2024 up coming projects: భారత దేశం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టులు..ఇవి పూర్తయితే ఇన్ని లాభాల..కేంద్ర ప్రభుత్వం వీటిని అందుకే చేపట్టిందా.
భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఏ ఏడాదికాయేడాది కొత్త ప్రాజెక్టులను చేపడుతూ వచ్చింది. దానిని ఇప్పటికి కొనసాగిస్తూనే ఉంది.
ఆలా చేయడం వల్లనే ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా అనేక పెద్ద పెద్ద రహదారులు, అనేక ప్రాంతాలను కలుపుతూ పెద్ద పెద్ద వంతెనలు, సెమి హై స్పీడ్ రైళ్లు, అంతరిక్షం లోకి పంపబడే రాకెట్లు, చంద్రయాన్ లు ఇలా అనేకానేకమైన ఘనతలు సాధిస్తూనే ఉన్నాము.
వాటిని అక్కడితో ఆగకుండా భవిష్యత్తులో కూడా ఇలాంటి కొంగొత్త ఆవిష్కరణలు చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటూనే ఉంది ప్రభుత్వం. అందుకు అనుగుణంగానే 2024 వ సంవత్సరానికి సంబంధించి కూడా కొత్త ప్రాజెక్టులు చేపట్టనుంది.
ఈ ప్రాజెక్టులలో కొన్నిటికి శంకుస్థాపన కాగా, కొన్ని శంకుస్థాపన చేయడం నిర్మాణాలు కొనసాగుతున్న క్రమంలో ఉన్నాయి. కొన్ని 2024 సంవత్సరంలో చేపట్టాలని ప్రణాళిక రూపొందిస్తున్న దశలో ఉన్నాయి.
అయితే ఈ కొత్త ప్రాజెక్టులే భారతీయ జనతా పార్టీకి 2024 లోక్ సభ ఎన్నికలకి పెద్ద పెట్టుబడి అని ఆ పార్టీ మరో సారి కేంద్రం లో కొలువుదీరేందుకు సహకరిస్తాయని కూడా భావిస్తున్నారు. అయితే అవి ఎలాంటి ప్రాజెక్టులు ఏంటి అనేది చూద్దాం.
That is the reason for undertaking projects:
గుజరాత్ భూకంప బాధితుల జ్ఞాపకార్థం భుజ్‌లో ‘శాంతి వాన్’ను ఆవిష్కరించడం, దేశీయంగా అభివృద్ధి చేసిన మొట్టమొదటి విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్-విక్రాంత్‌ను శాశ్వతంగా ప్రారంభించడం, దేశ రాజధానిలో సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం వరకు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనేక కీలక ప్రాజెక్టులను ప్రారంభించారు.
ఆయన ప్రాజెక్టులన్నీ వృద్ధికి, అలాగే జాతీయ భద్రతకు కీలకమైన ప్రాజెక్టులే కావడం గమనించదగ్గ సంతోషించదగ్గ విషయం. వీటిని ప్రారంభించడం తోపాటు 2024 లోక్‌సభ ఎన్నికల ప్రచార ప్రణాళికకు పునాది వేయడం కూడా సమానంగానే చూస్తున్నారు కొందరు విశ్లేషకులు.
ఎప్పుడైనా అధికారంలో ఉన్న ప్రభుత్వం ఎన్నికల సమయంలో గాని అధికారం చేపట్టిన సమయంలో గాని తాను చేసిన వాగ్దానాలను నిలబెట్టుకుంది అంటే అది వారి పార్టీకి బలాన్ని చేకూరుస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు. ఇక ప్రాజెక్టుల సంగతి చెప్పనవసరం లేదు. వాటిని ప్రారంభించడం వల్ల దేశానికి ఎప్పుడు ఉపయోగమే.
Bullet train:
బుల్లెట్ ట్రైన్ ఈ పేరు వినగానే అర్ధమైపోతుంది కాగా ఇది వేగంలో బులెట్ మాదిరిగా ప్రయాణం చేయగలదని, తుపాకీలో ఉండే బుల్లెట్ అంత వేగంగా కాకపోయినా వేగంగానే వెళుతుంది. ఈ రైలు గంటకు 300 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేయగలుగుతుంది.
ఇప్పటికే జపాన్ వంటి దేశాలలో ఈ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. ఈ రైలు టోక్యో నుండి ఒకసా వరకు వెళ్లేందుకు రెండున్నర గంటల సమయం మాత్రమే తీసుకుంటోంది.
