World Cup Final Match : 19వ తేదీన వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్..మ్యాచ్ వీక్షించనున్న మోదీ..
వన్డే ప్రపంచ కప్ పోటీల్లో ఇప్పటి వరకు భారత్ అద్భుతమైన ఆట తీరు కనబరిచింది. ఓటమి అనే మాట లేకుండా విజయ కేతనం ఎగురవేస్తూ వచ్చింది.
కాగా ఈ వన్డే ప్రపంచ కప్ చివరి అంకానికి చేసుకుంది. నవంబర్ 19వ తేదీ ఆదివారం మధ్యాహ్నం ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కి గుజరాత్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది.
అంతే కాదు ఆయన పేరుమీద ఉన్న స్టేడియం లో జరిగే ఫైనల్ మ్యాచ్ వీక్షించేందుకు ఆయన స్వయంగా విచ్చేస్తారని తెలుస్తోంది. దీంతో ఇప్పుడు దేశం మొత్తం గుజరాత్ వైపే చూస్తోంది.
పైగా ఈ ఫైనల్ మ్యాచ్ ను గ్రాండ్ గా ప్లాన్ చేశారని తెలుస్తోంది. మరి 2011 తరువాత భారత్ వేదికగా ప్రపంచ కప్ జరుగుతోంది అంటే ఆతిధ్యం ఇచ్చిన మన భారత్ లో ముగింపు వేడుకలు ఆమాత్రం ఉండాలి కదా.
ప్రధాని మోదీ తోపాటు బాలీవుడ్ సెలబ్రిటీలు, ప్రముఖ రాజకీయ నాయకులు సైతం ఈ మ్యాచ్ కు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయట. ప్రధాని మోదీ క్రికెట్ మ్యాచ్ వీక్షించేందుకు రావడం ఇది తొలి సారేం కాదు.
గతంలో బోర్డర్ గవాస్కర్ సిరీస్ లో భాగంగా ఇండియా, ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్ కు కూడా ఆయన హాజరయ్యారు. అయితే ఇప్పుడు అదే స్టేడియంలో జరగబోతున్న వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కి అయన రానున్నారు.
ఈ మ్యాచ్ కి మోదీ మధ్యలోనే చివరిలోనో రావడం కాకుండా, మొదటి నుండి చివరి వరకు మొత్తం వీక్షిస్తారని తెలుస్తోంది. ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ముగింపు వేడుకలను గట్టిగానే ప్లాన్ చేశారు.
మ్యాచ్ స్టార్ట్ అవ్వడానికి ముందు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ లోని సూర్యకిరణ్ టీమ్ ఎయిర్ షో నిర్వహించనుంది. పది నిమిషాల పాటు ఎయిర్ షో ఉంటుందని గుజరాత్ డిఫెన్స్ పీఆర్‌వో పేర్కొన్నారు.