Praja palana Program: రెండవ రోజు అనంతరం ప్రజాపాలన..పోటెత్తిన జనం.

Add a heading 2024 01 02T125639.167 Praja palana Program: రెండవ రోజు అనంతరం ప్రజాపాలన..పోటెత్తిన జనం.

Praja palana Program: ప్రజా పాలన కార్యక్రమం మరలా పట్టాలెక్కింది. నూతన సంవత్సరం సందర్భంగా రెండు రోజుల పాటు చిన్న బ్రేక్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) మరల తిరిగి ప్రజా పాలన ప్రోగ్రాం ను షురూ చేసింది.

ఈ ప్రజా పాలన కార్యక్రమం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగుతుంది. దీనిని రోజు మొత్తం మీద రెండు విడతలుగా నిర్వహిస్తారు.

ఈ సదస్సులను డిసెంబర్ 28 వతేదీన మొదలుపెట్టి డిసెంబర్ 30వ తేదీ వరకు కొనసాగించారు. తెలంగాణ రాష్ట్రం లోని 3868 గ్రామాలు, 8697 మున్సిపాలిటీ వార్డుల్లో సదస్సులు నిర్వహించారు అధికారులు.

40 లక్షలు దాటిన దరఖాస్తులు : Applications exceeded 40 lakhs

ఇక ఈ కార్యక్రమం లో పాల్గొని లబ్ది పొందేందుకు జనం పోటెత్తుతున్నారు. దీనికోసం పట్టణాల్లో వార్డు సదస్సులు నిర్వహిస్తుండగా, పల్లెల్లో గ్రామ సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు.

ఇప్పటివరకు ప్రజాపాలన కోసం 40 లక్షల 57 వేల 952 దరఖాస్తులు ప్రభుత్వానికి అందాయి. ఇక రానున్న ఐదు రోజుల్లో కోటి కి పైగా దరఖాస్తులు అందే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అధికారులు.

revanth reddy 5 Praja palana Program: రెండవ రోజు అనంతరం ప్రజాపాలన..పోటెత్తిన జనం.

ఇది ఇలా ఉంటె పింఛన్లు, రైతు భరోసా ద్వారా లబ్ది పొందుతున్న వారు మరలా దరఖాస్తులు సమర్పించాల్సిన అవసరం లేదని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) స్పష్టం చేశారు.

అయితే ఈ ప్రజాపాలన విషయంలో దరఖాస్తుల తీరు వాటి నిబంధనలు విధి విధానాలపై ప్రజల్లో కొన్ని సందేహాలు ఉన్నాయి.

అయితే ఈ ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలు ఎక్కువగా ఆరు గారంటీలు(Six guarantees), రేషన్ కార్డుల(Ration Cards) కోసం దరఖాస్తు పెట్టుకున్నట్టు తెలుస్తోంది.

దరఖాస్తుల కొరత పై సీఎం సీరియస్ : CM is serious about lack of applications

ఇక ఈ కార్యక్రమం లో ప్రజలకు అందించాల్సిన దరఖాస్తులు కొరవడినట్టు వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన సీఎం రేవంత్, ప్రజలకు సరిపడినన్ని దరఖాస్తులు అందుబాటులో ఉంచాలని,

బయట కొనుక్కునే పరిస్థితి రాకూడదని పేర్కొన్నారు. ఇక దరఖాస్తు స్వీకరణ కార్యక్రమం పూర్తిగా ముగిసిన అనంతరం

దరఖాస్తుల ఆధారంగా వచ్చిన సమాచారాన్ని బట్టి పధకాలు అమలు కోసం ఎంత మేర నిధులు కేటాయించాలి, వాటి అమలుకు విధి విధానాలు ఎలా ఉండాలి అనే దానిపై నిర్ధారణకు వస్తారని తెలుస్తోంది.

Leave a Comment