ఆ రెండు నగరాల మధ్య ఉన్న దూరం 379 కిలోమీటర్లు. ఈ దూరాన్ని చేరుకోవడానికి సాధారణ రైళ్లు 5 గంటల సమయం తీసుకుంటాయి.
ఈ బుల్లెట్ ట్రైన్ అయితే రెండున్నర గంటల సమయంలోనే చేరుకుంటుంది. ఇప్పటికే ఈ తరహా ఫాస్ట్ రన్నింగ్ రైళ్లు జపాన్ తో సహా అనేక దేశాల్లో అందుబాటులో ఉన్నాయి.
ప్రజలను వేగంగా వారి గమ్య స్థానాలకు చేరుస్తున్నాయి. వీటి ముందు భాగం నిర్మాణం వినూత్నంగా ఉంటుంది. గాలి దీని వేగాన్ని నియంత్రించకుండా ఉండేందుకు విమానం మాదిరిగా దీని ముందు భాగం కూడా సన్నగా ఉంటుంది. కాబట్టి వేగంగా దూసుకెళ్లేందుకు వీలుంటుంది.
చైనా, ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీ వంటి దేశాల్లో ఈ బుల్లెట్ రైళ్లు అక్కడి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. భవిష్యత్తులో ఈ తరహా బుల్లెట్ రైళ్లను మన దేశంలో కూడా అందుబాటులోకి తీసుకురావాలని భారత ప్రభత్వం నిశ్చయించింది
బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు మన భారత దేశంలో ప్రారంభించేందుకు 2017 లో బీజం పడింది. ఈ ప్రాజెక్టును మొదటగా ముంబై అహ్మదాబాద్ నగరాల మధ్య దీనిని నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకు అనుగుణంగా పనులు కూడా జరుగుతున్నాయి.
ఎయిట్ ఈ బుల్లెట్ ట్రైన్ ను నడిపించాలంటే కేవలం రైలు దాని బోగీలు కొంటె సరిపోదు, దాని వేగాన్ని తట్టుకునే మాదిరిగా రైలు పట్టాలను కూడా రూపొందించాలి. కాబట్టి అందుకు సమయం తీసుకుంటుంది. ఇక ముంబై అహ్మదాబాద్ నగరాల మధ్య ఉన్న దూరం 522 కిలోమీటర్లు.
ఇప్పుడు ఈ దూరం ప్రయాణించడానికి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కి అయితే 5 గంటల 50 నిమిషాల సమయం పడుతోంది. అయితే ఈ బుల్లెట్ రైలు గనుక అందుబాటులోకి వస్తే మరింత వేగంగా చేరుకునేందుకు వీలవుతుంది.
ఈ ప్రాజెక్టును భారత ప్రభుత్వం 2026 ఆగస్టు నాటికి 100 శాతం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికి ఈ బుల్లెట్ రైలు ప్రాజెక్టు 36 శాతానికి కంప్లీట్ అయినట్టు
తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్టు కోసం భారత సర్కారు జపాన్ సర్కారుతో కలిసి పూర్తి చేసేలా ఒప్పందం కుదుర్చుకుంది. అందుకే జపాన్ సర్కారు ఈ ప్రాజెక్టు లో 88 వేల కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టింది.
ఈ ప్రాజెక్టు పూర్తి చేయడం వల్ల ఇది మనదేశంలో ఒక గొప్ప కార్యక్రమంగా మిగిలిపోవడమే కాక, భారత దేశ ఆర్ధిక వ్యవస్థకు ఊతం లభిస్తుంది.
The seed was sown:
సెంట్రల్ విస్టా అనేది ఒక బృహత్ కార్యక్రమం దీనిని భారత సర్కారు ఎంతో ప్రతిష్ఠమకంగా తీసుకుంది. దీనిని 2024 లోగా పూర్తికి చేయాలనీ కృత నిశ్చయంతో ఉంది. దీని నిర్మాణ వ్యయం సుమారు 22 వేల కోట్ల రూపాయలు అవుతుందని అంచనా వేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని భవనాలు దేశ రాజధాని అయిన ఢిల్లీలోని ల్యూటెన్స్ జోన్ లో ఉన్నాయి. అయితే వాటన్నిటిని అభివృద్ధి చేయాలనీ బీజేపీ సర్కారు కంకణం కట్టుకుంది.
