Janvi Kapoor stunning Looks: అయ్యబాబోయ్ ఆ గౌను ధర రూ.87 లక్షలా..జన్వీ పాప మజాకా.
గత కొన్ని సంవత్సరాల క్రితం ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన చాలా మంది స్టార్ కిడ్స్‌లో జాన్వీ కపూర్ ఒకరు స్ట్రాంగ్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నప్పటికీ ఈ బ్యూటీ స్వతహాగా పైకి రావాలనే ఉద్దేశంతో తన అందంతో భారీ అభిమానులను సొంతం చేసుకుంటోంది.
‘ధడక్’ అనే మూవీతో బాలీవుడ్ లోకిఎంట్రీ ఇచ్చింది జాన్వీ. ఆ తర్వాత కెరీర్ ప్రారంభంలోనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ అలరిస్తూ వస్తోంది.
ఇక త్వరలో తెలుగులోనూ సందడి చేయబోతోంది ఈ చిన్నది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి జాన్వీ కపూర్ దేవర మూవీ తో అలరించేందుకు రెడీ అయ్యింది.
ఈ క్రమంలో జాన్వీ సోషల్ మీడియాలో దేవర అప్‌డేట్‌లతో పాటు అప్పుడప్పుడు హాట్ ఫోటో షూట్ ఫోటోలతో ఫాలోవర్స్ ను ఫిదా చేస్తుంటుంది.
లేటెస్టుగా జాన్వీ అదిరిపోయే గౌను చంకీల గౌనులో దిగిన హాట్ ఫోటోలను నెట్టింట్లో షేర్ చేసింది. మెరిసేటి గౌనులోనీళ్లలో తడిసిన జాన్వీ అందాలు కుర్రాళ్ల మతులు పోగొడుతున్నాయి.
బీ టౌన్ లో అత్యంత క్రేజ్, సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లలో జాన్వీ కపూర్ ఒకరు. అద్భుతమైన నటనా నైపుణ్యంతో పాటు ఉత్కంఠభరితమైన అందంతో జాన్వీ కపూర్ ఎప్పుడూ అందరినీ ఆకట్టుకుంటూనే ఉంటుంది.
దివంగత నటి అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా జాన్వీ తన తల్లి నిజమైన ఫ్యాషన్ ట్రెంట్స్ ను ప్రదర్శిస్తూ శభాష్ అనిపించుకుంటోంది.
అందరినీ విస్మయానికి గురిచే అద్భుతమైన ఫ్యాషన్ ట్రెండ్స్ ఫాలో అవుతూ ఎంతో మంది ఫ్యాషన్ లవర్స్ కు ఇన్స్పిరేషన్ గా నిలుస్తోంది. జాన్వీ లేటెస్ట్ లుక్స్ కూడా ఇంటర్నెట్ లో మంటలు రేపుతున్నాయి.
జన్వీ పూల్ దగ్గర మెరిసేటి గౌను ధరించి తడిసిన అందాలతో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
జాన్వీ కపూర్ హాట్ లుక్స్ అందరినీ అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ చిన్నది ఆక్వా బ్లూ-హ్యూడ్ మెరిసేటి స్లిప్ గౌనును తన లేటెస్ట్ ఫోటో షూట్ కోసం ఎన్నుకుంది.
ఈ డ్రెస్సు ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే . క్రిస్టల్ వర్క్ కలిగిన ఈ మెరుపుల గౌను ధర అక్షరాలా 87 లక్షల రూపాయలట. ఈ గౌనుకు మరింత అందాన్ని అద్దేందుకు హాట్ మేకప్ ను ఎన్నుకుంది.
హెయిర్ లూజుగా వదులుకుని బ్రాంజ్ బేస్ మేకప్ వేసుకుంది. కనులకు నీలం రంగులో స్మోకీ ఐ షాడోను దిద్దుగుని , చేతివేళ్లకు సొగసైన డైమండ్ రింగ్, లాకెట్ ను అలంకరించుకుంది. తన మనోహరమైన రూపంతో అందరిని మంత్రముగ్ధులను చేసింది జాన్వీ కపూర్.
జాన్వీ కపూర్ తెలుగులో కొరటాల శివ డైరెక్షన్ లో రూపొందుతున్న దేవర సినిమాలో ఎన్టీఆర్ కు జోడీ గా చేస్తోంది. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. ఇదే జాన్వీ మొదటి తెలుగు సినిమా.
దేవరలో జాన్వీ ఓ మత్స్యకారుని కూతురిగా కనిపించబోతోందని తెలుస్తోంది. ఆ మధ్య రిలీజ్ చేసిన జాన్వీ లుక్ చూస్తే అలాగే అనిపిస్తుంది.
దేవరతో పాటు జాన్వీకి మరో తెలుగు ఆఫర్ వచ్చిందని టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో తీయబోతున్న మూవీలో జాన్వీని హీరోయిన్ గా తీసుకోవాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో త్వరలో అధికారికంగా అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది.
ఈ మూవీతో పాటు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాలోను అమ్మడు ఛాన్స్ కొట్టేసిందని టాక్. బుచ్చిబాబు డైరెక్షన్ లో తీయబోతున్న సినిమాలో జాన్వీని హీరోయిన్గా ఖరారు చేసినట్లు సమాచారం.
ఇదిలా ఉంటే జాన్వీ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది. జాన్వీ తన ఫ్రెండ్ శిఖర్ పహారియా ప్రేమలో ఉందని,
అతనితో డేటింగ్ చేస్తోందని రూమర్స్ నెట్టింట్లో వస్తున్నాయి. అంతే కాదు ఈ జంట పలు చోట్ల కనిపించిన పిక్స్ కూడా వైరల్ అవుతున్నాయి. మరి ఈ వార్తల్లో నిజం ఎంత ఉంది అన్నది మాత్రం వేచి చూడాల్సిందే.