ఏ పూజా కార్యక్రమాలు చేసిన ముందు గణపతిని పూజించడానికి కారణం

The reason for worshiping Ganapati before doing any puja activities

మనం ఏ దేవుడుకి సంభందించిన పూజా క్రతువులు చేసిన ముందు గణపతి పూజించడానికి కారణం గణపతి దేవ గణాలలో ప్రధముడు గా ఉండడం ఒక కారణం. దీనికి ఒక చిన్న వృత్తాతం ఉంది అది ఏంటంటే గణపతి కి శివుడు కి జరిగిన చిన్నపాటి వాగ్యుద్ధం లో శివుడు గణపతి సంహరిస్తాడు. అప్పుడు పార్వతి కోరిక మీద మరల గణపతి ని బ్రతికించి గజముఖమును శిరస్సుగ ధరించమని చెప్పి ఆశ్వీరదిస్తాడు శివుడు. ఒకనాడు గజాసురుడు అనే రాక్షసుడు కి శివుడు ఇచ్చిన వరం వలన గణపతి గజ ముఖమును శిరస్సుగ ధరిస్తాడు.

ఆ సమయం లో అందరి దేవుళ్ళు కలిసి ఇచ్చిన వరమే ఇది ఎవరైనను ఏ పూజా కార్యక్రమాలు నిర్వహించిన ముందుగ గణపతిని ఆరాధించిన తర్వాతే వారు అనుకున్న పూజలు నిర్వహించాలి అని, అలా చెయ్యనిచో ఆ పూజకు అర్హత లేనిదని దానికి ఎటువంటి ఫలితం ఉండదని త్రిమూర్తులు చెప్పడం వలన మనం ఏ కారక్రంమం చేసిన ముందుగా గణపతి పూజ చేసిన తర్వాతే మిగిలిన పూజలు నిర్వహించడం అనేది తర తరాల నుండి వస్తున్న సాంప్రదాయం. అంతే కాదు గణపతి నాలుగు దిక్కులకు అధిపతి గా ఉన్నాడు.

ఈ గణపతి అరాధించడం వలన నాలుగు దిక్కులలో ఉండే సకల దేవతలు ఆ పూజ కార్యక్రమం జరిగే ప్రదేశానికి వస్తారని పురాణాలలో చెప్పబడింది. అయితే నాలుగు దిక్కుల వైపు నుండి కొన్ని దుష్ట శక్తులు కూడా ఆ పూజ జరిగే ప్రదేశానికి వస్తారని, మనం గణపతి పూజ చేయ్యడం వలన ఆయన తన పాశంతో దుష్ట శక్తులను భందించి ఉంచుతాడు అని పురాణాలలో చెప్పడం జరిగింది. అందు వలన మనం నిర్వహించే ఏ శుభకార్యాలలో అయిన ఎటువంటి విఘ్నాలు రాకుండా రక్షగా ఉంటాడు కాబట్టి మనం ముందుగా గణపతిని పూజించడం లో ఉన్న ప్రత్యేక ఆంతర్యం.

Leave a Comment