల్’ ప్రమోషన్స్‌లోనూ సమంత పాలుపంచుకుంది.