ఇప్పటికే ఉన్న భవనాలను అభివృధి చేయడం ఎలాగ అని సామాన్య ప్రజలకు సందేహం రావచ్చు. ఢిల్లీలోని ఇండియా గేట్ నుంచి రాష్ట్రపతి భవనం వరకు ఉన్న అన్ని కట్టడాలను పునర్నిర్మించడం దీని ముఖ్య ఉద్దేశం.
ఇందులో భాగంగానే కొత్త పార్లమెంట్, కామం సెంట్రల్ సెక్రటేరియట్ వంటి వాటిని నిర్మించదలచారు. అయితే ఇప్పటికే పార్లమెంట్ కొత్త భవన నిర్మాణం పూర్తయినట్టు తెలుస్తోంది.
సుమారు 64,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో నయా పార్లమెంట్ బిల్డింగ్ నిర్మించదలచారు. అందులోనే లోక్‌సభ, రాజ్యసభ, కానిస్టిట్యూషన్ హాల్ తో పాటు ఇతర సదుపాయాలు ఉండేలా ప్లాన్ చేశారు.
Central Secretariat:
కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ విషయానికి వస్తే దీనిని 60000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మిస్తారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖల కార్యాలయాలు ఈ కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ లో ఉంటాయి. రాజ్‌పథ్ పునరుద్ధరణ :
రాజ్‌పథ్ అనేది రాష్ట్రపతి భవనం నుంచి ఇండియా గేట్ వరకు ఉండే మూడు కిలోమీటర్ల మార్గం. ఇప్పుడు సెంట్రల్ విస్టా లో భాగంగా దీనిని కూడా పునర్నిమించనున్నారు.
Also in Central Vista are:
ఇక పొతే ప్రధాని నివాసం, ఉపరాష్ట్రపతి నివాసం తోపాటు మరికొన్ని భవనాలను కూడా సెంట్రల్ విస్టా లో భాగంగా పునర్నిర్మించనున్నారు.
కొత్తగా నిర్మించబోయే ఆ భవనాలు మరింత అధునాతన సౌకర్యాలను కలిగి ఉంటాయని తెలుస్తోంది. ఇక ఈ సెంట్రల్ విస్టా అనేది హస్తిన కీర్తి కిరీటంలో కలికితురాయిగా ఉండబోతోంది అని తెలుస్తోంది. అయితే ఈ భవనాలపై కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి.
ఈ కొత్త భవనాల రాకతో ఎప్పటినుండో ఉన్న వారసత్వం పై ప్రభావం ఉంటుందని అంటున్నారు. కానీ మోదీ సర్కారు మాత్రం దీనిని 2024 కి అందుబాటులోకి తీసుకురావాలని చూస్తోంది.
Bharat Mala Project:
భారత దేశంలో రవాణా వ్యవస్థను మరింత మెరుగు పరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రాజెక్టును చేపట్టింది. దాని పేరే భారత్ మాలా, ఈ ప్రాజెక్టును 2014 లో ప్రారంభించారు. అయితే 2022 కె పూర్తి చేసేలా లక్ష్యాన్ని పెట్టుకుని ప్రణాళిక రచించినప్పటికీ ఇంకా పూర్తికాలేదు.
ఎలాగైనా ఈ పనులను 2024 లోగా పూర్తిచేయాలని ఇండియన్ గవర్నమెంట్ పనిచేస్తోంది. భారతదేశంలోని 44 ఆర్థిక కారిడార్లను కలుపుతూ వెళుతుంది ఈ భారీ ప్రాజెక్టు. ఇలా ఆర్ధిక కారిడార్లకు కనెక్టివీటిని ఇస్తుంది అంటే దీని వల్ల రవాణా మరింత మెరుగుపడుతుంది అని అర్ధం చేసుకోవచ్చు.
అంతే కాక ఈ 44 కారిడార్లు కూడా రవాణా, వాణిజ్యం ఇంకా పెట్టుబడులకు ఊతం ఇవ్వడానికి రూపొందించబడ్డాయి.
దీనివల్ల పెట్టుబడులు కూడా వచ్చే అవకాశం ఎక్కువ గా ఉంటుంది. ఎప్పుడైతే పెట్టుబడులు వస్తాయో, అప్పుడు ప్రత్యక్ష పరోక్ష ఉపాధి అవకాశాలు కూడా వెతుక్కుంటూ వస్తాయి. అటువంటి కారిడార్లను ఈ భారత్ మాలా ప్రాజెక్టు ద్వారా కలపడం వల్ల మరింత అభివృద్ధి పొందడానికి వీలవుతుంది.
ఈ ప్రాజెక్టు లోని ముఖ్య ఉద్దేశం నెట్వర్క్ మెరుగుదల, ఈ నెట్వర్క్ మెరుగుదలలో భాగంగా దేశంలో ఇప్పటివరకు ఉన్న రహదారులను మెరుగు పరిచేందుకు దృష్టి పెట్టనున్నారు.
అందులో భాగంగా రహదారులను వెడల్పుచేయడమే కాకుండా నాణ్యతను కూడా పెంచుతారు. అంతేకాకుండా ఇప్పుడు ఉన్న రహదారులను మల్టి ఫేస్ రహదారులుగా మారుస్తారు.
ఈ ప్రాజెక్టు గనుక కంప్లీట్ అయితే భారత దేశ రవాణా అనేది మరింత మెరుగ్గా, సమర్ధవంతంగా, సురక్షితంగా మారుతుంది. దాని వల్ల రహదారులపై ప్రమాదాలు కూడా తగ్గేందుకు దోహదపడుతుంది.
మరీ ముఖ్యంగా రవాణా సమయాన్ని తగ్గిస్తుంది, ఎప్పుడైతే రవాణా సమయం తెగ్గుతుందో ఖర్చు కూడా ఆటోమాటిక్ గా తగ్గి తీరుతుంది.
Sagaramala Project:
భారతమాల ప్రాజెక్టు అంటే రోడ్డు రవాణా వ్యవస్థ గురించి అని మనం అర్ధం చేసుకున్నాం. మరి సాగరమాల ప్రాజెక్టు అంటే ఇది జల రవాణా అంటే ముఖ్యంగా పోర్టుల గురించి అని చెప్పకనే అర్ధం అవుతోంది.
భారత దేశంలో సువిశాలమైన తీరా ప్రాంతం ఉంది. అనేక చోట్ల పోర్టులు కూడా ఉన్నాయి. దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలంటే తీరప్రాంత అభివృద్ధి కూడా ఆవశ్యకమే, కాబట్టే కేంద్రం లో ఉన్న సర్కారు తీర ప్రాంత అభివృద్ధిపై దృష్టి సారించింది.
అందుకే ఈ సాగర్ మాలా ప్రాజక్టును చేపట్టింది. దేశంలో 12 నౌకాశ్రయాలను అభివృద్ధి చేసేందుకు కేంద్ర క్యాబినెట్ 2015 వ సంవత్సరంలో ఈ ప్రాజెక్టుకు ఆమోద ముద్ర వేసింది.
2015 మార్చి నెలలో ఆమోదం పొందిన ఈ ప్రాజెక్టు, 2015 జూలై నెలలో బెండుగులూరు లో ప్రారంభ కార్యక్రమాన్ని కూడా పూర్తిచేసుకుంది. దీనికోసం నేషనల్ సాగరమాల అపెక్స్ కమిటీ పేరుతొ ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు.
ఈ కమిటీలో కేంద్ర క్యాబినెట్ మంత్రులు, వివిధ రాష్ట్రల ముఖ్య మంత్రులు ఉంటారు. ఇందులో భాగంగా ఇప్పుడు ఉన్న కొన్ని నౌకాశ్రయాలను ఆధునీకరిస్తారు.
అలాగే వివిధ పోర్టుల్లో జరిగే మేజర్ ఆపరేషన్లను సక్రమంగా జరిగేలా చూసుకోవడం దీని ముఖ్య ఉద్దేశం. ఇక ఈ ప్రాజెక్ట్ లో భాగంగా 1200కు పైగా చిన్న, పెద్ద దీవులను అనుసంధానం చేసే విధంగా 189 లైట్‌హౌస్‌లను నిర్మిస్తారు.
How many jobs will come:
ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యాలను గమనిస్తే భారతదేశపు ఎగుమతిలను 110 బిలియన్ డాలర్లకు పెంచాలనే లక్ష్యంతో దీనిని టేకప్ చేసినట్టు తెలుస్తోంది.
అలాగే ఈ ప్రాజెక్టు కంప్లీట్ అయితే ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు 10 మిలియన్ల వరకు వస్తాయని అంచనా వేస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా తీరప్రాంత అభివృద్ధి మెరుగుపడుతుంది.
సాగరమాల ప్రాజెక్టు భారతదేశాన్ని ఒక ప్రముఖ వాణిజ్య మరియు ఆర్థిక కేంద్రంగా మార్చడంలో సహాయపడుతుంది అని విశ్లేషకులు కూడా భావిస్తున్నారు.